1.బుద్ధుడు భారత్‌లో పుట్టడం ప్రపంచానికే గర్వకారణం
` ప్రేమ,అందరినీ గౌరవించడం గౌతముడు నేర్పిన సంస్కారం
` ఆయన ఆదర్శాలు అనుసరణీయం..
` ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి అవసరం
` సాగర్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ది
` బుద్ధవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నాగార్జునసాగర్,మే14(జనంసాక్షి):గౌతమ బుద్ధుడు భారత దేశంలో పుట్టడం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌అన్నారు. ప్రతి ఒక్కరు బుద్ధుడి సందేశాలు పాటించాలన్నారు. ఇతర దేశాల్లో బుద్ధుడిని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారన్నారు. ఇతర దేశాల నుంచి బౌద్థులు ఇక్కడకి వచ్చేలా బౌద్దారామాలు తీర్చిదిద్దాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందన్నారు. గతంలో జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. నాగార్జున సాగర్ లో బుద్ధ వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పూర్తి చేశారన్నారు. హిందువులు, ముస్లింలు, కైస్త్రవులే కాదు.. సిక్కులు, బౌద్ధులు, జైనులు, అందరూ కూడా సంతోషంగా, అన్నదమ్ముల్లాగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పరమత సహనం, ఇతర మతాలను గౌరవించడం, ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని కేటీఆర్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణానికి విశేష కృషి చేసిన మ్లలెపల్లి లక్ష్మయ్య, శివనాగిరెడ్డితో పాటు ఈ నిర్మాణంలో రాళ్లు మోసిన కూలీల నుంచి మొదలు పెడితే.. ఆకృతులను చెక్కిన శిల్పులు.. కొన్ని వేల మంది ఈ నిర్మాణంలో పని చేసి ఉంటారు. వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ మనం ఆవిష్కరించుకున్నది, ప్రారంభించుకున్నది సామాన్యమైన నిర్మాణం కాదు. గౌతమ బుద్ధుడు మన దేశంలో పుట్టడమే మనకందరికీ ఎంతో గర్వకారణం. ఒక చైనాకో, జపాన్‌కో, దక్షిణ కొరియాకో, తైవాన్‌కో లేదా థాయిలాండ్ లాంటి దేశాలకు వెళ్లినప్పుడు గౌతమ బుద్ధుడిని వారు కొలిచే విధానం, ఆరాధించే విధానం అపురూపమైన పద్ధతుల్లో కనిపిస్తుందని కేటీఆర్ తెలిపారు. 25, 20 ఏండ్ల కిందట కుటుంబమంతా కలిసి బోద్ గయకు వెళ్లాం. అక్కడున్న బౌద్ధులు చెప్తుంటారు.. బుద్ధం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి.. ధర్మం శరణ గచ్చామి.. దానికి అనుగుణంగా ఆ మార్గంలో ఈ దేశం నడిచి ఉంటే ఇప్పుడున్న దురవస్థలు, సమాజంలో ఉన్న అవలక్షణాలు ఉండేవి కావు అనిపిస్తదని కేటీఆర్ పేర్కొన్నారు.గౌతమ బుద్ధుని శిష్యుడు నాగార్జునుడు గడిపిన ఈ కొండ ప్రాంతానికి నాగార్జున కొండ అని పేరు వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.. ఈయనను రెండో గౌతమ బుద్ధ అని కూడా అంటారు. అలా ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ అని పేరొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఫణిగిరి(సూర్యాపేట), నేలకొండపల్లి(ఖమ్మం), ధూళికట్ట(కరీంనగర్), ఆదిలాబాద్ జిల్లాలోనూ బౌద్దానికి సంబంధించిన స్థూపాలు, చిహ్నాలు కనబడుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే బౌద్ధులు బుద్ధుడు పుట్టిన ప్రాంతం భారతదేశం అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. మహ్మదీయులు మక్కాకు, హిందువులు తమ ఆరాధ్య దైవ ప్రాంతాలకు, యూదులు జేరూసలేం, క్రిస్టియన్స్ వాటికన్ పోయినట్లు, అదే విధంగా బౌద్ధులు కూడా మన దేశానికి తరలివచ్చే విధంగా, ఈ దేశంలో ఉండే బౌద్దారామాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందని లక్ష్మయ్య చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంత చక్కటి నిర్మాణాన్ని పూర్తి చేసిన లక్ష్మయ్య, శివనాగిరెడ్డికి, టూరిజం మంత్రితో పాటు ఆయా బృందాలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. 274 ఎకరాల్లో మనం కేవలం 90 ఎకరాలు మాత్రమే వినియోగించుకున్నాం. మిగతా స్థలాన్ని కూడా వినియోగించు కునేందుకు అవకాశం ఉంది. లక్ష్మయ్య కోరినట్టు నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ చెప్పారు. ఈ ప్రాంతంలో బౌద్దానికి సంబంధించిన యూనివర్సిటీని నెలకొల్పేందుకు కొంతమంది ముందుకు వచ్చారని లక్ష్మయ్య చెప్పిన విషయాన్ని కేటీఆర్ వెల్లడిరచారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, అన్ని సవ్యంగా ఉంటే ఏర్పాటుకు చర్యలు తీసుకోవచ్చన్నారు. చాకలిగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పబ్లిక్ ప్రయివేటు పార్ట్‌నర్ షిప్ మోడల్‌లో ఒక ఆకర్షణీయ స్థలంగా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నాగార్జున సాగర్‌ను తీర్చిదిద్దాలి. దీంతో ఇక్కడి పిల్లలకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
(మాయమాటలుచెప్పే వారిని నమ్మొద్దు
సాగర్‌కు జానారెడ్డి చేసిందేవిూ లేదు
కనీస్ ఫ్లోరైడ్ కూడా నిరోధించలేదు
ఎమమెల్యే భగత్ చేస్తున్న పనులు అనేకం
సాగర్ అభివృద్ది కోసం భగత్‌కు మద్దతుగా నిలవాలి
కాంగ్రెస్, బిజెపిల మాటలు నమ్మొద్దన్న కెటిఆర్
నల్లగొండ,మే14(జనంసాక్షి):కాంగ్రెస్ పార్టీ, రాహులల్ గాంధీపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లా జరిగిన హాలియా సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కాలం పదవిలో ఉన్న నేతలు చేయని అభివృద్ధి ఈరోజు ఎమ్మెల్యే భగత్ చేస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించిన వారు చేయని, చేయలేని పనులు భగత్ చేసి చూపిస్తున్నాడు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. ఎమ్మెల్యే భగత్ కోరిక మేరకు నూతన స్టేడియం కోసం రూ. 3కోట్లు మంజూరు చేస్తున్నాం. ఓపెన్ డ్రైనేజీ కోసం రూ. 15కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.జానారెడ్డి అంటే గౌరవం.. కానీ వారి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వారే చెప్పాలి. పక్కన కృష్ణా నది ప్రవహిస్తున్నా.. ప్లోరైడ్ నిర్మూలన చేయలేదు. రైతులకు సాగు నీరు ఇవ్వని అసమర్థులు గత పాలకులు. ప్లోరైడ్ నిర్మూలనకు కేసీఆర్ కృషి చేసి చూపించారు. గత పాలకులు పదవులు అనుభవించారు తప్ప.. అభివృద్ధి చేయలేదు. కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. పెద్దమనుషుల ఆత్మగౌరవం పెంచిన నేత కేసీఆర్.. బీడీ కార్మికుల గురించి ఆలోచన చేసింది కేసీఆర్ అని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, పథకాలు చరిత్రాత్మకం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. మంత్రులుగా సుదీర్ఘంగా పనిచేసినా 6 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వలేదు గత పాలకులు. దేశంలో రైతుల కోసం అనేక పథకాలు ఇచ్చిన ఏకైక నేత కేసీఆర్ మాత్రమే. మనం కట్టే పన్నులు పక్క రాష్టాల్రకు ఉపయోగపడుతున్నాయన్నారు. ఏడు సార్లు గెలిచిన జానారెడ్డి ఏం చేశారు.? రాహుల్‌కు ఒక్కసారి అవకాశమిస్తే ఏం అభివృద్ధి చేస్తారు. ఎద్దులు, పొలం, వ్యవసాయం తెలియని నేత రాహుల్ గాంధీ. పబ్బులు, జల్సాలు తప్ప రాహుల్‌కు ఏవిూ తెలియదు. నాగార్జున సాగర్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో వచ్చే నేతలను నమ్మొద్దు. యువనాయకుడు భగత్‌ను కాపాడుకోవలసిన బాధ్యత నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలపై ఉందని అన్నారు. ఆరేడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రాష్టాన్రికి ఏవిూ చేయలేదని కేటీఆర్ విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. సాగు, తాగునీటితో దేశానికే ఆదర్శంగా నిలిచామని స్పష్టం చేశారు. ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో తెరాస హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు.
( ‘సుంకిశాల’తో హైదరాబాద్ మంచినీటికి భరోసా
` 2072దాకా నీటి అవసరాల మేరకు లభ్యత
` హైదరాబాద్ వందకిలోవిూర్ల పరిధి వరకు నీటి సరఫరా
` దేశానికి హైదరాబాద్ ఓ పెద్ద అసెట్ కానుంది
` కేసీఆర్ లాంటి దార్శనికనేతతో సమస్యలకు పరిష్కారం
` సుంకిశాలలిఫ్ట్ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్
నల్లగొండ,మే14(జనంసాక్షి): హైదరాబాద్ నగరానికి 2072 వరకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరుసగా ఏడేండ్లు కరువు వచ్చినా తాగునీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టు కూడా వాటర్ పైప్ లైన్‌లను ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో హైదరాబాద్ నగరం 100 కిలోవిూటర్ల విస్తరించినా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామన్నారు. హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని అయినప్పటికీ.. భారతదేశానికి ఒక అసెట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు బ్రహ్మాండమైన అసెట్‌గా అందించాలని, భవిష్యత్ భారతావనికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా భాగ్యనగరంలో కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ వెల్లడిరచారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం.. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.కేసీఆర్ లాంటి దార్శనికత ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఏడేండ్లలో ఎన్నో సమస్యలను పరిష్కారం అయ్యాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం.. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ప్రజలకు నిజంగా ఇవాళ శుభదినం అని పేర్కొన్నారు. మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుత హైదరాబాద్‌లో నీటి అవసరాలు 37 టీఎంసీలు.. 2072 వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరో 34 టీఎంసీల అవసరం ఉంటుంది. దాదాపు 71 టీఎంసీల నీరు అవసరం ఉండే అవకాశం ఉంది. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు. సుంకిశాలలో 1450 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి అవసరాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టీంఎసీలు లిప్ట్ చేయడానికి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎండకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరమని అన్నారు. భౌగోళికంగా హైదరాబాద్‌కు చాలా అనుకూలతలు ఉన్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపులా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేశామన్నారు. సిటీ ఎంత విస్తరించినా నీటి కొరత లేకుండా సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. రూ.1450 కోట్లతో ఈప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. వరుసగా ఏడేళ్లుగా కరువు వచ్చినా తాగు నీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే వేసవి కాలం వరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అదనంగా పదహారున్నటీఎంసీల నీటిని లిప్ట్ చేయడానికి ఈ ఇన్ టెక్ వెల్ ను నిర్మిస్తున్నామన్నారు. మోటార్లు పెట్టి నీటిని పంపింగ్ చేసేలా కూడా సివిల్ వర్క్స్ జరుగుతున్నా యన్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జిల్లాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమన్నారు.దేశంలో వేగంగా ఎదుగుతున్న మహానగరం ఏదంటే హైదరాబాద్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ శర వేగంగా పెరుగుతున్నది, విస్తరిస్తున్నదని తెలిపారు.15 సంవత్సరాల కాలంలో ఢల్లీి తర్వాత హైదరాబాద్ రెండో అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తుందంటే.. ఇది అతిశయోక్తి కాదననారు. నేను చెప్పేది ఏదో కల్పన కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే మనం ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాం. ఢల్లీి, ముంబై, బెంగళూరు తర్వాత మనమే ఉన్నాం. చెన్నై, కోల్‌కతాను దాటిపోయామని కేటీఆర్ పేర్కొన్నారు. మిగతా ఏ నగరాలకు లేని భౌగోళిక, పర్యావరణ అనుకూలతలు హైదరాబాద్‌కు ఉన్నాయి. నాలుగు వైపులా నగరం పెరుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. భారతదేశంలోని ఇతర మహానగరాల్లో రకరకాల కారణాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. రైలు ట్యాంకర్లలో నీళ్లు తెచ్చే దుస్థితి ఒక నగరంలో ఉంది. పెరుగుతున్న ధరల కారణంగా మరో నగరం విస్తరించే అవకాశం లేదు. మరొక నగరంలో పొల్యూషన్ సమస్య, ఇంకో నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఇలా అనేక సమస్యలతో దేశంలో నగరాలు సతమతమవుతున్న వేళ.. కానీ హైదరాబాద్‌కు అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్,శ్రీనివాస గౌడ్,మహ్మూద్ అలీ,మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2.తెలంగాణలోఅవినీతి సర్కారు
` తెలంగాణకు 8ఏళ్లలో రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చాం
` తుక్కుగూడ సభలో అమిత్ షా వెల్లడి
హైదరాబాద్,మే14(జనంసాక్షి):తెలంగాణలో అసమర్థ కెసీఆర్ సర్కార్‌ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉందన్నారు. అభివృద్దిని పట్టని, అబద్దాల ప్రభుత్వం అసవరం లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కెసిఆర్‌ను గద్దె దించేందుకు బిజెపి సిద్దంఆ ఉండాని అమిత్ షా అన్నారు. కేసీఆర్‌ని ఓడగొట్టడానికి తాను రావాల్సిన అవసరం లేదని బండి సంజయ్ ఒక్కరే చాలన్నారు. కేవలం ఓ పార్టీని దించి మరో పార్టీని అధికారంలో తేవడానికో, ఒకరిని ముఖ్యమంత్రిని చేయడానికో కాదని ఆయన స్పష్టం చేశారు. తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో కేంద్ర పథకాల పేర్లు మార్చడమే కానీ చేసిందేవిూలేదన్నారు. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలుచేయాలని, వరంగల్ సైనిక్ స్కూల్‌కు 2016లో అనుమతి ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని షా చెప్పారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా తెలిపారు. కేందరపథకాలకు తండ్రీకొడుకుల ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రతి గింజా కొంటామని తెలిపారు. తన మాటలు వింటుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని అమిత్‌షా అన్నారు.బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం లేదని..దళితులు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం యాత్ర జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో నిజాంను మార్చేందుకు చేస్తోన్న యాత్రగా అభివర్ణించారు. రజాకార్ల ప్రతినిధుల ఒడిలో కూర్చున్న నేతలకు వ్యతిరేకంగా జరుగుతోందని, కుటుంబ పాలన కొనసాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేయడం జరుగుతోందన్నారు. వేలాది కోట్ల అవినీతికి పాల్పడిన టీఆర్‌ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలించడానికి, మజ్లిస్ కి భయపడిన సీఎంను తొలగించేందుకు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళితులను మోసం చేసిన టీఆర్‌ఎస్ తొలగించాలన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, రాష్ట్రంపై అందరికీ సమానహక్కు ఉందని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారని బహిరంగ సభలో అమిత్ షా విమర్శించారు. తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలకు అందించారా? అని ప్రశ్నించారు. కేవలం కుటుంబ పాలనే సాగుతుతోందన్నారు. మేం అధికారంలోకి రాగానే వాటిని అమలుచేసి చూపిస్తామని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని కేసీఆర్ వాగ్దానం చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో కొత్తగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తాం కేసీఆర్ అంటున్నారని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో పరిస్థితి ఒకసారి చూడాలని అమిత్‌షా ప్రజలకు సూచించారు. కేసీఆర్ మజ్లిస్ చంక ఎక్కికూర్చున్నారని, మజ్లిస్ పార్టీ అంటే కేసీఆర్‌కు భయమని, తెలంగాణ విమోచనదినం గురించి కేసీఆర్ వాగ్దానం చేశారా? లేదా అని షా ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందని, టీఆర్‌ఎస్, మజ్లిస్‌ను ఒకేసారి విసిరేయాలని ప్రజలకు షా పిలుపునిచ్చారు. రాష్టాన్న్రి బెంగాల్ లా మారుద్దామని కేసీఆర్ భావిస్తున్నారని షా విమర్శించారు. సాయిగణెళిష్ హత్యపై ఏం సమాధానం చెబుతారని? ప్రశ్నించారు. తాము పంట కొనుగోలు చేస్తూనే ఉన్నామని, మద్దతు ధరలుకూడా గతంలో కన్నా ఎక్కవ పెంచామని అన్నారు. అయినా అబద్దాలుచెబుతూ ప్రజలనుమోసం చేస్తున్నారని మండిపడ్డారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే ఈరోజు ఈరాష్ట్రం భారత్‌లో భాగమైందని, తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ ఒక్క మహనీయుడికి పేరు పేరునా శ్రద్దాంజలి ఘటించారు అమిత్ షా. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఏ హావిూని టీఆర్‌ఎస్ పూర్తి చేయలేకపోయిందని, బీజేపీ అధికారంలోకి వస్తే అది పూర్తి అవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. దళితులతో పాటు అన్ని వర్గాల వాళ్లను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతులకు రుణమాఫీ అమలు కావడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు యువత సిద్ధంగా ఉందని, హైదరాబాద్ నిజాంని మార్చాల్సిన అవసరం ఉందా? లేదా? అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మరోసారి గట్టిగా ప్రశ్నించారు. సర్పంచ్‌కు కూడా అధికారం ఇవ్వకుండా.. కొడుకు, బిడ్డకు అధికారం కట్టబెట్టారని కేసీఆర్‌పై మండిపడ్డారు. మన ఊరు`మన బడి నిధులు కేంద్రానివే. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చిత్రీకరించారు. ఆయుష్మాన్‌భారత్ లాంటి పథకాన్ని తెలంగాణలో నడిపించడం లేదన్నారు అమిత్ షా. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ అది చేయలేదు. అధికారమిస్తే ప్రతీ గింజను కొంటామని, సంక్షేమ హావిూలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. త్వరలోనే నిధులు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయని అమిత్ షా పేర్కొన్నారు. అవకాశం ఇస్తే.. తెలంగాణలో డబుల్ ఇంజన్‌తో అభివృద్ధి చేసి చూపిస్తాం. సచివాలయానికి వెళ్లలేని కేసీఆర్‌ను ప్రజలే గ్దదెదించుతారని అన్నారు. ఇకపోతే తెలంగాణకు ఇప్పటి వరకు 8 ఏళ్లలో 2లక్షల కోట్లకు పైగాకేంద్రం నిధులు ఇచ్చిందన్నారు.
3.ఏడేళ్లుగా ఎందుకు ఉపేక్షించారు?
` కేంద్ర ప్రభుత్వ హావిూలన్నీ బూటకం
` నిజామాబాద్ పసుపుబోర్డు హావిూ ఎందుకు విస్మరించారు
` తెలంగాణ విభజన సమస్యలపై ఎందుకు మాటతప్పారు?
` అమిత్‌షాకు 9 ప్రశ్నలతో రేవంత్ బహిరంగ లేఖ
హైదరాబాద్,మే14(జనంసాక్షి): మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాడటం లేదన్న సామెత కేంద్ర ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హావిూ ఒట్టి బూటకమని అర్థమైందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి ఇవాళ తెలంగాణకు వస్తున్న అమిత్‌షాకు రేవంత్‌రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావడాన్నిపురస్కరించుకుని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాస్తూ పలు ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యమేంటనిప్రశ్నించారు. పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలు. ధాన్యం రైతుల మరణాలకు బాధ్యులెవరని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన మోదీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలన్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు అంటూ మాట తప్పారని గుర్తు చేశారు. .విభజన చట్టంలో ఇచ్చిన హావిూలు ఏమయ్యాయని నిలదీసారు. భద్రాద్రి రాముడికి రామాయణం సర్క్యూట్‌లో చోటు ఏదని,అయోధ్య రాముడు.. భద్రాద్రి రాముడు విూ దృష్టిలో ఒకటి కాదా అంటూ రేవంత్ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. తెరాస, భాజపా కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడిచిన వానాకాలం నుంచి రాష్ట్ర రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవించారని పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి కేంద్రం.. రైతుల నెత్తిన బరువు మోపిందని రేవంత్ ఆక్షేపించారు. బ్యాంకులను రూ. వేల కోట్లకు ముంచిన బడాబాబులు దేశాన్ని వదిలి స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే.. రైతుల రుణాలను మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత` చేవెళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి.. రీ డిజైనింగ్ పేరుతో సీఎం కేసీఆర్ కవిూషన్లు దండుకున్నారని మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నాం. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా?తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, భాజపా చీకటి ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడిచిన వానాకాలం నుంచి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు విూ రెండు పార్టీలు కాదా?గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమాన్ని కించ పరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పక్షాన అప్పుడే మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. విూరు స్పందించలేదు. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న సందర్భంగా విూరు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో విూ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుందనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదని విూరు భావిస్తున్నారా?విూ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచార సందర్భంగా విూ పార్టీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆ మేరకు ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్ విూద రాసిచ్చారు. వీరిద్దరి మాటలు విశ్వసించిన నిజామాబాద్ ప్రజలు అర్వింద్‌ను ఎంపీగా గెలిపించారు. మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ఊసే లేదు. దీనికి విూ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా?తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాంటి బృహత్తర పథకాలకు కాంగ్రెస్ సారథ్యంలోని గత యూపీఏ ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం హావిూ ఇచ్చింది. విూరు అధికారం లోకి వచ్చాక ఈ పథకాలన్నింటికీ మంగళం పాడారు. విూకు మా ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలి? విభజన చట్టం హావిూ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడు?అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా ‘రామాయణం సర్క్యూట్‘ పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కి.విూ. సాగే ఈ సర్క్యూట్‌లో భద్రాద్రి రాముడికి చోటు దక్కలేదు. అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు విూ దృష్టిలో ఒక్కరు కాదా?ఒడిశాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నేను స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకూ దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో విూరు నిజంగా అంత సీరియస్‌గా ఉంటే.. అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు?పొరుగున ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన విూకు రాలేదు. విూ దుర్మార్గ చట్టాలకు తెరాస మద్దతు.. వారి అక్రమాలు అవినీతికి విూ మద్దతు.. ఇదే కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది. 2014లో కాంగ్రెస్ అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ.71.41 పైసలు, డీజిల్ ధర రూ.55.49 పైసలు. గ్యాస్ సిలిండర్ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.105.65 పైసలు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1,052కి ఎగబాకాయి. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
4.దేశం దివాళా తీసింది
` ఆందోళనకరంగా దేశ ఆర్థిక వ్యవస్థ
` ఉదాసీనంగా కేంద్ర ప్రభుత్వం తీరు
` మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
ఉదయ్‌పూర్,మే14(జనంసాక్షి): దేశఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చెప్పారు. ఆర్థికసంక్షోభం విషయంలో మోడీ సర్కార్ నిర్లిప్తత అవలంబిస్తోందని అన్నారు. దీనిని పరిష్కరించే చర్యల విషయంలో ఉదాసీనత కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ మేధోమథనం సమావేశాల నేపథ్యంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించినపుడు ఆర్థిక విధానాలను విభిన్నంగా మార్చడం గురించి పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పారు. గడచిన ఎనిమిదేళ్ళలో వృద్ధి రేటు మందగమనం ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు గొప్ప నిదర్శనమని చెప్పారు. కోవిడ్`19 మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం నిర్లిప్తంగా ఉందని, నిలిచిపోయిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను సమగ్రంగా సవిూక్షించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. వస్తు, సేవల పన్ను చట్టాలను మోదీ ప్రభుత్వం పేలవంగా రూపొందించిందని, జిఎస్టీ చట్టాలను 2017లో అనుచితంగా అమలు చేసిందని, ఆ పర్యవసానాలను ప్రతి ఒక్కరూ చూడవలసి వస్తోందని చెప్పారు. రాష్టాల్ర ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేనంతగా బలహీనపడిరదన్నారు. ఈ విషయంలో అత్యవసర ఉపశమన చర్యలు అవసరమని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం 1991లో సరళీకరణ నూతన శకాన్ని ఆవిష్కరించిందని గుర్తు చేశారు. ఈ సరళీకరణ వల్ల దేశానికి గొప్ప ప్రయోజనాలు లభించాయని తెలిపారు. సంపద సృష్టి, కొత్త వ్యాపారాలు, నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుదల, లక్షలాది ఉద్యోగావకాశాలు, ఎగుమతులు, పదేళ్ళలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం వంటి ప్రయోజనాలు చేకూరాయని చెప్పారు. 30 ఏళ్ళ తర్వాత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించినపుడు, ఆర్థిక విధానాలను మార్చడం గురించి ఆలోచించవలసిన అవసరం కనిపిస్తోందని తెలిపారు. ఆర్థిక విధానాలను మార్చడం వల్ల అసమానతల పెరుగుదల, తీవ్ర పేదరికం వంటి సమస్యలకు పరిష్కారం లభించాలన్నారు. ప్రపంచ ఆకలి సూచీ 2021లో 116 దేశాల్లో మన దేశం 101వ స్థానంలో ఉందన్నారు. మహిళలు, బాలల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై బాహ్య పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయని, ఈ పరిణామాలను ప్రభుత్వం గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదని చెప్పారు. ఈ పరిణామాలను ఎదుర్కొనడానికి ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి తెలిసినట్లు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ మేధోమథనంలో మూడు రోజులపాటు జరిగే సమాలోచనలు, రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఆర్థిక విధానాలపై దేశవ్యాప్త చర్చకు దారి తీస్తాయన్నారు. నవ సంకల్ప చింతన్ శివిర్ పేరుతో శుక్రవారం ప్రారంభమైన కాంగ్రెస్ మేధోమథనం సమావేశాలు ఆదివారం వరకు జరుగుతాయి. ముసాయిదా ప్రకటనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం చర్చిస్తుంది. ఈ మేధోమథనం సమావేశాల్లో ఆర్థిక రంగంపై కమిటీకి చిదంబరం నాయకత్వం వహిస్తున్నారు.
5.బహుజనులకు 50శాతం పదవులు
` కాంగ్రెస్ కీలక నిర్ణయం..
దిల్లీ,మే14(జనంసాక్షి): వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే పార్టీలోని అన్ని పదవుల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలకు ప్రాతినిధ్యాన్ని 50శాతానికి పెంచాలని భావిస్తోంది.దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు పార్టీ నేతలు శనివారం వెల్లడిరచారు.రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పార్టీ నవ సంకల్ప చింతన్ శిబిర్ జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండో రోజైన శనివారం.. సామాజిక న్యాయం, సాధికారితపై పార్టీ నేతలు చర్చించారు. అందుకు సంబంధించిన వివరాలను పార్టీ నేత కె. రాజు విూడియాకు వివరించారు. పార్టీలో సామాజిక న్యాయం సాధించే దిశగా సంస్థాగత సంస్కరణలను తీసుకురావాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీలోని అన్ని స్థాయుల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీల ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం సోషల్ జస్టిస్ అడ్వైజరీ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.శుక్రవారం ప్రారంభమైన చింతన్ శిబిర్‌లో అధినేత్రి సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ గతంలో మాదిరిగా క్రియాశీల పాత్ర పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశలను నెరవేర్చేలా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని నేతలకు ఆమె సూచించారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ... నేతలకు ఎంతో చేసిందని, ఇప్పుడు దాని రుణం తీర్చుకొనే సమయం వచ్చిందని ఉద్బోధించారు.
6.ఢల్లీి అగ్నిప్రమాదం ఘటనలో ఇద్దరి అరెస్టు
` పరారీలో బిల్డింగ్ ఓనర్ మనీష్ లక్రా
` ఘటనా స్థలిని పరిశీలించిన సిఎం కేజ్రీవాల్
` మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సాయం
` రూ.2లక్షల చొప్పున సాయం ప్రకటించిన ప్రధాని
న్యూఢల్లీి,మే14(జనంసాక్షి):ఢల్లీి అగ్నిప్రమాదం ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు, రూటర్ ఆఫీస్ ఓనర్లు హరీశ్ గోయల్, వరుణ్ గోయల్ ను అదుపులోకి తీసుకున్నారు. బిల్డింగ్ ఓనర్ మనీష్ లక్రా పరారీలో ఉన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి సేప్టీ క్లియరెన్స్ లేదని అధికారులు గుర్తించారు. దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 12 మందికి గాయాలు కాగా సహాయ
బృందాలు 50మందిని రక్షించాయి. మరికొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 32కు చేరుకుందని సమాచారం. ప్రమాదం సమయంలో రెండో ప్లోర్ లో మోటివేషనల్ స్పీచ్ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు అధికారులు. ఆ ప్రోగ్రామ్ కు చాలా మంది హాజరవడంతో సెకండ్ ఎª`లోర్ లో ఎక్కువ మరణాలు జరిగాయన్నారు. బయటకు వెళ్లేందుకు మెట్ల దారి ఒకటే ఉండటంతో.. ప్రజలు తప్పించుకోలేకపోయారన్నారు. గాయపడిన వారికి సంజయ్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. దీంతో హాస్పిటల్ దగ్గరికి భారీగా చేరుకున్నారు బాదితుల కుటుంబసభ్యులు. తమ వారి ఆచూకీ కోసం పలువురు కన్నీరుపెట్టుకున్నారు. ప్రమాద బాధితుల కోసం హాస్పిటల్ దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు సివిల్ డిఫెన్స్ ఆఫీసర్ ఎస్పీ తోమర్ తెలిపారు. గాయపడిన వారు, తప్పిపోయిన వారికి సాయం చేసేందకు డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశ్చిమముండ్కా మెట్రో స్టేషన్ సవిూపంలోని నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. నిన్న సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ప్రమాద సమాచారం అందినట్లు తెలిపారు ఢల్లీి చీఫ్ ్గªర్ సర్వీస్ ఆఫీసర్ అతుల్ గార్గ్. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముప్పైకి పైగా ఫైరింజన్లతో అతి కష్టం విూద మంటలార్పామన్నారు. ఫస్ట్ ప్లోర్ లోని సీసీటీవీ కెమెరాలు, రూటర్ తయారీ కంపెనీలు మంటలు చెలరేగాయని.. అక్కడి నుంచి భవనమంతా వ్యాపించి నట్లు తెలిపారు. బిల్డింగ్ అంతా పొగ నిండిపోవడంతో.. అందులోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో.. మొదటి, రెండు అంతస్తుల్లోని అద్దాల కిటికీలు పగులగొట్టి పై నుంచి కిందకు దూకారు. మరికొందరు తాళ్ల సాయంతో కిందికి దిగారు. ఢల్లీి అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడినవారికి 50 వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ శనివారం ప్రకటించారు. గాయపడినవారికి రూ. 50 వేలు చొప్పున అందజేయనున్నట్లు వెల్లడిరచారు. శనివారం ఉదయం సిఎం అరవింద్ కేజీవ్రాల్ ముండ్కాలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఢల్లీి ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిందని, నిందితులను విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ భవనంలో ఒకవైపు మాత్రమే మెట్లు ఉండటంతో ప్రజలు భవనం నుంచి తప్పించుకోలేకపోయారని అగ్నిమాపక శాఖ డివిజనల్ అధికారి తెలిపారు.
7.త్రిపుర నూతన సిఎంగా మాణిక్ సాహు
బిప్లవ్ రాజీనామాతో నూతన నేతగా ఎన్నిక
అగర్తల,మే14(జనంసాక్షి):త్రిపుర రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారు. పార్టీ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. అనంతరం బీజేఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ విూటింగ్ లో మాణిక్ సాహను నూతన సీఎంగా ఎన్నుకున్నారు. బీజేపీ త్రిపుర శాఖ అధ్యక్షులుగా కొనసాగుతున్న సాహ... రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే సంవత్సరం త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో.. ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రతి దానికి ఓ నిర్ణీత కాలం ఉంటుందని.. తాము ఆ కాలాన్ని బట్టి పని చేయడం జరుగుతుందని రాజీనామా చేసిన అనంతరం బిప్లబ్ కుమార్ విూడియాకు తెలిపారు. తనకు ఏ పదవి ఇచ్చినా.. బాధ్యతతో పని చేస్తానని, ముఖ్యమంత్రి పదవి అయినా.. వేరేదైనా.. తాను అందుకు తగినట్లు వ్యవహరిస్తానన్నారు. త్రిపురలో గత కొన్ని ఏళ్లుగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉందనే సంగతి తెలిసిందే. ఈ పాలనకు తెరదించుతూ.. బీజేపీ ప్రభుత్వం 2018లో అధికారాన్ని చేజిక్కించుకుంది. రాష్ట్ర పదో ముఖ్యమంత్రిగా బిప్లబ్ కుమార్ ప్రమాణం చేశారు. ఆయనపై ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పించాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో సీఎంను మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. మరి మాణిక్ సాహ పాలన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
8.చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాజీనామా!
కమ్యూనిస్ట్ పార్టీ కీలక నిర్ణయం!
సోషల్ విూడియా వేదికగా జోరుగాప్రచారం
బీజింగ్,మే14(జనంసాక్షి): చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పదవి నుంచి తప్పుకోబోతున్నారని అక్కడి సోషల్ విూడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కరోనా నిర్వహణలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి జిన్‌పింగ్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ఆయనను చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) పక్కకు పెట్టబోతోందని వదంతులు వ్యాపిస్తున్నాయి. సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండిరగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం మొదలైంది. చైనా పాలనలో ఈ నాయకత్వ బృందమే అత్యంత కీలకం. ఈ సమావేశం అనంతరం కెనడాకు చెందిన బ్లాగర్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. కొద్ది నెలల్లో కీలక సమావేశాన్ని నిర్వహిస్తుందని, ఆ లోపే జిన్‌పింగ్‌ను పదివి నుంచి తప్పుకోవాలని ఆదేశించిందని చెప్పాడు. అంతేకాదు ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్‌ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. పార్టీ నుంచి, పదవి నుంచి జిన్‌పింగ్ వైదొలుగుతారని వివరించాడు. కరోనా కట్టడి కోసం జీరో కొవిడ్ పాలసీ పేరుతో అత్యంత కఠిన ఆంక్షలు విధించారు జిన్‌పింగ్. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేగాక వ్యాపార సంస్థలపై కూడా ఆంక్షల వల్ల తీవ్ర ప్రభావం పడిరది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ కూడా ప్రభావితమైంది. చైనా యువాన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 4శాతం వరకు పడిపోయింది. గత 28ఏళ్లలో ఇంత కనిష్ఠానికి పడిపోవడం ఇదే తొలిసారి. కరోనా ఒక్క కారణం తప్ప ఆర్థిక వ్యవస్థ గురించి జిన్‌పింగ్ ఆలోచించలేదని, ప్రజలను ఇబ్బందిపెట్టడమే గాక ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి కారణమయ్యారని
విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పదవి నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతోంది.
9.మధ్యప్రదేశ్ అడవుల్లో వేటగాళ్ల ఘాతుకం
` కూంబింగ్ చేస్తున్న ముగ్గురు పోలీసుల కాల్చివేత
` కృష్ణ జింకల వేటగాళ్లుగా గుర్తింపు
గుణ,మే14(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. కృష్ణ జింకలను వేటాడానికి వచ్చిన వేటగాళ్లు దారుణానికి తెగబడి, ముగ్గురు కానిస్టేబుళ్లను హతమార్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం వెలుగుచూసింది. గుణ అటవీప్రాంతంలో శనివారం తెల్లవారుజామున కృష్ణ జింకలను వేటాడిన వేటగాళ్లు ఎదురుపడిన పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు. వేటగాళ్లు ముగ్గురు పోలీసు సిబ్బందిని కాల్చి చంపిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయుధులైన వేటగాళ్లు పోలీసు బృందంపై కాల్పులు జరిపారని గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు. దీనికి పోలీసులు ప్రతీకారం తీర్చుకుంటారని, అయితే దట్టమైన అడవిని అడ్డుపెట్టుకొని వేటగాళ్లు తప్పించుకోగలిగారని మిశ్రా చెప్పారు. వేటగాళ్ల కాల్పుల్లో సబ్`ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ జాతవ్, హెడ్ కానిస్టేబుల్ సంత్ కుమార్ విూనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ్ లు మరణించారు. ఈ కాల్పుల్లో పోలీసు వాహనం డ్రైవర్ కూడా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. కృష్ణజింకలను వేటాడేందుకు కొందరు వేటగాళ్లు ఈ ప్రాంతంలో విడిది చేస్తున్నారనే నిర్దిష్ట సమాచారంతో పోలీసు బృందం అడవికి వెళ్లింది. గుణ అటవీ ప్రాంతం నుంచి పలు కృష్ణజింకల కళేబరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై వేటగాళ్లు ఫైరింగ్ జరిపినట్లు గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. వేటగాళ్ల వద్ద గన్నులు ఉన్నాయని, మోటారుబైక్‌పై వచ్చిన ఆ వేటగాళ్లు.. పోలీసు టీమ్‌పై కాల్పులు జరిపినట్లు ఎస్పీ వెల్లడిరచారు. పోలీసులు ఎదురుదాడి చేసినా.. వేటగాళ్లు అక్కడ నుంచి పారిపోయారు. వేటగాళ్ల కాల్పుల్లో మరణించిన పోలీసుల కుటుంబాలకు కోటి నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు సీఎం శివరాజ్ వెల్లడిరచారు.
10.తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్
మరో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ
న్యూఢల్లీి,మే14(జనంసాక్షి): తెలంగాణ నుంచి అదనంగగా మరో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారా బాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.వరి ధాన్యం, ఉప్పుడు బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ వర్సెస్ కేంద్ర ప్రభుత్వాలుగా పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి మరో 6.
all news