all news

 1.రాష్ట్రానికి పెట్టుబడుల వరద
` రూ.1000కోట్లతో రైల్వేకోచ్‌ఫ్యాక్టరీ
` తెలంగాణలో ఏర్పాటుకు ముందుకొచ్చిన స్టాడ్లర్‌రైల్‌
` మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు
` ష్నైడర్‌ కంపెనీతో మంత్రి కెటిఆర్‌ చర్చలు
` రాష్ట్రంలో ష్నైడర్‌ఎలక్ట్రిక్‌కంపెనీ పెట్టుబడులు
` మరో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధం
` ఫెర్రింగ్‌ ఫార్మా తన రెండో యూనిట్‌ను ప్రారంభించేందుకు ఆసక్తి
` హైదరాబాద్‌లో రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ
హైదరాబాద్‌,మే25(జనంసాక్షి):దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో రైల్వేకోచ్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్‌రైల్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఎంఓయూ కుదుర్చుకున్నది. రాష్ట్రంలో ఉన్న మేధో సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అండ్‌ స్టాడ్లర్‌ రైల్‌ కలిసి ఈ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని నెలకొల్పనున్నాయి. ఈ మేరకు స్టాడ్లర్‌ రైల్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అన్స్‌ గార్డ్‌ బ్రోక్‌ మెయ్‌, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.ఒప్పందం మేరకు రానున్న రెండేళ్లలో తెలంగాణలో రూ.1000కోట్లు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ స్థాపన కోసం కంపెనీ పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారుచేసే రైల్వే కోచ్‌లను కేవలం భారత్‌తో పాటు ఏషియా పసిఫిక్‌ రీజియన్‌కు సైతం ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో తమ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్‌ రైల్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశానికే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేలా రైల్వే కోచ్‌లను తయారు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు. కంపెనీ పెడుతున్న రూ.1000కోట్ల పెట్టుబడి ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్‌ కంపెనీకి అత్యంత ప్రాధాన్యంగా మారబోతున్నదని అని కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్స్‌ గార్డ్‌ బ్రోక్‌ మెయ్‌ తెలిపారు. తమ కంపెనీ ఏసియా పసిఫిక్‌ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంస్థకు అందిస్తున్న సహకారం హర్షం వ్యక్తం చేశారు.
మరో యూనిట్‌ను ఏర్పాటుకు ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ సిద్ధం
కాగా రాష్ట్రంలో మరో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ సిద్ధమైంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో ష్నైడర్‌ కంపెనీ ప్రతినిధి చర్చించి ఈ విషయాన్ని ప్రకటించారు. కంపెనీ విస్తరణ ప్రణాళికలపై ష్నైడర్‌ కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌తో చర్చించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రెండో యూనిట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ష్నైడర్‌ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్‌లో రూ. 500 కోట్ల పెట్టుబడి.. ఫెర్రింగ్‌ ఫార్మా ప్రకటన
రాష్ట్రంలో ఇప్పటికే తన తొలి యూనిట్‌ను ప్రారంభించిన ఫెర్రింగ్‌ ఫార్మా తన రెండో యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దావోస్‌ వేదికగా ఈ నిర్ణయాన్నిస్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఫార్మా ప్రకటించింది.దాదాపు నెల క్రితమే హైదరాబాద్‌లో తమ ఉత్పత్తులను ప్రారంభించిన ఈ కంపెనీ.. ఇప్పుడు రెండో యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకోసం రానున్న రెండు మూడేండ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడిరచింది. డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాల్లో భాగంగా ఆ కంపెనీ ప్రతినిధులు బుధవారం దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఫెర్రింగ్‌ ఫార్మా కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




2.నేడు రాష్ట్రానికి ప్రధాని రాక
స్వాగతం పలికేందుకు వెళ్లనున్న తలసాని
` ఐఎస్‌బి ద్విశతాబ్ది ఉత్సవాలకు హాజరు
` ప్రధాని పర్యటనతో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు
` పలు రూట్లలో ట్రాఫిక్‌ డైవర్షన్‌
హైదరాబాద్‌,మే25(జనంసాక్షి):ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ప్రఖ్యాత ఐఎస్‌బి సంస్థ వార్షికోత్వంలో పాల్గొంటారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలకు  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఈ పర్యటనలో కెసిఆర్‌ పాల్గొనడం లేదు. ఇక్రిశాట్‌ ఉత్సవాల సందర్భంగా దూరంగా ఉన్నట్లే ఇప్పుడు ఐఎస్‌బి ఉత్సవాలకు కూడా కెసిఆర్‌ దూరంగా ఉండనున్నారు. ఇకపోతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన సందర్భంగా గచ్చిబౌలిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఐఎస్‌బీకి 5 కిలోవిూటర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్స్‌, మినీ ఎయిర్‌క్రాప్ట్‌లపై నిషేధం విధించారు. ఏరియల్‌ వ్యూ కోసం లైవ్‌ టెలికాస్ట్‌పై పోలీసులు నిషేధించారు. అటు ఐఎస్‌బీ, హెచ్‌సీయూ పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగనున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు బేగంపేట, ఐఎస్‌బీ, సెంట్రల్‌ యూనివర్సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయి. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్‌ వరకు ఉన్న ఐటీ, ఇతర కంపెనీలు తమ ఆఫీస్‌ టైమింగ్స్‌ను మార్చు కోవాలని సూచించారు. ఈ రూట్లలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద మలుపుతీసుకుని బొటానికల్‌ గార్డెన్‌, కొండాపూర్‌ ఏరియా దవాఖాన, మజీద్‌ బండ కమాన్‌, హెచ్‌సీయూ డిపో రోడ్‌ విూదుగా వెళ్లాల్సి ఉంటుంది. విప్రో జంక్షన్‌ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి క్రాస్‌రోడ్‌, హెచ్‌సీయూ బ్యాక్‌ గేట్‌, నల్లగండ్ల విూదుగా వెళ్లాల్సి ఉంటుంది. విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేవారు ఫెయిర్‌ ఫీల్డ్‌ హోటల్‌, నానక్‌రాంగూడ రోటరీ, ఓఆర్‌ఆర్‌ రోడ్‌, ఎల్‌ అండ్‌ టీ టవర్స్‌ విూదుగా వెళ్లాల్సి ఉంటుంది. కేబుల్‌ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలు.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45, మాదాపూర్‌ పీఎస్‌, సైబర్‌ టవర్స్‌, హైటెక్స్‌, కొత్తగూడ, బొటానికల్‌ గాª`డ్గంªన్‌, గచ్చిబౌలి జంక్షన్‌ విూదుగా దారిమల్లిస్తున్నట్లు చెప్పారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో సిటీలోకి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధం విధిస్తున్నామని చెప్పారు.  నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇదిలావుంటే ప్రధాని పర్యటనకుమరోమారు కెసిఆర్‌ దూరంగగా ఉంటున్నారు. బుధవారం సాయంత్రం బెంగుళూరుకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు మరోసారి కేసీఆర్‌ దూరం కానున్నారు. గురువారం బెంగుళూరు నుంచి అన్నాహజారే స్వగ్రామం  రాలె గావ్‌ సిద్ధి వెళ్లనున్నారు. అటు నుంచి కుటుంబ సబ్యులతో కలిసి షిర్డీ వెళ్లి అక్కడ సాయినాథున్ని దర్శించుకోనున్నారు.  29, 30 తేదీల్లో బెంగాల్‌, బీహార్‌ రాష్టాల్ర పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే గతంలో కూడా ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ దూరంగానే ఉన్నారు. స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో అప్పటి ప్రధాని పర్యటనకు కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి బెంగుళూరు టూర్‌ కారణంగా దూరం కానున్నారు. కేసీఆర్‌ కావాలనే ఇలా చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.


3.యాసిన్‌మాలిక్‌కు జీవితఖైదు
పాటియాల కోర్టు సంచలన తీర్పు
న్యూఢల్లీి,మే25(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు ఢల్లీి పటియాలా హౌజ్‌ ఎన్‌ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ. 10లక్షల జరిమానా విధించింది. పదేళ్లు కఠిన కారాగార శిక్ష, మరో ఐదేళ్లు ఉపా చట్టం కింద శిక్ష అమలు చేయాలని తీర్పునిచ్చింది. అంతకుముందు సెక్షన్‌ 121 కింద యాసిన్‌ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోర్టులో వాదనలు వినిపించింది. ఈ సెక్షన్‌ కింద ఉరి మ్యాగ్జిమమ్‌ పనిష్‌మెంట్‌ కాగా.. అతితక్కువ అంటే యావజ్జీవమే. ఈ నేపథ్యంలో యాసిన్‌ మాలిక్‌కు ఢల్లీి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కేసు విచారిస్తున్న రాజీవ్‌ కుమార్‌ శర్మ సెలవుల్లో ఉన్నందున స్పెషల్‌ జడ్జీ ప్రవీణ్‌ సింగ్‌ తన తీర్పును వెల్లడిరచారు. తనకు మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ కోరడంపై యాసిన్‌ మాలిక్‌ స్పందించారు. తను దేనికీ అడుక్కోనని, కేసు కోర్టులో ఉన్నందుకున కోర్టు నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మాలిక్‌ తరపున కోర్టు విచారణకు హాజరైన న్యాయవాది మాట్లాడుతూ.. గత 28 ఏళ్లలో ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలు, హింసకు పాల్పడినట్లు భారత ఇంటెలిజెన్స్‌ విభాగం రుజువు చేస్తే ఉరిశిక్షను అంగీరిస్తానని యాసిన్‌ చెప్పినట్లు తెలిపారు. అదే విధంగా యాసిన్‌ ఏడుగురు ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశాడని, నేరం రుజువైతే రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతానని కూడా  చెప్పినట్లు వెల్లడిరచారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించి 2017లో మాలిక్‌పై ఎన్‌ఐఏ కోర్టు కేసు నమోదు చేసింది. భద్రతాబలగాలపైకి రాళ్లు రువ్వడం, స్కూల్స్‌ తగలపెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, దేశ విద్రోహ చర్యలకు పాల్పడడం వంటి వాటి కోసం ఉగ్రనిధులను వినియోగించినట్టు ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. 1989లో జరిగిన కశ్మీర్‌ పండిట్ల మారణహోమంలోనూ జేకేఎల్‌ఎఫ్‌ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మాలిక్‌తో పాటు పలువురు కశ్మీరీ వేర్పాటువాద నేతలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌లపై కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.


4.నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్‌..
` తాజా పరిణామాలపై దేవెగౌడతో చర్చ
` మాజీ సీఎం కుమారస్వామితో తోనూ సమావేశం
హైదరాబాద్‌,మే25(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధాని హెచ్‌.డీ. దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ సమావేశం కానున్నారు.రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరివెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానాలు సహా తాజా పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చించనున్నట్లు సమాచారం. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్‌..అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రాంతీయ పార్టీల పాత్ర, తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రేపు సాయంత్రం కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ రానున్నారు.


5.కాంగ్రెస్‌కు కపిల్‌ సిబల్‌ గుడ్‌బై
` ఎస్పీ మద్ధతులో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ దాఖలు
` పార్టీకి 16నే రాజీనామా చేశానని వెల్లడిరచి సీనియర్‌ కాంగ్రెస్‌నేత
దిల్లీ,మే25(జనంసాక్షి):వరుస పరాజయాలతో కుదేలవుతోన్న కాంగ్రెస్‌ పార్టీ సంస్కరణలకు సిద్ధమవుతోన్న వేళ.. ఆ పార్టీకి తాజాగా భారీ షాక్‌ తగిలింది.సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ పార్టీకి రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్‌ను వీడినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా సమాజ్‌వాజ్‌ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ దాఖలు చేశారు. మే 16నే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన విూడియాకు వెల్లడిరచారు.ఇదిలాఉంటే, కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులపై పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ బహిరంగంగానే తన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ రెబల్‌గా మారిన జీ`23 బృందంలోనూ కపిల్‌ సిబల్‌ ఉన్నారు. పార్టీ మొత్తం గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉండడాన్ని వ్యతిరేకిస్తోన్న ఆయన.. అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ రాహుల్‌ గాంధీనే తీసుకుంటారని పలుసార్లు విమర్శించారు. ఇలా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కపిల్‌ సిబల్‌ చివరకు పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడిరచారు.
స్వతంత్ర గళం కోసమే..
’పార్లమెంట్‌లో స్వతంత్ర గళం ఉండడం ఎంతో ముఖ్యం. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడే ఎటువంటి రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని మన గళాన్ని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ దాఖలు చేశాను’ అని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. అయితే, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన కపిల్‌ సిబల్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. దీంతో సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలోనే కపిల్‌ సిబల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ.. ‘కపిల్‌ సిబల్‌తోపాటు మరో ఇద్దరు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది. సీనియర్‌ లాయర్‌ అయిన కపిల్‌ సిబల్‌ పార్లమెంట్‌లో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలరు. ఆయన వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ అభిప్రాయాలను కూడా పార్లమెంటులో వెల్లడిస్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.
అందుకేనా..?
ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కపిల్‌ సిబల్‌ పదవీ కాలం జులైతో ముగుస్తుంది. అయితే, 2016లో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున రాజ్యసభకు ఎన్నికైన సిబల్‌కు అప్పుడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తెలిపింది. ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే మిగిలాయి. దీంతో కాంగ్రెస్‌ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. ఇదే సమయంలో కపిల్‌ సిబల్‌కు సమాజ్‌వాదీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత అజాంఖాన్‌ తరపున సుప్రీం కోర్టులో సిబల్‌ వాదనలు వినిపించారు. రెండేళ్ల తర్వాత ఆయనకు బెయిల్‌ లభించింది. దీంతో అజాంఖాన్‌ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఇందుకు కపిల్‌ సిబల్‌ కృషి చేసినందునే ఆయనకు సమాజ్‌వాదీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.




6.కేసీఆర్‌ కలిసిన వద్దిరాజు రవిచంద్ర
` తమకు అవకావం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు రాజ్యసభ సభ్యుడు
హైదరాబాద్‌,మే25(జనంసాక్షి): రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును ప్రగతి భవన్‌లో శుక్రవారం వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలుపుకున్నారు. అలాగే రాజ్యసభ సభ్యులుగా నామినేషన్‌ వేసిన అనంతరం, సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌ లో మర్యాదపూర్వకంగా కలిసి, తమకు అవకాశం కల్పించి నందుకు దీవకొండ దామోదర్‌ రావు, బండి పార్థసారథి రెడ్డిలు కూడా  కృతజ్జతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, నవీన్‌ రావు, ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు ,ఎమ్మెల్సీ  తాతామధు, ఎమ్మెల్యేలు విప్‌ రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్‌ రావు, ఉపేందర్‌ రెడ్డి, రాములు నాయక్‌, మెచ్చా నాగేశ్వర్‌ రావు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


7.కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌
` ముగ్గురు మిలిటెంట్లు, ఒక జవాన్‌ మృతి
శ్రీనగర్‌,మే25(జనంసాక్షి):జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పాక్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాముల్లాలోని క్రీరి ప్రాంతంలో నజీభట్‌ క్రాసింగ్‌ వద్ద ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు, పోలీసుల సంయుక్త బృందం కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో దాక్కున్న ఉగ్రవాదులు బలగాలను చూసి, వారి పైకి కాల్పులు జరిపాయి. సైన్యం సైతం ప్రతిగా కాల్పులు జరుపడంతో ముగ్గురు హతమయ్యారు. ముగ్గురు పాక్‌కు చెందిన ఉగ్రవాదులని తెలిపారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో జేకేపీ జవాన్‌ వీరమరణం పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్‌ ఐజీపీ తెలిపారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, ప్రస్తుతం కూంబింగ్‌, సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని వివరించారు.


8.వంటనూనెల దిగుమతులపై సుంకం తగ్గింపు
2024 మార్చి 31 వరకు పన్నుల మినహాయింపు
కేంద్రప్రభుత్వం నిర్ణయంతో తగ్గనున్న ధరలు
న్యూఢల్లీి,మే25(జనంసాక్షి):సన్‌ ప్లవర్‌ ఆయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌ దిగుమతిపై కస్టమ్స్‌ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏడాదికి 20 లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున సన్‌ ప్లవర్‌, సోయాబీన్‌ నూనెలపై పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీంతో 2024 మార్చి 31 వరకు మొత్తం 80 లక్షల మెట్రిక్‌ టన్నుల నూనెల దిగుమతికి పన్ను భారం ఉండదు. దేశంలో వంటనూనెల ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేందుకు ఉపయోగపడుతందంది. దిగుమతులు కోటా కోసం మే 27 నుంచి జూన్‌ 18 లోపు సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ కోటాకు మించి దిగుమతి చేసుకునే నూనెలకు సుంకాలు మాములుగా ఉంటాయన్నారు.ప్రస్తుతం వంటనూనెలపై కస్టమ్స్‌, సెస్‌ 5.5 శాతం వసూలు చేస్తున్నారు. ఈ పన్ను లేకుంటే సోయాబీన్‌ ఆయిల్‌ లీటరుకు 3 రూపాయలు తగ్గుతుందని తెలిపారు ఎక్స్‌ పర్ట్స్‌. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం వల్ల రవాణా ఛార్జీల రూపేణ కొంత ఉపశమనం లభిస్తోంది.ఈఏడాది చక్కెర ఎగుమతులను 10 మిలియన్‌ టన్నులకే పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉంచి, ధరలు పెరగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకంది. జూన్‌ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం పరిమితులు విధించడం గత ఆరేళ్లలో ఇది తొలిసారి.


9.రాజ్యసభకు టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు
దామోదర్‌ రావు, పార్థసారథిరెడ్డిలకు మంత్రుల అభినందన
హైదరాబాద్‌,మే25(జనంసాక్షి):రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్లను దాఖలు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు గత మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా దామోదర్‌రావు, హెటిరో పార్థసారధికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


10.అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు
` ఎలమెంటరీ పాఠశాలలో దుండగుడి కాల్పులు
` యువకుడి విచ్చలవిడి కాల్పుల్లో 21మంది మృతి
` మృతుల్లో 19మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తింపు
` ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురైన అధ్యక్షుడు జో బైడెన్‌
` ఇలాంటి నరేమేధాలకు ఇక స్వస్తి పలకాలన్న కమలా హ్యారిస్‌
టెక్సాస్‌,మే25(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. మృతి చెందిన విద్యార్థుల వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెక్సికన్‌ సరిహద్దులోని ఉవాల్డే నగరంలో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటన ఇదేనని రాష్ట్ర గవర్నర్‌ గ్రేగ్‌ అబాట్‌ పేర్కొన్నారు. కాల్పుల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కాల్పులు జరిపింది 18 ఏళ్ల టీనేజర్‌గా పోలీసులు గుర్తించారని గవర్నర్‌ తెలిపారు. అంతేగాక పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతి చెందినట్లు గవర్నర్‌ స్పష్టం చేశారు. కాగా, 2018లో ప్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్‌ విద్యార్థులతో సహా ముగ్గురు టీచర్లు మృతిచెందారు. ఈ ఘటన తర్వాత అగ్రరాజ్యంలో ఇదే అత్యంత దారుణ సంఘటనగా పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిజేశారు. దేశంలోని గన్‌ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులకు పిల్లలు శాశ్వతంగా దూరం కావడం అంటే.. అది వాళ్ల గుండెకు మాయని గాయమని, కొంతకాలం వరకు కోలుకోలేని క్షోభ అంటూ బైడెన్‌ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కారు ప్రమాదం రూపంలో తనకు దూరమైన మొదటి భార్య, కూతురిని అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు. అటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఇక చాలని.. ఇకపై ఇలాంటి వాటికి చోటు ఇవ్వకూడదని పేర్కొన్నారు. దేశం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె తెలిపారు. మన గుండెలు బద్ధలు అవుతూనే ఉన్నాయి. చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయాలి అని కమలా చెప్పు కొచ్చారు.  సల్వడార్‌ రామోస్‌ అనే 18 ఏండ్ల యువకుడు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉవాల్డేలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లోకి ప్రవేశించాడు. తనవెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో 21 మంది అక్కడికక్కడే చనిపోగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ స్కూల్‌ను చుట్టుముట్టారని, వారు జరిపిన కాల్పుల్లో గన్‌మ్యాన్‌ కూడా చనిపోయాడని వెల్లడిరచారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


11.చెక్కెర ఎగుమతులపై నిషేధం విధింపు
న్యూఢల్లీి,మే25(జనంసాక్షి):దేశంలో చమురుధరలు ఆకాశాన్నంటాయి. ఈమధ్య కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంచెం దిగివచ్చాయి. కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగింది. ఆల్‌ టైం హైకి చేరింది. గోధుమల ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం ఎగుమతుల్ని నిషేధించింది. అదే బాటలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పంచదార ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్టు నిల్వలు, ధరల స్థిరీకరణ దృష్ట్యా గత ఆరేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులపై పరిమితులు విధించింది. 100 లాంగ్‌ టన్‌ మెజర్‌మెంట్‌లకు మించి పంచదార ఎగుమతి చేయడానికి వీల్లేదని ప్రకటించింది. జూన్‌ 1 నుంచి ఈ నిబంధన వర్తించనుంది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా పంచదార సప్లయ్‌లో తేడాలు వచ్చాయి. దీంతో దేశీయంగా పంచదార ధరలు పెరిగాయి. కేంద్రం తాజా నిర్ణయంతో పంచదార మరింతగా అందుబాటులోకి రానుంది. కేంద్రం విధించిన ఈ పరిమితి సెప్టెంబర్‌ 30, 2022 వరకూ వర్తిస్తుంది. ఈసీజన్‌ వరకూ దేశంలో 65-65 ఎల్‌ఎంటీ టన్నుల పంచదార నిల్వలు అందుబాటులో వుంటాయి. ఈ స్టాక్‌ దాదాపు 2-3 నెలలపాటు సరిపోతుందని కేంద్రం చెబుతోంది. నెలకు దాదాపు 24 ఎల్‌ఎంటీ పంచదార అవసరమవుతుంది. పండుగల సీజన్లో పంచదార వినియోగం ఎక్కువగా వుంటుంది. అక్టోబర్‌, నవంబర్‌ నాటికి పంట చేతికి వస్తుంది. దీంతో తదుపరి వినియోగం కోసం ప్రస్తుతం విధించిన నిషేధం ఉపకరిస్తుంది.

12.ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాల్లో రష్యా విధ్వంసం
డాన్‌ బాస్‌, లుగాన్స్క్‌ లను ఆక్రమించెందులు రష్యా ప్రయత్నం
కీలకమైన నగరాలపై బాంబులు, క్షిపణులతో దాడి
లుగాన్స్క్‌,మే25(జనంసాక్షి):రష్యా ఉక్రెయిన్‌ పై దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. అయినా యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు రష్యా. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో రాజధాని కీవ్‌ ను హస్తగతం చేసుకుందామని అనుకున్న రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడిరది ఉక్రెయిన్‌. కీవ్‌ ను స్వాధీనం చేసుకోవడం కుదరకపోవడంతో రష్యా, ఉక్రెయిన్‌ తూర్పు భాగం నుంచి మళ్లీ యుద్ధాన్ని మొదలు పెట్టింది. డాన్‌ బాస్‌, లుగాన్స్క్‌ ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే కీలకమైన నగరాలపై బాంబులు, క్షిపణులతో దాడి చేస్తోంది. పారిశ్రామిక నగరమైన సెవెరోడోనెట్స్క్‌ పై రష్యా తీవ్రంగా దాడి చేస్తోంది. రష్యా, తూర్పు ప్రాంతంలో ఉన్న ప్రతీ దాన్ని ధ్వంసం చేస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌ స్కీ అన్నారు. రష్యా దాడుల్లో వేలాది మంది ఉక్రెయిన్‌ ప్రజలు చనిపోగా.. వారందరికి నివాళులు అర్పించారు. ప్రపంచం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు అందివ్వాలని కోరాడు. ఇప్పటికే రష్యా రక్షణ మంత్రి సెర్గీ ఉక్రెయిన్‌తో దీర్ఘకాలిక యుద్ధానికి రష్యా రెడీగా ఉందని హెచ్చరించాడు. రష్యా తూర్పు ప్రాంతమైన డాన్‌ బాస్‌ ను పూర్తిగా హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. ఈ ప్రాంతం రష్యా వేర్పాటువాదులకు నిలయంగా ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌ లో శరణార్థి సంక్షోభం కూడా ఎక్కువ అవుతోంది. యుద్ధం వల్ల లక్షలాది మంది ఉక్రెయిన్లు సొంత దేశాన్ని వదిలి యూరప్‌ లోని రొమేనియా, పోలెండ్‌ దేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 6 మిలియన్ల మంది ఉక్రెయిన్‌ ను వదిలారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుతిన్‌ అనారోగ్యంతో యుద్ధాన్ని నికోలస్‌ పెత్రుషేవ్‌ పర్యవేక్షిస్తున్నారు. పుతిన్‌ కంటే ఈయన మరింత డేంజరస్‌ పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయి. రాబోయే కాలంలో మరింతగా ఉక్రెయిన్‌ పై దాడులు పెరిగే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో ఎంతటి మారణహోమం జరిగిందో తెలిపే మరో ఘటన ఉక్రెయిన్‌లో వెలుగుచూసింది. రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మరియపోల్‌లో శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ లో భరించలేని దుర్గంధం వెలువడిరది. దాంతో లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాలను చూసి నిశ్చేష్టులయ్యారు. దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. మేరియుపొల్‌ నగరంలో దాదాపు 21,000 మంది చనిపోయారనీ, ఈ ఘోరాలు బయటపడకుండా చూడడానికి సంచార దహనవాటికలను తీసుకురావడంతో పాటు సామూహిక పూడ్చివేతలను రష్యా చేపడుతోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది.. రష్యా సైనికులు డాన్‌బాస్‌ ప్రాంతంలో ముమ్మర దాడులు కొనసాగించారు. సీవియెరోదొనెటస్కీ, చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టి, దిగ్బంధం చేయడానికి బలగాలను మోహరించారు. స్విట్లోడార్‌స్కీ పట్టణాన్ని రష్యా సేనలు స్వాధీనపరచుకున్నాయి.