ALL NEWS

 1.ఫలిస్తున్న కేటీఆర్‌ వ్యూహం

` దావోస్‌ నుంచి పెట్టుబడుల వరద

` తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడి

` గ్రీన్‌ఫీల్డ్‌ ఫెసిలిటీ సెంటరు ఏర్పాటు

` ముందుకొచ్చిన అలీఆక్సిస్‌ కంపెనీ ప్రతినిధులు 

` వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ చర్చాగోష్టిలో పాల్గొన్న మంత్రి

` ఫేషియల్‌ ఇకగ్నేషన్‌ టెక్నాలజీ చాలా ఉపయోగకరమని వెల్లడి

` నోవార్టీస్‌ సీఈవోతో భేటీ..రాష్ట్రంలో సంస్థ విస్తరణ ప్రణాళికలపై చర్చ

` తెలంగాణ చేపట్టే వ్యవసాయకార్యక్రమాలలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ సంస్థ సిద్ధం:సద్గురు జగ్గీవాసుదేవ్‌ 

దావోస్‌,మే24(జనంసాక్షి):మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటనలో విజయవంతంగా కొనసాగుతోంది.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు మందుకొస్తున్నాయి.ఈ క్రమంలో మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అలీయాక్సిస్‌ కంపెనీ ప్రకటించింది. దావోస్లో కేటీఆర్తో భేటీ అనంతరం తెలంగాణలో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు అలీఆక్సిస్‌ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఆశీర్వాద్‌ పైప్స్కు చెందిన అలీఆక్సిస్‌ కంపెనీ ప్లాస్టిక్‌ పైపులు, యాక్సెసరీస్‌ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.  కాగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చైన్‌, డేటా సైన్సెస్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.వాటి ఉపయోగాలతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ చర్చాగోష్టిలో ‘’ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆన్‌ ది స్ట్రీట్‌ ` మేనేజింగ్‌ ట్రస్ట్‌ ఇన్‌ ది పబ్లిక్‌ స్క్వేర్‌’’ అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగించారు. చర్చాగోష్టిలో కేటీఆర్‌తో పాటు ఎన్‌ఈసీ జపాన్‌ సీఈఓ తకాయుకి మోరిటా, ఉషాహిది, దక్షిణాఫ్రికాకు చెందిన ఈడీఎంజీ నికోల్‌ ఎడ్జ్‌ టెక్‌ సీఈఓ కోయెన్‌ వాన్‌ ఓస్ట్రోమ్‌ పాల్గొన్నారు.’’ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విస్తృత ఉపయోగానికి ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు అసలైన సవాల్‌. డేటా భద్రత, వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు అనుమతి లేకుండా ఈ సాంకేతికతను నిఘా కార్యకలాపాలకు ఉపయోగించమన్న భరోసా ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఉండాల్సిన నియంత్రణ, అధికారాలను స్పష్టంగా నిర్దేశించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ అధికారాలను పార్లమెంటరీ పద్ధతిలో, పారదర్శకంగా ప్రభుత్వ విభాగాలకు కల్పించాలి. ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో పోలీసులకు వ్యక్తులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. సరైన విధానంలో ఈ టెక్నాలజీని వినియోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనం కలుగుతుంది. ఫేషియల్‌ రికగ్నిషన్‌తో సేకరించే డేటా, వచ్చే ఫలితాన్ని ముందుగా ప్రజలతో పంచుకున్నప్పుడే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది. ఫేషియల్‌ రికగ్నిషన్‌తోనే నేర నియంత్రణ, సమర్థ పోలీసింగ్‌ సాధ్యమవుతుంది. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా మరిన్ని చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

నోవార్టీస్‌ సీఈవోతో కేటీఆర్‌ భేటీ..

హైదరాబాద్‌లోని కార్యాలయం తమకు రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్‌ ప్రకటించింది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన నోవార్టిస్‌ సీఈవో వసంత్‌ నరసింహన్‌.. రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించిన స్వల్ప కాలంలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందన్నారు. స్విట్జర్లాండ్‌ బాసెల్‌లోని తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు 9000 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌ కేంద్రం రెండో అతి పెద్ద కార్యాలయంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఇన్నోవేషన్‌, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైందన్న నరసింహన్‌.. ఈ కేంద్రాన్ని తమ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా, డిజిటల్‌ కార్యక్రమాలకు ఆసియా పసిఫిక్‌ కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపారు.కంపెనీ వృద్ధిపై అభినందనలు తెలిపిన కేటీఆర్‌... హైదరాబాద్‌ అతిపెద్ద కార్యక్షేత్రంగా మారడం అత్యంత సంతోషదాయకమన్నారు. నోవార్టిస్‌ కార్యకలాపాల విస్తరణతో తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. నోవార్టిస్‌ వల్ల ప్రపంచ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ ఒక అగ్రశ్రేణి, ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందన్నారు.

దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన ఆదిత్య థాకరే

మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే, మంత్రి కే.టి.ఆర్‌ ను దావోస్‌ లోని తెలంగాణ పెవిలియన్‌ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటి, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, మున్సిపల్‌ మరియు పంచాయతీ చట్టాల్లో 10 శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌ కింద కేటాయించడం వంటి కీలకమైన సంస్కరణలను కేటీఆర్‌ ఆదిత్య థాకరేకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మరింత అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌ వస్తానని ఆదిత్య థాకరే తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పట్టణ అభివృద్ధిలో చేపట్టిన పలు అంశాల పైన ఆదిత్య థాకరే మంత్రి కేటీఆర్‌ కి వివరాలు అందించారు.  పరస్పరం కలిసి పని చేసినప్పుడు రాష్ట్రాలు బలోపేతం అవుతాయని, తద్వారా బలమైన దేశం రూపొందుతుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

సద్గురు జగ్గీవాసుదేవ్తో కేటీఆర్‌ చిట్చాట్‌

ప్రపంచవ్యాప్తంగా భూమి తన సారాన్ని కోల్పోతోందని.. ఈ సమస్యతో త్వరలోనే ఆహార కొరత ఎదుర్కొనే ప్రమాదం ఉందని సద్గురు జగ్గీవాసుదేవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు అన్ని ప్రభుత్వాలు అత్యంత వేగంగా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దావోస్‌ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ సద్గురుతో సంభాషణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ‘‘సేవ్‌ సాయిల్‌’’ పేరుతో అవగాహనా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న జగ్గీవాసుదేవ్‌... ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు సందర్భంగా వివిధ కంపెనీలను కలిసి తన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్‌ కంపెనీలతోనూ సమావేశమవుతున్నారు.దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో సద్గురుతో మంత్రి కేటీఆర్‌ సంభాషించారు. తాను చేపట్టిన సేవ్‌ సాయిల్‌ కార్యక్రమం ప్రాధాన్యతను సద్గురు వివరించారు. ‘‘రానున్న 2, 3 దశాబ్దాల్లో ప్రపంచంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించి పోయే ప్రమాదం ఉంది. ఇప్పటినుంచి భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం లండన్‌ నుంచి కావేరి వరకు సేవ్‌ సాయిల్‌ ర్యాలీ చేపట్టి ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేస్తున్నాను’’ అని సద్గురు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు పర్యావరణ అనుకూల కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వివరించారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నాల్లో ఒకటైన హరితహారం సహా వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులు పెంపునకు కృషి చేస్తున్నాం. భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చకుంటే వ్యవసాయ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది.  సద్గురు చేపట్టిన సేవ్‌ సాయిల్‌ ర్యాలీ అద్భుతమైన కార్యక్రమం. కార్యక్రమం విజయవంతం కావాలి’’ అని కేటీఆర్‌ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సద్గురు జగ్గీవాసుదేవ్ను కేటీఆర్‌ హైదరాబాద్కు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన కార్యక్రమాలను ప్రశంసించారు.  వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని వెల్లడిరచారు. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, ప్రజలు కలిసి రానున్న భవిష్యత్‌ తరాలకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగేలా వ్యవసాయ నేలలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా తమతో కలిసి రావాలని సద్గురు పిలుపునిచ్చారు.

కేటీఆర్‌ ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిందేవిూ లేదు..

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసల జల్లు కురిపించారు. 20 ఏండ్ల తర్వాత కేటీఆర్‌ భారతదేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు.దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ బృందం.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను దావోస్‌ వేదికగా వివరిస్తూ దూసుకెళ్తుందన్నారు. కేటీఆర్‌ తెలంగాణకు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తీసుకెళ్లే విధంగా ఉన్నారని, తనకు సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌ రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆశా పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఆయన బృందం కలిసి తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో అద్భుతమైన జాబ్‌ చేస్తుందని ఆశా జడేజా కొనియాడారు.




2.భారత్‌,అమెరికా బంధం బలమైనది

` అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడీ భేటీ

` ద్వైపాక్షిక సంబంధాలపై ఇరునేతల చర్చ

` కొవిడ్ను ఎదుర్కోవడంలో భారత్‌ విజయవంతమైంది

` అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు

` అదే సమయంలో చైనా విఫలమైందని వ్యాఖ్య..!

` క్వాడ్‌ పరిధి విస్తరించిందన్న భారత ప్రధాని 

టోక్యో,మే24(జనంసాక్షి):క్వాడ్‌ సమావేశంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం టోక్యోలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను అత్యంత సన్నిహితంగా మార్చేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా జో బైడెన్‌  వెల్లడిరచారు. కొవిడ్ను ఎదుర్కొనే విషయంలో భారత్‌, చైనా మధ్య పోలిక తెచ్చి.. డ్రాగన్ను విమర్శించారు.‘ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం, దాని ప్రభావాల గురించి మేం చర్చించాం. ప్రపంచ దేశాలపై పడిన ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించేదిశగా మేం చర్చలు కొనసాగించనున్నాం. భారత్‌, అమెరికా కలిసి చేయగలిగింది చాలా ఉంది. రెండు దేశాల మధ్య సంబంధాన్ని అంత్యంత సన్నిహితంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం’ అని బైడెన్‌ అన్నారు. ఈ క్రమంలో మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాలది నమ్మకమైన భాగస్వామ్యమని వెల్లడిరచారు. పరస్పర ప్రయోజనాలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి అవకాశాలు ఆశించిన మేర పెరగడం లేదంటూ ఈ సందర్భంగా లేవనెత్తారు.ఈ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అజెండాలో లేని విషయాన్ని బైడెన్‌ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రాముఖ్యతపై మాట్లాడారు. కొవిడ్ను ఎదుర్కోవడంలో భారత్‌ వంటి ప్రజాస్వామ్యం విజయం సాధించిందన్నారు. సుదీర్ఘ ప్రజాస్వామ్య ప్రక్రియల వల్ల నిర్ణయాలు ఆలస్యం అవుతాయనే అభిప్రాయాన్ని, చైనా, రష్యా వంటి నిరంకుశ దేశాలు మారుతున్న ప్రపంచాన్ని మెరుగ్గా నిర్వహించగలవనే అపోహను ఈ విజయం తోసిపుచ్చిందని వ్యాఖ్యానించారు. దీనికి ముందు ప్రధాని మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే క్వాడ్కూటమి ప్రపంచంలోనే ముఖ్యమైన స్థానాన్ని సంపాదించిందన్నారు. ‘క్వాడ్‌ పరిధి విస్తరించింది. క్వాడ్‌ స్వరూపం ప్రభావవంతంగా మారింది. మన మధ్య పరస్పర విశ్వాసం, సంకల్పం..ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో పసిఫిక్‌ నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తుంది. ఇండో పసిఫిక్‌ కోసం క్వాడ్‌ ఒక నిర్మాణాత్మక అజెండాతో పనిచేస్తోంది’ అని క్వాడ్‌ ప్రాధాన్యతను వివరించారు. ఇండో`పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే లక్ష్యంతో క్వాడ్‌ కూటమి ఏర్పడిరది. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ ఈ కూటమి దేశాలు. 



3.ఆయిల్‌ ఫామ్‌ కోసం ప్రాంతీయ పరిశోధన సంస్థ కావాలి

` నల్ల తామర తెగులుపై నివారణపై కేంద్ర వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టాలి

` పరిశోధన చేసి కొత్త మందును కనిపెట్టాలి

` డ్రిప్‌ ఇరిగేషన్‌పై ఒకేసారి మొత్తం సబ్సిడీ ఇవ్వండి

` కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంత్రి నిరంజన్‌రెడ్డి భేటి

న్యూఢల్లీి,మే24(జనంసాక్షి):ఉద్యాన పంటలపై నల్ల తామర తెగులు, డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీ, ఆయిల్‌ ఫామ్‌ కోసం రాష్ట్రంలో ప్రాంతీయ పరిశోధన సంస్థఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ని కోరారు. ఆయన మంగళవారం ఢల్లీికృషి భవన్‌లో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు విన్నవించారు.ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నల్ల తామర తెగులుపై శాస్త్రవేత్తలను పంపించి పరిశీలించాలని గతంలో కేంద్రాన్ని కోరాం.కేంద్రం బృందాలు వచ్చి ఇది కొత్త తెగులు మొదటిసారి వచ్చిందని ధ్రువీకరించారు.మార్కెట్లో ఉన్న ఏ మందులు దీన్ని నియంత్రించలేకపోయాయి.దీనికోసం కొత్తగా మందు కనిపెట్టాల్సి ఉంటుంది.. అందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది మళ్ళీ ఇప్పుడు సీజన్‌ రాబోతుంది.మళ్ళీ తామర, తెగులు విజృంభిస్తే రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది.ఇదంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం.వీలైనంత త్వరగా ఈ అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టాలి. దేశంలో పండే మిర్చి పంటలో ఎక్కువగా తెలంగాణలోనే పండుతుంది. ఖమ్మం, మహబూబాబాద్‌,వరంగల్‌, జోగులంబా గద్వాల్‌, మరికొన్ని జిల్లాల్లో నల్ల తామర తెగులుతో రైతులకు నష్టం జరిగిందని మా దృష్టికి వచ్చింది.మరోసారి ఈ నష్టం జరగవద్దని ముందస్తుగా కేంద్రాన్ని కోరుతున్నాం’’ అని అన్నారు.దీనిపై కేంద్రమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆయిల్‌ ఫామ్‌ కోసం ప్రాంతీయ పరిశోధన సంస్థ కోసం విజ్ఞప్తి చేశారు.పక్క రాష్ట్రం పెద్దవేగిలో ఉంది విూకు అవసరం పడకపోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారన్నారు.దేశంలోనే అత్యధిక స్థాయిలో పామాయిల్‌ సాగు విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదన్నారు.అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే లక్షలాది ఎకరాల సాగు జరుగుతుందన్నారు.అప్పటికప్పుడు ప్రాంతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలంటే సాధ్యం కాదన్నారు.మేము ముందుగా 150 ఎకరాల భూమి కూడా సిద్ధం చేశామని కేంద్రమంత్రికి తెలిపారు. అనుమతిస్తే వెంటనే పనులు ప్రారంభించవచ్చు అని తెలిపారు.ప్రాంతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు పునః పరిశీలిస్తమని కేంద్రమంత్రి చెప్పారు.కేంద్రం`రాష్ట్రం కలిసి ఇచ్చే డ్రిప్‌ ఇరిగేషన్‌ అంశంపై చర్చించాం.డ్రిప్‌ ఇరిగేషన్‌ అంశంలో కేంద్రం కొత్తగా ఒక నిబంధన తెచ్చారు.దశల వారీగా కాకుండా ఏక కాలంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ టార్గెట్‌ ను పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం.కావున మొత్తం ఒకేసారి సబ్సిడీ ఇవ్వాలని కోరారు.కోరాము.. అందుకు కేంద్ర మంత్రి అంగీకరించారు.వెంటనే ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు.దేశవ్యాప్తంగా పంటలమార్పిడిపై త్వరలో ప్రధానమంత్రి సమావేశం నిర్వహించాలనుకుంటున్నారని కేంద్రమంత్రి చెప్పారు.ఆ సమావేశానికి అన్ని రాష్ట్రాలను ఆహ్వానిస్తామని చెప్పారు.పంటల మార్పిడిపై రైతాంగానికి పెద్ద ఎత్తున సహకారం అందించాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్రం ఎప్పటి నుంచో చెబుతున్నది.మార్కెట్‌ ఓరియెంటెడ్‌ పంటల పండిరచే దిశగా రైతులను ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది.ఇది కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలని చెబుతున్నామన్నారు.



4.కాంగ్రెస్‌ బలోపేతానికి త్రిముఖ వ్యూహం

` సోనియా గాంధీ మరో సంచలన నిర్ణయం

` రాబోయే ఎన్నికల కోసం టాస్క్‌ఫోర్స్‌ 2024 ఏర్పాటు

` భారత్‌ జోడే  యాత్రకు కమిటీ ప్రకటన

న్యూఢల్లీి,మే24(జనంసాక్షి):సంస్థాగత మార్పులే లక్ష్యంగా ఇటీవలే రాజస్థాన్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల కోసం టాస్క్‌ఫోర్స్‌ 2024 ను సోనియా గాంధీ మంగళవారం వెల్లడిరచారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో స్థానం కల్పించగా.. అత్యంత కీలకమైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి స్థానం దక్కింది. కాగా, చింతన్‌ శిబిర్‌లో ప్రియాంక గాంధీని అధ్యక్షురాలు చేయాలని ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో ప్రియాంకకు స్థానం దక్కడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కమిటీల్లో అసమ్మతి నేతల(జీ`23)కు సైతం చోటుదక్కడం విశేషం. మరోవైపు.. కశ్మీర్‌ నుంచి కన్యా కుమారి వరకూ దేశ వ్యాప్తంగా రాహుల్‌ పాదయాత్ర(భారత్‌ జోడే యాత్ర) చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వున్న నిరుద్యోగ సమస్యను హైలెట్‌ చేయాలని నిర్ణయించింది.  భారత్‌ జోడే  యాత్రకు సంబంధించి కూడా సోనియా ఓ కమిటీని ప్రకటించారు.

కమిటీల్లో సభ్యులు వీరే.. 

పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో రాహుల్‌ గాంధీ,గులాంనబీ ఆజాద్‌,దిగ్విజయ్‌ సింగ్‌, మల్లికార్జున ఖర్గే,కేసీ వేణుగోపాల్‌,అంబికా సోనీ,ఆనంద్‌ శర్మ, జితేంద్ర సింగ్‌లు ఉన్నారు.టాస్క్‌ఫోర్స్‌ 2024 కమిటీలో ప్రియాంక గాంధీ,కేసీ వేణుగోపాల్‌,రణదీప్‌ సూర్జేవాలా,చిదంబరం,ముకుల్‌ వాస్నిక్‌,జయరాం రమేశ్‌,అజయ్‌ మాకెన్‌, సునీల్‌ కనుగోలు ఉన్నారు. భారత్‌ జోడే పాదయాత్ర కమిటీలో శశి థరూర్‌,సచిన్‌ పైలట్‌,దిగ్విజయ్‌ సింగ్‌, కేజే జార్జ్‌, రంవీత్‌ సింగ్‌ బిట్టూ,ప్రద్యుత్‌ బోల్‌దోలోయీ,జీతూ పట్దారి, సలీమ్‌ అహ్మద్‌లకు చోటు కల్పించారు.





5.అంబేడ్కర్‌పేరు పెట్టారని..అరాచకం సృష్టించారు

వీరంగం సృష్టించిన  ఉన్మాదులు

కొనసీమ జిల్లాలో కలకలం

పేరుమార్చొద్దని పెద్దఎత్తున ఆందోళన

మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిప్పు

అమలాపురంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత

అమలాపురం,మే24(జనంసాక్షి):కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరుపెట్టారని ఉన్మాదులు మంగళవార వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళిళే..కోనసీమ జిల్లా పేరును ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ రెవెన్యూశాఖ ఇటీవల ప్రాథమిక ప్రకటన జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలను 30 రోజుల్లోగా కలెక్టర్కు తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో కోనసీమ పేరునే కొనసాగించాలంటూ ఉన్మాదులు ఆందోళనకు దిగారు.దీంతో ఈ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్లో ఆందోళనకు దిగారు. ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.పోలీసులు రంగ ప్రవేశం చేసి కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి నుంచి కొందరు తప్పించుకుని కలెక్టరేట్‌ వైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు వెంబడిరచారు. మరోవైపు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని సవిూక్షించారు. ఆందోళనకారులను ఆయన కూడా చెదరగొట్టారు. ఈ క్రమంలో అమలాపురం ఏరియా ఆస్పత్రి వద్ద పోలీసులపై ఆందోళకారులు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్పీ సుబ్బారెడ్డి రాళ్లదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. పట్టణంలోని నల్ల వంతెన వద్ద ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. రాళ్లదాడిలో కొంతమంది పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. కలెక్టరేట్‌ వైపు దూసుకెళ్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను తరలిస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకారులు బస్సును దగ్ధం చేశారు.ఆందోళనకారుల నిరసన సెగ మంత్రి విశ్వరూప్కు తగిలింది. అమలాపురంలోని బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు. మంత్రి ఇంటికి నిప్పంటించారు. అయితే దాడికి ముందే మంత్రి కుటుంబసభ్యులను పోలీసులు అక్కడనుంచి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అంబేడ్కర్‌ పేరు జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. జిల్లా ప్రజల విజ్ఞప్తుల మేరకే జిల్లా పేరు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారడం జరిగిందన్నారు. ఆందోళనకారులను సంఘ విద్రోహ శక్తులు నడిపిస్తున్నాయని చెప్పారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు







7.అవినీతి ఆరోపణలతో పంజాబ్‌ ఆరోగ్యమంత్రి అరెస్టు..

` పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ సంచలన నిర్ణయం 

చండీగఢ్‌,మే24(జనంసాక్షి): పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్‌ సింగ్లాను తాజాగా మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రిపై ఆరోపణలు రావడం.. అందుకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు కూడా లభించడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సింగ్లాపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. వెంటనే మంత్రిని అరెస్టు చేసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే అవినీతి ఆరోపణలపై మంత్రి సింగ్లా అరెస్టు కావడం గమనార్హం.దంత వైద్యుడైన విజయ్‌ సింగ్లా.. మన్సా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, పంజాబీ సింగర్‌ శుభ్దీప్‌ సింగ్‌ సిద్ధూపై విజయం సాధించారు. అనంతరం నూతన కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆ శాఖలో పరికరాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు, కొనుగోళ్ల విషయంలో ఒక శాతం కవిూషన్‌ డిమాండ్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఆధారాలు ముఖ్యమంత్రికి చేరడంతో తీవ్రంగా పరిగణించిన ఆయన.. సింగ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆయన్ను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా తమ ప్రభుత్వంలో ఒక్క శాతం అవినీతిని కూడా సహించబోమని సీఎం భగవంత్‌ మాన్‌ స్పష్టం చేశారు. మంత్రిపై ఆరోపణల నేపథ్యంలో సీఎం వీడియో సందేశం ఇచ్చారు. ‘ఓ శాఖలో టెండర్లు, పరికరాల కొనుగోలు విషయంలో ఒకశాతం కవిూషన్‌ కావాలని మంత్రి డిమాండ్‌ చేశారని నాకో ఫిర్యాదు అందింది. దీన్ని సీరియస్గా తీసుకున్నా. ఈ కేసు విషయం కేవలం నాకు మాత్రమే తెలుసు. విూడియాకు, ప్రతిపక్షాలకు దీనిపై సమాచారం లేదు. ఆధారాలు ఉండటంతోపాటు సింగ్లా కూడా తన తప్పులను అంగీకరించారు. దీంతో ఆయన్ను కేబినెట్‌ నుంచి తొలగించడంతోపాటు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించా’ అని పేర్కొన్నారు.ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్కు ఓటు వేశారని, దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలన్నారు. దేశానికి కేజ్రీవాల్‌ లాంటి కుమారుడు, భగవంత్‌ మాన్‌ లాంటి సైనికుడు ఉన్నంత కాలం అవినీతిపై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ఆప్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరుడిపై ఈ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. అవినీతి ఆరోపణలపై 2015లో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా తన కేబినెట్లో ఒకరిని తొలగించిన విషయం తెలిసిందే.


8.భాజపాతో విభేధించిన నితీష్‌

` కులగణన చేసి తీరతామని వెల్లడి

పట్నా,మే24(జనంసాక్షి): కుల గణనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ అన్నారు. దీనిపై ఈ వారాంతంలో అఖిల పక్ష భేటీ జరగనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడిరచారు. మిత్ర పక్ష భాజపాతో నీతీశ్కు మనస్పర్థలు తలెత్తినట్లు వార్తలు వస్తోన్న వేళ కుల గణనపై సీఎం ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘కులగణనకు అనుకూలంగా శాసనసభ, శాసనమండలిలో రెండుసార్లు తీర్మానాలు ఆమోదం పొందాయి. అందువల్ల ఈ ప్రక్రియ ప్రారంభించడంలో ఎలాంటి సమస్య లేదు. దీనికి ప్రతిపక్షాలు కూడా మద్దతిస్తాయని భావిస్తున్నా. ఈ వారంతంలో అఖిల పక్ష భేటీ నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం’’ అని నీతీశ్‌ వెల్లడిరచారు. కులగణనకు భాజపా వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కులాల వారీ గణన చేపట్టాలని వస్తోన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అయితే కుల గణనకు ప్రతిపక్ష ఆర్జేడీ మద్దతివ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో నీతీశ్‌ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా నీతీశ్‌ పలు విషయాల్లో భాజపాపై బహిరంగంగానే విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్సార్సీ, ఆర్టికల్‌ 370 తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నీతీశ్‌ వ్యతిరేకించారు.



9.భారత్‌లో ప్రజాస్వామ్యానికి ముప్పు

` వ్యవస్థలను అణచివేత దిశగా మోడీ చర్యలు

` ఆర్‌ఎస్‌ఎస్‌,మోడీతో ప్రజాస్వామ్యానికి ముప్పు

` లండన్‌ పర్యటనలో రాహుల్‌ విమర్శలు

లండన్‌,మే24(జనంసాక్షి):ప్రధాని మోదీ విజన్‌లో దేశ ప్రజలు అందరూ ఉండరని.. కొంతమంది మాత్రమే ఆయన దృష్టిలో ఉంటారని, వారి ప్రయోజనాలను మాత్రమే పరిగణిస్తారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను అణచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. లండన్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌లు భారత్‌ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు , భారత్‌లో విూడియాను కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కొంతమంది వ్యాపారవేత్తలు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అందుకే నేను మాట్లాడిరది భారత్‌లోని ఛానెళ్లలో 30 సెకన్లకు మించి ప్రసారం కాదు. ఇక్కడ పోరాటం కేవలం ఓ రాజకీయ పార్టీపైన కాదు.. ఆ వ్యవస్థ విూద అని అన్నారు.  దీనిపై విజయం సాధించడం అంత సులభం కాదు. జీవితకాలం పట్టొచ్చు. అయినా మేము పోరాడుతాం’ అని రాహుల్‌ పేర్కొన్నారు.భారత్‌లో.. సమస్యలను ఎత్తిచూసే సంస్థలను క్రమంగా అణచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్‌, ఎన్నికల వ్యవస్థ సహా ప్రజాస్వామ్య వ్యవస్థను ఓ సంస్థ తన అధీనంలోకి తెచ్చుకుందని పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం కార్పస్‌ క్రిస్టీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన ’ఇండియా ఎట్‌ 75’ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. స్వేచ్ఛగా ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నప్పుడే భారత్‌ సజీవంగా ఉన్నట్లు.. అదే మౌనంగా ఉంటే ఇంక అందులో అర్థం లేదు. పార్లమెంట్‌, ఎన్నికలు, ప్రజాస్వామ్యం మొదలైన వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ విజన్‌లో కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. ఈ వైఖరిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. హిందూ జాతీయవాదం అనే పదాన్ని కూడా అంగీకరించను. దాడులు, హత్యలకు పాల్పడే వారి సిద్దాంతాలను హిందుత్వంతో పోల్చడం సరికాదని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. 




10.ప్రతిజిల్లాలో మెడికల్‌ కళాశాల

` పేదలకు అందుబాటులో సర్కారీ వైద్యం

` అన్ని రకాల పరీక్షల కోసం టి డయాగ్నోస్టిక్స్‌ 

` సిద్దిపేటలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట,మే24(జనంసాక్షి): దేశంలోనే ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని మంత్రి హరీష్‌ రావు అన్నారు. పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నొస్టిక్‌ రేడియాలజీ హబ్‌ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులు పెంచే కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు ప్రతి జిల్లా ఆసుపత్రులలో టీ డయాగ్నోస్టిక్‌ హబ్‌, రేడియాలజీ హబ్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రులలో రోగులకు 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్‌ రే, అల్టా సౌండ్‌ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. ప్రతి జిల్లాలో మెడికల్‌ కళాశాల పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 700 మెడికల్‌ కళాశాల సీట్లు ఉండేవని.. ఏడేళ్లలో 2,840కి పెరిగాయని మంత్రి తెలిపారు. రాబోయే రెండేళ్లలో 5,240కి పెంచుతామని పేర్కొన్నారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. పీహెచ్‌సీలకు గుండెనొప్పితో వస్తే ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్‌ రే, అల్టా సౌండ్‌, మెమెగ్రఫీ సేవలు అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకొచ్చా మన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో 33 రేడియాలజీ ల్యాబ్‌ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు.  అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేలా తెస్తున్నాం. హైదరాబాద్‌ జంట నగరాల్లో అదనంగా 10 రేడియాలజీ ల్యాబ్లుª` ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రికి, ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లకు వెళ్లొద్దని ఏ వైద్య పరీక్ష కావాలన్నా.. ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేస్తున్న దృష్ట్యా ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలన్నారు.  రాష్ట్రంలోని 8 చోట్ల మెడికల్‌ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు ప్రారంభం చేయనున్నాం. అదేవిధంగా ప్రభుత్వాసు పత్రులలో నార్మల్‌ డెలివరీల సంఖ్య పెరగాలన్నారు హరీష్‌ రావు. అన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రులలో స్టెవిూ కార్యక్రమం ద్వారా గుండెపోటు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో 33జిల్లాలో 33 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 8 మెడికల్‌ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఏంహెచ్‌ఓ కాశీనాథ్‌, ఇతర వైద్య అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.