ALL NEWS

 1.జాతీయరాజకీయాలే ఎజెండాగా ఢల్లీికి కేసీఆర్‌
` వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం
` రేపు చంఢీఘడ్‌లో రైతు కుటుంబాలకు పరామర్శ
` ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించనున్న సీఎం
` హాజరు కానున్న ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌
హైదరాబాద్‌,మే20(జనంసాక్షి):జాతీయ స్థాయి పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢల్లీి చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ బృందం ఢల్లీికి వచ్చింది.ఢల్లీి పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. జాతీయ విూడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో భేటీ అవుతారు.22వ తేదీన సీఎం ఛండీగఢ్‌కు వెళ్తారు. జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్‌, హర్యానా, యూపీ, ఢల్లీికి చెందిన సుమారు 600 రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెకులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి చేపడతారు. సుమారు 4 రోజులపాటు సీఎం కేసీఆర్‌ చండీగఢ్‌లో గడుపుతారు.26న సీఎం కేసీఆర్‌ బెంగళూరులో పర్యటిస్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమవుతారు. 27న బెంగళూరు నుంచి రాలేగావ్‌ సిద్దికి వెళ్తారు. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకొని..తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటారు. 29 లేదా 30వ తేదీన.. బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్‌ సంసిద్ధం కానున్నారు. గల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోనున్నారు.
2` రాజ్యాంగంపై విశ్వాసం ప్రకటిస్తే
మావోయిస్టులతో చర్చలకు సిద్ధం
` ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌
రాయ్పూర్‌,మే20(జనంసాక్షి): నక్సల్తో శాంతి చర్చలు అంశంపై ఛత్తీస్గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం పట్ల నక్సల్స్‌ విశ్వాసం ప్రకటిస్తేనే శాంతి చర్చలు జరుగుతాయన్నారు. తమ ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు మావోయిస్టులు సుముఖత వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. సుక్మా జిల్లాలో పర్యటనలో భాగంగా గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టులు పేర్కొన్న షరతుల విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. చర్చలకు బస్తర్‌ కంటే మంచి ప్రదేశం ఏవిూ లేదని సీఎం వ్యాఖ్యానించారు. ‘ఛత్తీస్గఢ్లో నక్సలిజం మొదలైందే సుక్మా ప్రాంతంలో. ఇక్కడి నుంచే వారి తిరోగమనం కూడా జరుగుతోంది. నక్సల్స్‌ ప్రభావం క్షీణిస్తోంది. వారు చర్చలు జరపాలనుకుంటే.. మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ ఒక షరతు. రాజ్యాంగం పట్ల నక్సల్స్‌ విశ్వాసం ప్రకటిస్తేనే చర్చలు జరుగుతాయి’’ అని బఘేల్‌ తేల్చి చెప్పారు. ‘‘వారితో నేను ఏ ప్రాతిపదికన చర్చలు జరపాలి? భారతదేశం ఫెడరల్‌ రిపబ్లిక్‌. ఒక రాష్ట్రానికి సీఎంగా నేను ఎవరితోనైనా ముఖాముఖిగా మాట్లాడితే.. అవతలి వ్యక్తి రాజ్యాంగంపై నమ్మకం కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైన అంశం. వారు భారత రాజ్యాంగాన్ని విశ్వసించకపోతే నేను చర్చలు జరపలేను. సుక్మా అయినా ఇంకెక్కడైనా చర్చలకు రెడీ.. కానీ రాజ్యాంగం పట్ల విశ్వాసం ప్రకటిస్తేనే..’’ అని తెలిపారు. ఛత్తీస్గఢ్‌ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందుకు కొన్ని షరతులు పెట్టారు. జైళ్లలో ఉన్న తమ నేతలను విడుదల చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. అయితే, దీనిపై ఛత్తీస్గఢ్‌ హోంమంత్రి తామరద్వాజ్‌ సాహు స్పందిస్తూ .. భేషరతుగా చర్చలు జరుపుతామన్నారు.


3.పోలీసుశాఖలో ఉద్యోగాలకు గడువు,రెండేళ్ల వయోపరిమితి పెంపు
` 26 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా దరఖాస్తు గడువును సైతం పొడిగించింది. నోటిఫికేషన్‌ ఆధారంగా ఈ నెల 2వ తేదీన ప్రారంభమమైన దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఈ రోజు రాత్రి 10గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా, వయోపరిమితి పెంచడంతో మరికొంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నందున దరఖాస్తు గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు పోలీసు నియామక మండలి వెల్లడిరచింది.కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని తెలంగాణ యువత కోల్పోయిన నేపథ్యంలో వయోపరిమితిని పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. నోటిఫికేషన్లు జారీ చేసిన సమయంలోనే యూనిఫాం పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో మరికొంత మంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించినట్లు అయింది. కాగా, దరఖాస్తు ప్రక్రియ గడువును ఎట్టిపరిస్థితుల్లో పొడిగించేది లేదని పోలీసు నియామక మండలి గతంలోనే తేల్చి చెప్పింది. గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు మరికొంత సమయాన్ని ఇవ్వాలని నిరుద్యోగుల నుంచి వినతులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు గడువును పొడిగించింది.రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఆబ్కారీ, రవాణా, అటవీ, ప్రత్యేక భద్రత దళం తదితర యూనిఫామ్‌ సర్వీసు ఉద్యోగాలకు వయోపరిమితిని మూడేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఏప్రిల్‌ 13న ఉత్తర్వులు (జీవో నం.48) జారీచేసింది. ప్రత్యక్ష నియామకాలకు రెండేళ్ల పాటు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. తాజాగా మరో రెండేళ్లు వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌, డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు.కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 22గా ఉంది. ఇకపై ఈ పరిమితి 27 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రస్తుతం 27 సంవత్సరాలుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి 32కి పెరుగుతుంది.ఎస్సై ఉద్యోగాలకు కనిష్ఠ వయసు 21 కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 25 ఏళ్లుగా ఉంది. ఇకపై ఇది 30 ఏళ్లకు చేరుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం 30 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి ఉండగా.. ఇకపై 35 అవుతుంది.డీఎస్పీ పోస్టులకు కనిష్ఠ వయోపరిమితి 21 కాగా.. సాధారణ కేటగిరిలో గరిష్ఠ వయోపరిమితి 30గా ఉంది. ఇకపై అది 35 అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెరుగుతుంది.

4.దిశా ఎన్‌కౌంటర్‌ బూటకం
` సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక
` నిందితులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమీషన్‌ సిఫారసు
` కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం
దిల్లీ,మే20(జనంసాక్షి): దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.ఈ వ్యవహారంలో పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్‌ అభిప్రాయపడిరది. నిందితులు ఎదురుకాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదంటూ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పూర్కర్‌ కమిషన్‌ పేర్కొంది.పోలీసులు వి.సురేందర్‌, కె.నర్సింహారెడ్డి, షేక్‌ లాల్‌ మాధర్‌, మహమ్మద్‌ సిరాజుద్దీన్‌, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు ఎస్‌.అర్వింద్‌ గౌడ్‌, డి.జానకిరాం, ఆర్‌.బాలూ రాఠోడ్‌, డి.శ్రీకాంత్‌పై విచారణ జరపాలని కమిషన్‌ సూచించింది. ఈ పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్‌ విత్‌ 34, 201, రెడ్‌ విత్‌ 302, 34 సెక్షన్ల కింద విచారణ జరపాలని నివేదికలో పేర్కొంది.
హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం
హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో...హైకోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసును సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ప్రభుత్వం, పిటిషనర్లు తమ వాదనలు హైకోర్టు ముందు వినిపించాలని ఆదేశించింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక కాపీని ప్రభుత్వం, పిటిషనర్లు ఇరువురికి ఇస్తారని చెప్పింది. సాప్ట్‌ కాపీ ఇవ్వాలని కమిషన్‌ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో...హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును తాము ప్రత్యేకంగా మానిటర్‌ చేయలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేసు తదుపరి విచారణ, తీసుకునే చర్యలపై హైకోర్టే నిర్ణయిస్తుందని చెప్పింది. ల్గªకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో మాట్లాడి రావాలని తెలంగాణ న్యాయవాదులకు సీజేఐ ధర్మాసనం చెప్పింది.5.70 ఏళ్ల శ్రీలంక చరిత్రలో తొలిసారి రుణ ఎగవేత..!
` పెను ఆహార సంక్షోభం అంచున ఉన్నాం
` ప్రధాని రణిల్‌ విక్రమసింఘే
కొలంబో,మే20(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి రుణాలను ఎగవేసింది. ఆ దేశం చెల్లించాల్సిన 78 మిలియన్‌ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్‌ పిరియడ్‌ కూడా బుధవారం ముగిసిపోవడంతో అధికారికంగా ఎగ్గొట్టినట్లైంది.ఈ విషయాన్ని గురువారం రెండు క్రెడిట్‌ ఏజెన్సీలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం తమ దేశం ముందస్తు దివాలాలో ఉందని శ్రీలంక రిజర్వు బ్యాంక్‌ గవర్నర్‌ నందలాల్‌ వెల్లడిరచారు. ‘’మా వైఖరి స్పష్టంగా ఉంది. వారు రుణాలను పునర్‌వ్యవస్థీకరించేంత వరకూ మేము చెల్లింపులు చేయలేం. దానిని ముందస్తు దివాలా అంటారు. వీటిల్లో సాంకేతిక నిర్వచనాలు ఉన్నాయి. వారి వైపు నుంచి దీనిని రుణ ఎగవేతగా భావిస్తారు’’ అని వెల్లడిరచారు.శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైన బెయిల్‌ఔట్‌పై అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది. గురవారం ఐఎంఎఫ్‌ ప్రతినిధి మాట్లాడుతూ ఈ చర్చలు వచ్చే మంగళవారానికి పూర్తికావొచ్చని వెల్లడిరచారు. శ్రీలంక ప్రభుత్వం ఈ ఏడాది దేశాన్ని నడిపేందుకు 4 బిలియన్‌ డాలర్లు అవసరమని చెబుతోంది.శ్రీలంక 50 బిలియన్‌ డాలర్లు విలువైన రుణాలను చెల్లించేందుకు వీలుగా పునర్‌ వ్యవస్థీకరించాలని విదేశీ రుణదాతలను కోరుతోంది. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు విదేశీ మారకద్రవ్యం కొరత, ద్రవ్యోల్బణంలో పెరుగుదల కారణంగా ఔషధాలు, ఇంధనం కొరత ఏర్పడిరది.
పెను ఆహార సంక్షోభం అంచున శ్రీలంక..!
శ్రీలంక పెను ఆహార సంక్షోభం అంచున ఉందని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వచ్చే వ్యవసాయ సీజన్‌ నాటికి సరిపడా ఎరువులు కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు.’’సరిపడా సమయం లేకపోవడంతో ఈ యాలా(మే`ఆగస్టు) సీజన్‌లో ఎరువులు కొనుగోలు చేయలేము. మహా (సెప్టెంబర్‌`మార్చి) సీజన్‌కు సరిపడా ఎరువుల స్టాక్‌ను సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకొంటున్నాం. తాజా పరిస్థితిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’’ అని విక్రమసింఘే గురువారం రాత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొత్తగా తొమ్మిది మందిని మంత్రులుగా నియమించారు. పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటయ్యే వరకు వీరు కీలక కార్యకలాపాలను నిర్వహించనున్నారు. కొత్త మంత్రివర్గంలో ఫ్రీడమ్‌పార్టీకి చెందిన నిమాల సిరిపాల డిసిల్వా, ఇండిపెండెంట్‌ ఎంపీలు సుశీల్‌ పరమజయంత, విజ్యాదాస రాజపక్సా, తిరన్‌ ఎల్లెస్‌ ఉన్నారు. వీరితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీలంక కేబినెట్‌లో అధ్యక్షుడు, ప్రధానితో కలిపి అత్యధికంగా 25 మంది మంత్రులు ఉండొచ్చు. వీరిలో నిమాల సిరిపాల డిసిల్వా నౌకా, విమానయాన శాఖ, సుశీల్‌ పరమజయంతకు విద్యాశాఖ, ఖేలియా రంబుక్‌వెల్లాకు వైద్యశాఖ, విజ్యాదాస రాజపక్సాకు న్యాయ,జైళ్లు, రాజ్యాంగ సంస్కరణలు శాఖలు అప్పజెప్పినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఈ సారి కీలకమైన ఆర్థిక శాఖను భర్తీ చేయకపోవడం విశేషం.ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఏప్రిల్‌? 9 నుంచి కొలంబోలోని గాలే ఫేస్‌? గ్రీన్‌?లో గొటబాయకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే మహింద రాజపక్సను ప్రధాని పదవి నుంచి తొలగించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. యునైటెడ్‌? నేషనల్‌? పార్టీ నేత రణిల్‌? విక్రమ్‌? సింఘే(73)ను 26వ ప్రధానిగా నియమించారు. అందుకు పార్లమెంట్‌?లోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.6.దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌
` పెట్టుబడుల ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిన రాష్ట్రం
` అందుకు పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణం
` లండన్‌లోని నెహ్రూ సెంటర్‌ నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌
లండన్‌,మే20(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. యూకేలో పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన లండన్‌లోని హై కమిషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. లండన్‌లోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన సమావేశంలో భారత్‌, బ్రిటన్‌కు చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్‌ డయాస్పోరా ముఖ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ హై కమిషనర్‌ సుజిత్‌ జొయ్‌ ఘోష్‌ , నెహ్రూ సెంటర్‌ డైరెక్టర్‌ అమిష్‌ త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్‌ అనేక అంశాల పైన తన అభిప్రాయాలను పంచుకున్నారు.భారతదేశం ప్రపంచంతో పోటీపడి ముందుకు పోవాలంటే అద్భుతమైన, విప్లవాత్మకమైన పాలనా సంస్కరణలు అవసరమని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని చాలాదేశాల జనాభా వృద్ధాప్యం వైపు నడుస్తుంటే, భారతదేశ జనాభాలో ఉన్న అత్యధిక యువ బలం ఆధారంగా అగ్రశ్రేణి దేశంగా మారేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒకవైపు పాలనా సంస్కరణలు, పెట్టుబడి స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న సంక్షోభిత పరిస్థితులను దాటుకొని ఈ రోజు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు ఆకర్షించే ఒక అద్భుతమైన పెట్టుబడుల ఆకర్షణీయ గమ్యస్థానంగా మారడానికి పరిపాలనా సంస్కరణలే ప్రధాన కారణమని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. కేవలం పెట్టుబడులే కాకుండా ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన తీరును వివరించారు. దీంతో సమావేశానికి హాజరైన వారు చప్పట్లతో అభినందించారు.తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కావని, అవి భారతదేశ విజయాలుగా పరిగణించి, ప్రపంచానికి చాటాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా వివిధ దేశాల్లో ఉన్న భారత ఎన్నారైలు దేశ విజయాలను ప్రపంచానికి చాటేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్య, ఉపాధి, దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థికాభివృద్ధిలాంటి అనేక అంశాలపై సమావేశానికి హాజరైన వారి ప్రశ్నలకు సమాధానంగా తన అభిప్రాయాలను కేటీఆర్‌ పంచుకున్నారు.


7.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..
` డీజిల్‌ ట్యాంకర్‌` కలప ట్రక్కు ఢీ
` 9 మంది సజీవ దహనం
చంద్రపూర్‌,మే20(జనంసాక్షి): మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రపూర్‌ వద్ద డీజిల్‌ ట్యాంకర్‌, ఓ కలప ట్రక్కు ఢీకొని మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో దాదాపు 9 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ముంబై: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో చంద్రాపూర్‌`ముల్‌ రోడ్డుపై అజయ్‌పూర్‌ సవిూపంలో డీజిల్‌ ట్యాంకర్‌, మొద్దుల లోడుతో వెళ్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో లారీ డ్రైవర్‌తోపాటు కూలీలు ఉన్నారని చంద్రాపూర్‌ ఎస్డీపీవో సుధీర్‌ నందన్‌వార్‌ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.కాగా, ప్రమాదం జరిగిన గంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారని సమాచారం. కొన్ని గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలను అదుపుచేసినట్లు అధికారులు వెల్లడిరచారు. మృతదేహాలను చంద్రాపూర్‌ జిల్లా దవాఖానకు తరలించామని తెలిపారు.


8.నేటినుంచి కాంగ్రెస్‌ రైతు రచ్చబండ
` నెలరోజులపాటు వరంగల్‌ డిక్లరేషన్‌పై చర్చ
` అక్కంపేట రచ్చబండలో పాల్గొననున్న రేవంత్‌
హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ 21నుంచి రైతు రచ్చబండ నిర్వహిస్తోంది. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ సొంతూరైన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో చేపట్టే రైతు రచ్చబండను టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో రాజీవ్‌ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కంపేటకు బయలుదేరనున్నా రు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కంపేటకు చేరుకొని రైతు రచ్చబండలో రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని టీపీసీసీ మే 21 నుండి నెలరోజుల పాటు రైతు రచ్చబండ నిర్వహిస్తోంది. కాగా రాష్ట్రంలోని 1200కు పైగా గ్రామాల్లో రచ్చబండ చేపట్టేందుకు టీపీసీసీ ప్రణాళిక రచించింది. వరంగల్‌ డిక్లరేషన్‌ను జనంలోకి బలంగా తీసుకెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ డిక్లరేషన్‌కు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. రాహుల్‌ గాంధీ పాల్గొన్న వరంగల్‌ రైతు సంఘర్షణ సభలో తీసుకున్న వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. రాజీవ్‌గాంధీ వర్దంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజులపాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ముఖ్యనాయకుడు 21వ తేదీన ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించాలని నిర్ణయించారు. పీసీసీ అధ్యక్షుడిగా వరంగల్‌ జిల్లాలో జయశంకర్‌ సొంత గ్రామంలో రచ్చబండ సభలో పాల్గొంటానని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 30 రోజులపాటు అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాలు జరుగుతాయని రేవంత్‌ తెలిపారు. జూన్‌ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజక వర్గాల్లో 15 మంది ముఖ్యనాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా
చూడాలని నేతలకు సూచించారు. పెరిగిన ధరలపై కూడా కార్యక్రమాలు చేపడతామని వెల్లడిరచారు.


9.మరో 25 ఏళ్లపాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి
` ప్రధాని మోడీ
న్యూఢల్లీి,మే20(జనంసాక్షి): దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వారి ఉచ్చులో పడొదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.  రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో జరుగుతున్న భాజపా జాతీయ పదాధికారుల సమావేశంలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.8 ఏళ్ల భాజపా పాలన పేదల సంక్షేమానికి, సామాజిక భద్రతకు ఎంతో కృషి చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.  కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విషం చిమ్ముతు న్నాయని మండిపడ్డారు. దీనికై చిన్నచిన్న ఉద్రిక్త ఘటనల కోసం వెతుకుతున్నాయని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుటుంబ పార్టీలపై నిరంతరం పోరాటం చేయాలన్నారు. 2014 తర్వాత దేశ ప్రజలు నైరాశ్యం నుంచి బయటపడ్డారని.. నేడు ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఉన్నారని మోదీ చెప్పారు. వారి ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని పదాధికారులకు సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలపై అంతకుముందు ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని భాజపా మళ్లీ తీసుకువచ్చిందన్నారు. నేడు ప్రపంచమంతా భారత్‌ వైపు ఆసక్తిగా చూస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్యర్ర సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. వాటి కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ నెలతో 8 ఏళ్లు పూర్తిచేసుకుంటుంది. ఈ ఎనిమిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలను అందుకున్నాం. పేదల సంక్షేమం, సామజిక న్యాయం, సుపరిపాలనకు ఎంతో కృషిచేశాం. భాజపా అంటే దేశ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. దేశ ప్రజలంతా ఎంతో విశ్వాసంతో, ఆశగా ఎదురు చూస్తున్నారుని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారులకు అందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వారి ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు. వారిని పట్టించుకోకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని భాజపా పదాధికారులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలను అందుకుంది. యూపీతో సహా నాలుగు రాష్టాల్లో అధికారాన్ని మరోసారి కైవసం చేసుకుంది. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 25 ఏళ్ల పాటు అధికారంలో ఉండేందుకు ప్రణాళికలు రచించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.   ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుటుంబ పార్టీలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందేలా కార్యక్రమాన్ని రూపొందిం చాలని కోరారు.  ఈ క్రమంలోనే దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య భారతంతో రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశిరచాల్సిన ఆవశ్యకత బీజేపీపై ఉందన్నారు. వాటి కోసం నిరంతరం శ్రమించాల్సిన సమయం బీజేపీకి ఇదేనని పేర్కొన్నారు. దీంతో వచ్చే 25 ఏళ్లపాటు తామే అధికారంలో ఉండాలని భావిస్తున్నట్టు మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా, పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.  భాషా వైవిద్ధ్యం భారత దేశానికి గర్వకారణమని, అయితే దీనిపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని మోదీ చెప్పారు. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోందని, అవి పూజించదగినవని పరిగణిస్తుందని చెప్పారు. భారత దేశ మెరుగైన భవిష్యత్తుకు ఇది అనుసంధానమని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషలకు జాతీయ విద్యా విధానం  ప్రాధాన్యమిచ్చిందన్నారు. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు.


11.బీబీ నగర్‌ ఎయిమ్స్‌పై కిషన్‌ రెడ్డి అబద్దాలు
` భూబదలాయింపు చేసినా బుకాయింపులా..!
` మండిపడ్డ మంత్రి హరీష్‌ రావు
యాదాద్రి భువనగిరి,మే20(జనంసాక్షి): కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు భూ బదలాయింపు చేయలేదని కిషన్‌ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఎయిమ్స్‌కు భూ బదలాయింపు జరిగినట్టు తెలంగాణ ప్రభుత్వం కాగితలతో సహా రుజువులు చూపించే సరికి కిషన్‌ రెడ్డి నాలుక కరుచుకున్నాడని హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఉదయం బీబీ నగర్‌ ఎయిమ్స్‌ను సందర్శించిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. బీబీ నగర్‌ ఎయిమ్స్‌లో ఇంత వరకు పూర్తిస్థాయిలో కేంద్రం ప్రొఫెసర్‌లను నియమించలేదన్నారు. 185 మంది ప్రొఫెసర్లు అవసరం ఉండగా 95 మందిని మాత్రమే నియమించారు. నర్సింగ్‌ నియామకాల్లోనూ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. నర్సింగ్‌కు సంబంధించి 812 నర్సింగ్‌ పోస్టులు ఉండగా 200 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఎయిమ్స్‌కు 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంతవరకు కొత్త భవన నిర్మాణం ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు జరగకపోవడం దారుణమన్నారు. ఎయిమ్స్‌ లో జరుగుతున్న లోటుపాట్లను కేంద్ర వైద్య శాఖకు పూర్తిగా వివరిస్తామని మంత్రి తెలిపారు.


12.యువత కొత్త టెక్నాలజీ ఆవిష్కర్తలు కావాలి
రక్షణ అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడకుండా చూస్తున్నాం
డివై పాటిల్‌ విద్యాపీఠ్‌ విద్యార్థుల 13వ స్నాతకోత్సవంలో రాజ్‌నాథ్‌
పూణె,మే20(జనంసాక్షి):బీజేపీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అనిరక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌  అన్నారు. కాంగ్రెస్‌ సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించినా పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. మోడీ వచ్చాక ఒక్కొక్కటి సమస్యలు కొలిక్కి వస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు గౌరవం పెరిగిందన్నారు. బయటి దేశాల నుంచి రక్షణ ఆయుధాల కొనుగోలు తగ్గాయన్నారు. మహారాష్ట్రలోని పూణెలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు రాజ్‌ నాథ్‌ సింగ్‌. అలాగే పూణెళిలోని డాక్టర్‌ డివై పాటిల్‌ విద్యాపీఠ్‌ విద్యార్థుల 13వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.ఆత్మనిర్భర్‌ భారత్‌’ సాధించేందుకు యువత కొత్త టెక్నాలజీలను రూపొందించాలని, ఆవిష్కరించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. భారతదేశం తన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలని భావిస్తున్నామని..  దేశీయ రక్షణ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఏ దేశానికైనా యువతే అతిపెద్ద బలం, ఉత్పేర్రకం మాత్రమే కాదు మార్పునకు మూలం అని ఆయన అభివర్ణించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని దానిని అవకాశంగా మార్చుకునే సత్తా యువతకు ఉంది. వారు కొత్త టెక్నాలజీలను కనుగొని, కొత్త కంపెనీలు / పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయగల సామర్థ్యాన్ని మన యువత కలిగి ఉన్నారని అన్నారు. యువతపై తమ ప్రభుత్వానికి చాలా నమ్మకం ఉందని, అందుకే యువత పురోగతితో పాటు దేశ సమగ్రాభివృద్ధికి భరోసా కల్పించడానికి యువతకు  పుష్కలమైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.