7.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై మరో హత్యాయత్నం!
కీవ్,మార్చి 28(జనంసాక్షి): ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీని అంతమొందించేందుకు రష్యా తీవ్రంగా కృషి చేస్తోందా? ఇందుకు అనేక పన్నాగాలు పన్నుతూనే ఉందా? అంటే ఔననే అంటోంది ఉక్రెయిన్. తమ అధ్యక్షుడిపై తాజాగా మరో హత్యాయత్నం విఫలమైందని ఉక్రెయిన్ వెల్లడిరచింది. జెలెన్స్కీని చంపేయడమే లక్ష్యంగా వచ్చిన 25 మందితో కూడిన రష్యన్ స్పెషల్ సర్వీసెస్ సైనిక బృందాన్ని స్లోవేకియా`హంగేరి సరిహద్దుల్లో ఉక్రెయిన్ సైన్యం అదుపులోకి తీసుకుందని ఉక్రెయిన్లోని కీవ్పోస్ట్ అనే వార్తా సంస్త తెలిపింది.‘వొలొదిమిర్ జెలెన్స్కీపై మరో హత్యాయత్నం విఫలమైంది. ఈసారి రష్యన్ ప్రత్యేక సేనల నేతృత్వంలోని 25 మంది సైనిక బృందం స్లోవేకియా`హంగేరి సరిహద్దు సవిూపంలో పట్టుబడిరది. ఉక్రెయిన్ అధ్యక్షుడిని అంతమొందించడమే వారి లక్ష్యం’ అని కీవ్పోస్ట్ ట్విటర్లో పేర్కొంది. రష్యా ‘టార్గెట్ నంబర్ వన్’ నేనేనని సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి జెలెన్స్కీ చెబుతూనే ఉన్నారు. తన కోసం, తన కుటుంబం కోసం రష్యా ప్రత్యేక దళాలు వెతుకుతున్నాయని ఆరోపించారు.రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడిపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈనెల ప్రారంభంలో వారంరోజుల్లోనే మూడుసార్లు హత్యాయత్నం జరగ్గా ఆయన తప్పించుకున్నట్లు ‘ది టైమ్స్’ వార్తాసంస్థ కొద్దిరోజుల క్రితం తెలిపింది. ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవడంతో మాస్కో ప్రయత్నం విఫలమైనట్లు పేర్కొంది. కీవ్ శివార్లలో జెలెన్స్కీని హత్య చేసేందుకు చేసిన ప్రయత్నాలను ఉక్రెయిన్ తిప్పికొట్టినట్లు వెల్లడిరచింది.
8.రానున్న 5 రోజుల్లో ఎండలే ఎండలు
` గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతయాన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్,మార్చి 28(జనంసాక్షి): తెలంగాణలో రాగల 5 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. మరోవైపు రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు విదర్భ నుంచి ఇంటీరియర్ కర్ణాటక విూదుగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9 కి.విూ. ఎత్తు వరకు కొనసాగుతుందని పేర్కొంది.
9.చైనాలో పెగిరిన కరోనా ఉద్ధృతి..
` 2.6కోట్ల జనాభాగల నగరం లాక్డౌన్లోకి..!
బీజింగ్,మార్చి 28(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి అదుపులోనే ఉన్నప్పటికీ చైనాలో మాత్రం వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో చాలా నగరాలు లాక్డౌన్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘై కూడా లాక్డౌన్లోకి జారుకుంది. దీంతో 2.6కోట్ల జనాభా కలిగిన నగరంలో పౌరులందరికీ కొవిడ్ పరీక్షలను చేపడుతున్నారు. అయితే, చైనాలో ఇంతపెద్ద నగరంలో కొవిడ్ ఆంక్షలు అమలు చేయడం ఇదే తొలిసారి.షాంఘై నగరంలో ఆదివారం ఒక్కరోజే 3450 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం ఇక్కడే రికార్డయ్యాయి. వీటిలో అత్యధికం లక్షణాలు లేనివే ఉన్నాయని. కేవలం 50 మందిలోనే కొవిడ్ లక్షణాలు కనిపించాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు నిర్ణయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో దాదాపు రెండున్నర కోట్లకుపైగా జనాభా కలిగిన షాంఘై నగరంలో సోమవారం నుంచి లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే, ఈ నగరంలో ఒకేసారి కాకుండా రెండు దఫాల్లో ఈ లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు వెల్లడిరచారు.నగరంలో కొవిడ్ ఆంక్షల దృష్ట్యా అన్ని వాణిజ్య కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజారవాణా మూసివేయాలని షాంఘై అధికారులు ఆదేశించారు. నగరం నుంచి రాకపోకలపైనా ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని.. నిత్యావసర సరుకులు ఇంటికి చేరువలో వదిలి వెళ్లిపోతామన్నారు. ఇలా లాక్డౌన్ ఆంక్షలు సోమవారం నుంచి మొదలు కానున్నట్లు అధికారులు ప్రకటించగానే షాంఘై ప్రజలు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా నిత్యావసర వస్తువులను అధిక మొత్తంలో కొనుగోలు చేశారు. దీంతో నగరంలోని సూపర్ మార్కెట్లన్నీ ఆదివారం రోజే ఖాళీ అయిపోయాయి.ఇదిలాఉంటే, చైనాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా జిలిన్ ప్రావిన్సులో కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు 56వేల కేసులు వెలుగు చూశాయి. తాజాగా షాంఘైలో నిత్యం 3వేలకు పైగా కేసులు రావడంతో చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ నుంచి పొంచివున్న ముప్పును తగ్గించేందుకే నగరం మొత్తం కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యామని స్థానిక వైద్యాధికారి వూ ఫ్యాన్ వెల్లడిరచారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం, ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను రక్షించడంతోపాటు డైనమిక్ జీరో కొవిడ్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
10.కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
` టైరు పేలి కారును ఢీకొట్టిన బస్సు..
` ఐదుగురి మృతి
కామారెడ్డి,మార్చి 28(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్(ఎం) గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నెంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లికి చెందినవారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
11.ఇంటి వద్దకే రేషన్!’
` పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక ప్రకటన
చండీగఢ్,మార్చి 28(జనంసాక్షి):పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం కీలక ప్రకటన చేశారు. పేదలు ఇకపై రేషన్ దుకాణాల ముందు ప్రజలు బారులు తీరాల్సిన అవసరం లేదనీ.. వారి ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్ను సరఫరా చేయనున్నట్టు వెల్లడిరచారు. అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ఆప్షనల్ మాత్రమేనన్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ‘‘రేషన్ సరకుల్ని ప్రజల ఇంటి వద్దకే పంపిణీ చేయాలని ఆప్ సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం కింద నాణ్యమైన రేషన్ సరకుల్ని లబ్ధిదారులకు అందించబోతున్నాం. ఇకపై ఎవరూ క్యూలలో ఉండాల్సినవసరంలేదు/దీని కోసం సెలవు పెట్టాల్సిన పనీలేదు. మా అధికారులే లబ్ధిదారులకు ఫోన్ చేసి విూకు అనువైన సమయంలో వచ్చి సరకులు పంపిణీ చేస్తారు. ఈ పథకం ఐచ్ఛికమే. ఎవరికైనా రేషన్ డిపో దగ్గర్లోనే ఉంటే వారు వెళ్లైనా తెచ్చుకోవచ్చు’’ అన్నారు.‘‘దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ పలు కారణాల వల్ల నిలిచిపోయింది. కానీ పంజాబ్లో ఈ పథకాన్ని అమలు చేస్తాం. విజయవంతంగా కొనసాగిస్తాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా పేదలు, సామాన్యులు సరకులు పొందేందుకు ఇప్పటికీ రేషన్ డిపోల ముందు క్యూలో నిలబడాల్సి వస్తోంది. ఈ డిజిటల్ యుగంలో అనేక ఆహార వస్తువులు, నిత్యావసరాలు ఒక్క ఫోన్ కాల్తో ఇంటి ముంగిటకు వచ్చిపడుతున్నాయి. కానీ, పేదలు.. ముఖ్యంగా దినసరి వేతనానికి పనిచేసేవారు రేషన్ కోసం ఆరోజు తమ పనిని వదులుకోవాల్సి వస్తోంది. రెక్కాడితే గానీ పూటగడవని కుటుంబాలు రేషన్ కోసం పని మానుకోవడం ఎంతో బాధాకరం. అనేకమంది వృద్ధ మహిళలు రెండు కి.విూల మేర నడిచి వెళ్లి రేషన్ డిపోల నుంచి సరుకులు తెచ్చుకోవడం నాకు తెలుసు. ఇలాంటి కష్టాలు ఇకపై ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేయాలి. ప్రజలకు సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వాలు ఉండాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టడానికి, సమస్యలు సృష్టించడానికి కాదు’’ అన్నారు.
పంజాబ్లో మొదలైతే.. ఇతర రాష్ట్రాల ప్రజల నుంచి డిమాండ్లు!
మరోవైపు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటనపై దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హర్షం ప్రకటించారు. పంజాబ్ సీఎం ప్రకటన ఎంతో గొప్పదనీ.. ఇది పేద ప్రజలకు మేలు చేస్తుందన్నారు. ఒకసారి పంజాబ్లో ఇంటివద్దకే రేషన్ సరకుల పంపిణీ పథకం మొదలైతే.. ఇతర రాష్ట్రాల ప్రజల్లో ఈ డిమాండ్ మొదలవుతుందని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఈ పథకాన్ని మొదలుపెట్టేందుకు తాము ప్రయత్నించగా.. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలుకాకుండా అడ్డుపడిరదని ఆరోపించారు. ఆలోచనకు సమయం వస్తే.. అది ఆగదన్నారు.
12.బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహబాహీ
` పరస్పరం కొట్టుకున్న శాసనసభ్యులు
కోల్కతా,మార్చి 28(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్ శాసనసభలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బీర్భూం సజీవదహనాల ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చి ఎమ్మెల్యేలు పరస్పరం దాడులకు దిగారు. ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు.ఇటీవల బీర్భూం జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన భాజపా.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అయితే భాజపా నేతల వ్యాఖ్యలను తృణమూల్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భాజపా, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు. ఇది కాస్తా ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేలు పరస్పరం తోసుకోవడం, దాడి చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి.ఘటన అనంతరం భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ‘‘అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయింది. మా సభ్యులపై టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేశారు’’ అని భాజపా శాసనసభా పక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను తృణమూల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ కొట్టిపారేశారు. అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు ఘటన నేపథ్యంలో ఐదుగురు భాజపా సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సువేందు అధికారి, మనోజ్ టిగ్గా, నరహరి మహతో, శంకర్ ఘోష్, దీపర్ బర్మాన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.మార్చి 21న బీర్భూం జిల్లాలో బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే రామ్పుర్హాట్ పట్టణ శివారులోని బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు. భాదు షేక్ హత్యతో ప్రత్యర్థు ఇళ్లకు టీఎంసీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హత్యకు ముందు వారిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కలకత్తా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే తృణమూల్ నేత సహా 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
13.గోవా సిఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం
హాజరైన ప్రధాని మోడీ,కేంద్రమంత్రులు
పనాజీ,మార్చి 28(జనంసాక్షి): గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ రెండోసారి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిల్ళై సావంత్‌తో ప్రమాణం చేయించారు. ప్రమోద్ సావంత్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోదీతోపాటు ఇతర బీజేపీ నేతలుహాజరయ్యారు. రాష్ట్ర రాజధాని నగరమైన పనాజీ సవిూపంలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు హాజరయ్యారు. ఇటీవల గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లను గెలుచుకుంది. 40 సీట్లున్న గోవాలో బీజేపీ 20 సీట్లు సాధించగా, మహరాష్ట్రవాదీ గోమాన్‌తక్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతుగా నిలిచారు.