ALL NEWS

 1.అప్ఘనిస్థాన్‌లో పెను భూకంపం
` ఘటనలో 1000 మంది మృతి
` పెరుగుతున్న మృతుల సంఖ్య
` రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదు
` అర్ధరాత్రి సమయంలో ప్రకంపనల వల్ల భారీగా ప్రాణనష్టం
కాబుల్‌,జూన్‌ 22(జనంసాక్షి):అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి కనీసం 1000 మంది మృతిచెందినట్లు అఫ్గాన్‌ అధికారిక విూడియా సంస్థ వెల్లడిరచింది.వందల మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందని అధికారులు తెలిపారు.రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడిరచింది. అఫ్గాన్‌లోని ఖోస్ట్‌ నగరానికి 44 కిలోవిూటర్ల దూరంలో 51 కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో పలుమార్లు ప్రకంపనలు చోటుచేసుకోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.అఫ్గానిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది.‘మృతుల సంఖ్య పెరుగుతోంది. దాంతో వరుసపెట్టి సమాధులు తవ్వుతూనే ఉండాల్సి వస్తోంది’ అని స్థానిక అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం మారుమూల పర్వత ప్రాంతం కావడంతో సమాచార లోపం నెలకొంది. సహాయ కార్యక్రమాలకూ ఆటంకం కలుగుతోంది. దాంతో మరణాలపై పూర్తి స్పష్టత రావడం లేదని అధికారులు చెబుతున్నారు.పాకిస్థాన్‌ సరిహద్దుకు సవిూపంలోని ఖోస్ట్‌, పక్టికా ప్రావిన్స్‌లో ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడిరచింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. అక్కడి విూడియాలో వస్తున్న దృశ్యాలు భూకంప తీవ్రతను కళ్లకుగడుతున్నాయి. ఇళ్లు ధ్వంసమై శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సహాయం కోసం అర్థించే పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, తమకు అంతర్జాతీయ సమాజం సహకారం కావాలని అఫ్గాన్‌ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. తాలిబన్ల ఆక్రమణతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌ ప్రజలను ఈ భూకంపం మరింత దారుణ స్థితిలోకి నెట్టేసింది.


2.అసమ్మతి ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేస్తా
` ఉద్ధవ్‌ థాక్రే..
` తానెప్పుడూ తప్పు చేయలేదని వివరణ
` తనకు కరోనా సోకిందని వెల్లడి
` తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేను సీఎంను చేయండి
` ఉద్ధవ్‌కు పవార్‌ కీలక సూచన!
ముంబై,జూన్‌ 22(జనంసాక్షి): సీఎం పదవికి రాజీనామా చేయడానికీ  సిద్ధమని ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించారు. తన రాజీనామా లేఖ కూడా సిద్ధంగా ఉందని ఆయన వెల్లడిరచారు. సీఎం అధికారిక నివాసాన్ని తాను ఖాళీ చేసి.. సొంత ఇల్లు మాతోశ్రీకి వెళ్లిపోతానని తెలిపారు. అవసరమైతే పార్టీ నాయకత్వం నుంచి కూడా తప్పుకుంటానని రెబెల్‌ వర్గానికి ఆయన సూచించారు. అవసరమైతే పార్టీ నాయకత్వం నుంచి కూడా తప్పుకుంటానని వెల్లడిరచారు. తనతో ఏక్‌ నాథ్‌ షిండే నేరుగా మాట్లాడాలని.. తాను ఎక్కడ తప్పు చేశానో చెప్పాలని ఆయన సూచించారు. రెబల్స్‌లో ఉన్న వారిలో ఒక్కరు సీఎంగా వద్దని చెప్పినా.. తాను పదవి నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. అలాగే తనకు ముందే చెబితే రాజీనామా చేసేవాడినని.. దీని కోసం సూరత్‌కు వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఉద్ధవ్‌ థాక్రే ప్రశ్నించారు. నా ముందుకొచ్చి రాజీనామా చేయమని అడగండి.. ఆనందంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన తర్వాత ఏ శివ సైనికుడు సీఎం అయినా తనకు సంతోషమన్నారు. శివసైనికులారా మోసం చేయవద్దని సూచించారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆయన బుధవారం రాష్ట్ర ప్రజలనుద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. కొవిడ్‌ సోకడంతో ఆయన ఫేస్‌ బుక్‌ ద్వారా మాట్లాడారు. కొవిడ్‌ సోకినా.. తనకు లక్షణాలు లేవని చెప్పారు. తన బాధ్యతను ఎప్పుడూ విస్మరించలేదని..క్యాంప్‌ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు తనతో ఇప్పటికే మాట్లాడారని చెప్పారు. వారిలో కొందరు తిరిగి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో తనకు అనుభవం లేకపోవడంతో ఎన్సీపీ కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశామని.. ఆనాటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. శరద్‌ పవార్‌, సోనియాలతో మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు శివసేనను మోసం చేయడం సరికాదని రెబల్‌ ఎమ్మెల్యేలకు సూచించారు. కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు కనిపించకుండా పోగా.. మరికొంతమంది ఎమ్మెల్యేలు సూరత్‌ లో ప్రత్యక్షమయ్యారని చెప్పారు. హిందుత్వం..శివసేన ఒక్కటేనని, నాటి శివసేనకు.. ఇప్పటి శివసేనకు ఎలాంటి పోలికల్లేవని వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇప్పుడూ అదే భావజాలం ఉందని స్పష్టంచేశారు. ప్రజల మద్దతుతోనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, తాను నిజాయితీగా పని చేసినట్లు వెల్లడిరచారు. రాష్ట్రంలో వచ్చిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొ న్నానని పేర్కొన్న ఆయన.. తాను ప్రజలకు దూరంగా ఉన్నానని వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. శివసేనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై కూడా ఆయన స్పందించారు. శివసేనది ఎప్పుడూ హిందుత్వ నినాదమేనని, శివసేన, హిందుత్వాన్ని ఎవరూ వేరుచేయలేదన్నారు. హిందుత్వం గురించి మాట్లాడుతున్న తొలి సీఎంను తానేనని తెలిపారు. బాల్‌ థాక్రే ఆశయాలను, బాలసాహెబ్‌ ఆలోచనలనే ముందుకు తీసుకెళుతున్నామన్నారు. ఏ వైఫల్యాలు ఉన్నా తనతో చర్చించాలని.. అనంతరం నిర్ణయం తీసుకుం దామని ఆయన రెబల్‌ వర్గానికి సూచించారు. తనకు ఈరోజు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని తెలిపిన సీఎం.. అయితే ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు. చెప్పాల్సింది చాలా ఉదని, ఈ రోజు చాలా ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. 30 ఏళ్లుగా మేము కాంగ్రెస్‌, ఎన్సీపీలను వ్యతిరేకించాం. కానీ శరద్‌పవార్‌.. నన్నే సీఎం బాధ్యతలు స్వీకరించమని కోరారు. ఆ సమయంలో ఓ సవాల్‌గా బాధ్యతల్ని స్వీకరించా. ఎన్సీపీ, కాంగ్రెస్‌ నాకు పూర్తి సహకారం అందించాయి. ఇప్పుడు కాంగ్రెస్‌, ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు.రెబెల్స్‌ పై  మహారాష్ట్ర  సీఎం ఉద్ధవ్‌ థాక్రే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు.
సీఎం నివాసంలో కీలక భేటీ
శివసేనలో అసమ్మతి భగ్గుమనడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.మంత్రి ఏక్‌నాథ్‌ శిందే తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబావుటా ఎగురవేయడంతో శివసేన`ఎన్సీపీ`కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. సుప్రియా సూలే, జితేంద్ర అవద్‌తో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన పవార్‌.. దాదాపు గంట పాటు మంతనాలు జరిపారు. సమావేశం అనంతరం పవార్‌, సుప్రియా సూలేతో కలిసి తన నివాసం నుంచి బయటకు వచ్చిన సీఎం ఉద్ధవ్‌ తన మద్దతుదారులకు అభివాదం చేశారు. అయితే, ఈ కీలక భేటీలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేను ముఖ్యమంత్రి చేయాలని శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ సూచించినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్‌ శిందే వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు నలుగురు స్వతంత్రులతో కలిపి 34మంది ఎమ్మెల్యేలు ఆయన వైపు నిలవగా.. తాజాగా మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చార్టర్డ్‌ విమానంలో గువాహటికి చేరుకున్నట్టు సమాచారం.శివసేన ఎమ్మెల్యేలెవరూ తమతో టచ్‌లో లేరని భాజపా నేత రావు సాహెబ్‌ పాటిల్‌ దన్వే తెలిపారు. ఏక్‌నాథ్‌ శిందేతో తాము మాట్లాడలేదన్నారు. ఇది శివసేన అంతర్గత వ్యవహారమని.. ఇందులో భాజపాకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు.మరోవైపు, ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు భాజపా డబ్బు, దర్యాప్తు సంస్థలను వినియోగించడమే పెద్ద సమస్యగా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. మహారాష్ట్రలో సంక్షోభంపై ఆయన స్పందిస్తూ.. ‘’ఇది శివసేన అంతర్గత సమస్య. ఆ పార్టీ నాయకత్వం దీన్ని సులువుగా పరిష్కరించగలదు. కానీ ఇక్కడ భాజపా తీరుతోనే పెద్ద సమస్య. ఎమ్మెల్యేలను లాక్కొనేందుకు డబ్బును, దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోంది. శివసేన మనుగడ సాగిస్తుందని భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.


(శివసేన మనుగడ కోసం ‘అసహజ’ కూటమి నుంచి తప్పుకోవాలి
` ఆ పార్టీ రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే డిమాండ్‌ )
ముంబై,జూన్‌ 22(జనంసాక్షి): మహారాష్ట్రలో శివసేన మనుగడ కోసం ‘అసహజ’ కూటమి నుంచి తప్పనిసరిగా తప్పుకోవాలని ఆ పార్టీ రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే డిమాండ్‌ చేశారు. బుధవారం సాయంత్రం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉద్వేగ ప్రసంగం అనంతరం షిండే ఈ మేరకు ట్వీట్‌ చేశారు. గత రెండున్నర ఏళ్లలో శివసేన మాత్రమే నష్టపోయిందని, కూటమిలోని ఇతర పార్టీలు (ఎన్సీపీ, కాంగ్రెస్‌) లాభపడ్డాయని విమర్శించారు. ఇతర పార్టీలు బలపడిన చోట శివసేన బలహీనపడిరదన్నారు. ‘పార్టీని, శివ సైనికులను కాపాడటానికి, అసహజ కూటమిని రద్దు చేయడం చాలా ముఖ్యం. మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మహారాష్ట్ర కోసమేనని అని అన్నారు. శివసేన బీజేపీతో పొత్తును పునరుద్ధరించి రాష్ట్రాన్ని పాలించాలని ఏక్‌నాథ్‌ షిండే కోరుతున్నారు.



3.నేనింకా కోలుకోలేదు
` విచారణకు రాలేను
` ఈడీకి లేఖ రాసిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా
దిల్లీ,జూన్‌ 22(జనంసాక్షి):నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరుకావాల్సి ఉంది.అయితే అనారోగ్యం కారణంగా తన హాజరుకు కొన్ని వారాల పాటు మినహాయింపు ఇవ్వాలని ఆమె దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వెల్లడిరచారు.సోనియా గాంధీకి ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా తగ్గినప్పటికీ... కొవిడ్‌ అనంతర సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. వారం పైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె రెండు రోజుల క్రితమే డిశ్ఛార్జి అయ్యారు. ‘’కొవిడ్‌, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చికిత్స తీసుకున్న సోనియాను ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దాంతో ఈడీ ముందు హాజరుకు మరికొంత గడువు ఇవ్వాలని దర్యాప్తు సంస్థకు సోనియా లేఖ రాశారు’’ అని జైరాం రమేశ్‌ వెల్లడిరచారు. మరోపక్క రాహుల్‌ గాంధీ ఐదు రోజులపాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన్ను ఈడీ దాదాపు 50 గంటల పాటు ప్రశ్నించింది.


4.మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం
` అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోండి
` రాహుల్‌ డిమాండ్‌
దిల్లీ,జూన్‌ 22(జనంసాక్షి):అగ్నిపథ్‌ పథకం తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని బలహీన పరుస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.గతంలో సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్టుగానే ‘అగ్నిపథ్‌’ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భాజపా ప్రతీకార రాజకీయాలు, అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహలో రాహుల్‌ మాట్లాడారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ జరుగుతున్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈడీ తనను ప్రశ్నిస్తున్న సమయంలో తాను ఒంటరిగా లేనని.. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త, నేతలూ తన వెంటే ఉన్నారన్నారు. దేశంలో అతి పెద్ద సమస్య ఉద్యోగాలేనన్న రాహుల్‌.. కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా వ్యాపారాలను దెబ్బ తీయడం ద్వారా దేశం వెన్నెముకను విరగ్గొడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ మన దేశాన్ని ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు అప్పగించారని, చివరకు సైన్యంలో ఉద్యోగాలను కూడా మూసివేశారని మండిపడ్డారు.ఎప్పుడూ వన్‌ ర్యాంక్‌ ` వన్‌ పెన్షన్‌ గురించి మాట్లాడే కేంద్రం పెద్దలు ఇప్పుడు ‘నో ర్యాంక్‌ ` నో పెన్షన్‌’ అనే స్థాయికి చేరుకున్నారని ఆక్షేపించారు. చైనా సైన్యం మన భూ భాగంలోకి వచ్చి తిష్ఠ వేస్తే.. సైన్యాన్ని బలోపేతం చేసుకోవాల్సింది పోయి బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. కేంద్రం అవలంబిస్తున్న వైఖరి దేశానికి నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సత్యాగ్రహలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.


5.28నుంచి రైతుబంధు
` రైతుల ఖాతాల్లో నగదు జమకు ఆదేశాలు
` తెలంగాణ రైతులకు సీఎం కెసిఆర్‌ శుభవార్త
 హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి): రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. జూన్‌ 28 నుంచి రైతుల ఖాతాల్లో వానాకాలం పంట పెట్టుబడి జమ చేయాలని సీఎం కేసీఆర్‌.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఎప్పటిలాగే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమచేయనున్నారు.త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్న ఆయన.. కొన్ని రాజకీయ కారణాలతో నిధులు  రాలేదని తెలిపారు. కేంద్రం కావాలనే ఇబ్బంది పెడుతుందని, తామే నిధులు సమకూర్చుకొని రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. రైతులను పత్తి పంట ఎక్కువగా వేయాలని కోరుతున్నామని నిరంజన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారాల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే ఈ కాల్‌ సెంటర్‌ కు ఫిర్యాదు చేయవచ్చు. రైతులు సలహాలు, సూచనలు కూడా ఇవ్వొ?చ్చని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.


6.రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్‌
` రక్షణ కారిడార్‌ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం
` నిమ్జ్‌ భూముల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
` కేంద్రం రక్షణరంగ సంస్థల ఏర్పాటుకు సహకరించాలి
` 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏవిూచేయని కాంగ్రెస్‌
` వెమ్‌ టెక్నాలజీకి శంకుస్థాపనచేసిన కెటిఆర్‌
` పర్యావరణహితంగా పరిశ్రమలు ఉండాలని హితవు
సంగారెడ్డి,జూన్‌ 22(జనంసాక్షి): రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్‌ లాంటిదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. నిమ్జ్‌ భూముల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలివ్వాలని ఆయన కోరారు. భూమి కోల్పోయిన రైతులు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు. సెవిూ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని  మంత్రి కేటీఆర్‌ కోరారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో తొలి పరిశ్రమ ’వెమ్‌’ టెక్నాలజీ ప్రాజెక్టుకు ఐటీ మంత్రి కేటీఆర్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ప్రిన్సిపల్‌  సెక్రటరీ జయేష్‌ రంజన్‌, వెమ్‌ టెక్నాలజీ సీఎండీ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ 1988లో వెమ్‌ టెక్‌ ప్రారంభించిన తరువాత రక్షణ రంగంలో అగ్రగామిగా మారిందన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ద్వారా మన దేశంలోనే రక్షణ రంగ పరికరాలు తయారీ.. దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తాయన్నారు. విూరు కోరిన విధంగా భూములిచ్చాం.. స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించండని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న వెమ్‌ టెక్నాలజీ వారి నుద్దేశించి మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. సెవిూ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ ఉద్యోగాలు స్థానిక జహీరాబాద్‌  వారికి ఇవ్వాలి... జవాబుదారీగా ఉంటూ.. పర్యావరణ హితంగా నిర్వహించాలని అన్నారు. 12600 ఎకరాలు భూమి నిమ్జ్‌ కు కేటాహిస్తే ఇప్పటికి 3500 ఎకరాలే సేకరించామన్నారు. భూమి కోల్పోయిన రైతులకు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని సూచించారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ శిక్షణకు 50 శాతం సహకారం అందిస్తామని సీఎండీ వెంకట్‌ రాజు చెప్పడం అభినందనీయమన్నారు. రక్షణరంగ సంస్థలకు తెలంగాణ హబ్‌ లా ఉంది.. అయితే కేంద్రం ఈ విషయాలు పట్టించుకోకుండా బుందేల్‌ ఖండ్‌కు రక్షణ పరిశ్రమల తరలించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలోపు అంటే 2024లోగా వెమ్‌ టెక్నాలజీని  ప్రారంభం చేయాలని కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇదే సందర్భంలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్టాల్రను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌`బెంగళూరు మధ్య డిఫెన్స్‌ కారిడార్‌ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢఫిెన్స్‌ కారిడార్‌ను బుందేల్‌ఖండ్‌కు తరలించారని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని డిమాండ్‌ చేశారు. వెమ్‌ టెక్నాలజీస్‌ రాష్టాన్రికి రావడం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్టాన్రికి పరిశ్రమలు రావాలి.. ఉపాధి అవకాశాలు పెరగాలని చెప్పారు. సీఎస్‌ఆర్‌లో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలు పర్యావరణ హితంగా ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత భూముల ధరలు బాగా పెరిగాయని చెప్పారు. భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు నిమ్జ్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హావిూ ఇచ్చారు. ఇదిలావుంటే సంగారెడ్డి జిల్లాలో నిమ్జ్‌ భూ బాధితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 35 మంది ఎల్గోయి, మామిడిగి వాసులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో రాయికోడ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. జహీరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా... రాయికోడ్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద భూ బాధితుల వీడియోలు చిత్రీకరించకుండా విూడియాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై విూడియా ప్రతినిధులు మండిపడుతున్నారు. మరోవైపు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను రైతులు అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతులు గ్రామాల నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. నిమ్జ్‌ భూసేకరణకు వ్యతిరేకంగా పలుగ్రామాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.  జహీరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్‌ పర్యటన సందర్భంగా నిరసనలకు దిగిన మామిడిగి, ఎల్గోయి గ్రామాల భూ బాధితులపై పోలీసులు లాఠీచార్జ్‌ జరిపారు. పోలీసుల లాఠీఛార్జ్‌తో మహిళా రైతు స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చివరకు ఎల్గోయి, మామిడిగి గ్రామాలలో భూ బాధితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కెటీఆర్‌ను రైతులు అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. రైతులు గ్రామాల నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. నిమ్జ్‌ భూసేకరణకు వ్యతిరేకంగా పలుగ్రామాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏవిూచేయని కాంగ్రెస్‌
జహీరాబాద్‌ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారని మంత్రి కేటీఆర్‌  పేర్కొన్నారు. జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ పనిచేసిన గీతారెడ్డికి మంత్రి పదవి వచ్చింది కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేవిూ లేదన్నారు. రాహుల్‌ గాంధీ మొన్న తెలంగాణకు వచ్చి కాంగ్రెస్స్‌ పార్టీకి ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నాడన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదన్నారు. ఇప్పుడు అవకాశం ఇస్తే ఏం చేస్తారని కేటీఆర్‌ ప్రశ్నించారు. 65 ఏళ్ళ నుంచి పలు పార్టీలు చేసిన గబ్బును, దరిద్రాన్ని ఇప్పుడిప్పుడే వదల గొడుతున్నామన్నారు. సాగు నీరు, తాగు నీరు, వైద్యం ఇలాంటి పనులు చేసుకుంటూ మనం పోతుంటే.. కొంతమంది కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు.


7.వారెవ్వా..
బండిసంజయ్‌ యవ్వారం హంతకులే సంతాప సభ పెట్టినట్లుంది
` రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మండిపాటు
` ధాన్యం డబ్బుల కోసం బండి లేఖ రాయడంపై ఆగ్రహం
` రైతు సమస్యలపైకాల్‌ సెంటర్‌ ప్రారంభం
హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):ముఖ్యమంత్రికి బండి సంజయ్‌ లేఖ రాయడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ తీరు...‘హంతకుడే సంతాపం తెలిపినట్లుందని‘ మండిపడ్డారు.హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌ లోని రైతుబంధు సమితి అధ్యక్షుడి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖకాల్‌ సెంటర్‌ బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, వ్యవసాయ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రికి సంజయ్‌ లేఖ రాయడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ తీరు... ‘హంతకుడే సంతాపం తెలిపినట్లుందని‘ మండిపడ్డారు. గత యాసంగి సీజన్‌లో వరి పంట సాగు చేస్తే వచ్చిన ధాన్యం కేంద్రం చేత కొనిపిస్తానని రైతులను రెచ్చగొట్టి పారిపోయి... ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొన్నాక తీరిగ్గా డబ్బులివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నారని ఆరోపించారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత, రైతు సమస్యల గురించి నోరెత్తే అర్హత బండి సంజయ్‌కు ఉందా? అని ప్రశ్నించారు. సుతిల్‌ తాళ్లు, దబ్బనాలు, గోనె సంచులకు కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని... ధాన్యం కొనుగోలు చేస్తుందని బీరాలు పలికిన సంజయ్‌... సీఎంకు ఎందుకు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగితం కూడా ఉండదా? అని ఎద్దేవా చేశారు.పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్‌నోట్లు విడుదల చేయడంతో పాటు మరుసటి రోజు పత్రికలు చదివితే వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో... వ్యవసాయ శాఖ ఎక్కడ ఉంది? అది రాష్ట్రంలో ఏం చేస్తుంది...? అన్న విషయం కూడా తెలుస్తుందని హితవు పలికారు. ప్రెస్‌నోట్లు, ప్రెస్‌విూట్లు మినహా భాజపా రాష్ట్రంలో ఏం చేస్తుంది? ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా రాష్టాన్రికి తీసుకొచ్చారా? కనీసం ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ది కోసమైనా ఒక్క రూపాయి తెచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇవ్వకపోగా... మిగతా రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే పరిమితికి లోబడి రుణాలు తీసుకునే అవకాశాలను అడ్డుకుంటూ రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. రైతులు... ‘బండి సంజయ్‌ డిమాండ్లు చూసి నవ్వుకుంటున్నారు... రాజకీయాల్లో హస్య నటుడిలా తయారయ్యారు‘ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.ప్రభుత్వం రైతుల నుంచి యాసంగిలో 9772.54 కోట్ల రూపాయల విలువైన 49.92 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేసిందని... మొత్తం 9772.54 కోట్ల రూపాయలకు గాను ఇప్పటికే 7464.18 కోట్ల రూపాయలు చెల్లించడం పూర్‌ఖ్తెందని స్పష్టం చేశారు. మిగిలిన డబ్బుల చెల్లింపు పక్రియ కొనసాగుతుందని, అది త్వరలోనే పూర్తవుతుందని ప్రకటించారు. బండి సంజయ్‌ లాంటి వారి నుంచి సూచనలు చెప్పించుకునే దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదని అన్నారు.  త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దన్న ఆయన.. కొన్ని రాజకీయ కారణాలతో నిధులు  రాలేదని తెలిపారు. కేంద్రం కావాలనే ఇబ్బంది పెడుతుందని, తామే నిధులు సమకూర్చుకొని రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. రైతులను పత్తిపంట ఎక్కువగా వేయాలని కోరుతున్నామని నిరంజన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారాల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే ఈ కాల్‌ సెంటర్‌ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రైతులు సలహాలు, సూచనలు కూడా ఇవ్వొచ్చని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.


6 ద్రౌపది ముర్ముకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత
` రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికచేయడంతో కేంద్రం నిర్ణయం
న్యూఢల్లీి,జూన్‌ 22(జనంసాక్షి): అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము (64)కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్‌పీఎఫ్‌ కమాండోల ’జెడ్‌ ప్లస్‌’ భద్రతను ఆమెకు కల్పించినట్లు కేంద్రం బుధవారం వెల్లడిరచింది. జెడ్‌ ప్లస్‌ రక్షణ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత స్థాయి సెక్యురిటీ. ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూన్‌ 24న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. కాగా, కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా ఎంపికైన సంగతి తెలిసిందే.ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం పట్ల బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ద్రౌపది ముర్ము ఎంపిక గురించి ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం తనకు తెలిపారని వెల్లడిరచారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అధికారికంగా బుధవారం ప్రకటించారు. ఇదిలావుంటే ద్రౌపది ముర్ము ఎంపికను బిజూ జనతాదళ్‌(బీజేడీ), జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీలు స్వాగతించాయి. ’ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై నాతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించినప్పుడు నేను చాలా సంతోషించాను. ఒడిశా ప్రజలకు ఇది నిజంగా గర్వకారణం’ అని బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ట్వీట్‌ చేశారు. మారాష్టాన్రికి గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల జార్ఖండ్‌ అధికార పార్టీ జేఎంఎం సంతోషం వ్యక్తం చేసింది. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నామని జేఎంఎం అధికార ప్రతినిధి మనోజ్‌ పాండే తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన ఆకాంక్షించారు.


7.ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ అందిస్తుంది
` ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’లో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌
హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ ను అందిస్తుందన్నారు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, తన తాజా సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ కి వచ్చిన సల్మాన్‌ ఖాన్‌, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గారితో కలిసి రామోజీ ఫిల్మ్‌ సిటీలో  మొక్కలు నాటి ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ 5.0’’ లో పాల్గొన్నారు. అనంతరం సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని.. ఆ పనికి జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గారు ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’  ద్వారా బాటలు వేసారని.. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్‌ తరాలను కాపాడుకోవచ్చని తెలిపారు. నా అభిమానులంతా విధిగా ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.అనంతరం రాజ్యసభ సభ్యులు, ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’  ఆద్యులు జోగినిపల్లి సంతోష్‌  కుమార్‌ గారు మాట్లాడుతూ.. పెద్ద మనసుతో ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్‌ ఖాన్‌ గారికి కృతజ్ఞతలు. విూరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు ‘‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’’ కో ఫౌండర్‌ రాఘవ, కరుణాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



8.తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
హైదరాబాద్‌,జూన్‌ 22(జనంసాక్షి):తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 27,754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి.కరోనా బారి నుంచి ఈరోజు 129 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,680 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 292 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించడంతో కొన్ని పాఠశాలల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారు. హైదరాబాద్‌ గన్‌పౌండ్రీలోని మహబుబియా పాఠశాలలో విద్యార్థులు మాస్క్‌లు ధరించి తరగతులకు హాజరయ్యారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.దేశంలో ఇవాళ కొత్తగా 12,200లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 13 మరణాలు సంభవించాయి. తాజాగా మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ వంటి మరికొందరు ప్రముఖులు కొవిడ్‌ బారిన పడటంతో మరోసారి కలవరం మొదలైంది.


9.సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల
దిల్లీ,జూన్‌ 22(జనంసాక్షి):అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ 2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.సివిల్స్‌ మెయిన్స్‌కు మొత్తం 13,090 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ వెల్లడిరచింది. సెప్టెంబర్‌ 16 నుంచి 21 వరకు సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది మెయిన్స్‌కు ఎంపికైనట్టు సివిల్స్‌ శిక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 5న దేశ వ్యాప్తంగా సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను యూపీఎస్సీ నిర్వహించింది. తెలంగాణ నుంచి 26వేల మంది, ఏపీ నుంచి సుమారు 24వేల మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు.



13.వెలుగులోకి దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం
` డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై సీబీఐ కేసు నమోదు
న్యూఢల్లీి,జూన్‌ 22(జనంసాక్షి): దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం వెలుగు చూసింది. రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడగా.. దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఆఊఈఒ), కంపెనీ మాజీ సీఎండీ కపిల్‌ వాధావన్‌, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధావన్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఇదే సీబీఐ దర్యాప్తు చేస్తున్న అతిపెద్ద కేసని అధికారులు తెలిపారు. గతేడాది డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కుంభకోణంపై ఈ నెల 20న కేసు నమోదు చేయగా.. సీబీఐకి చెందిన 50 మందికిపైగా అధికారుల బృందం బుధవారం ముంబైలోని 12 ప్రాంగణాల్లో ఎఫ్‌ఐఆర్‌ లిస్టెడ్‌ నిందితులకు చెందిన 12 చోట్ల సోదాలు నిర్వహించింది.ఇందులో అమరిల్లిస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ శెట్టి, ఎనిమిది మంది ఇతర బిల్డర్లు ఉన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో కూడిన 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ.34,615 కోట్ల మేర మోసం చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగాలు వారిపై ఉన్నాయి. ఆయా బ్యాంకుల కన్సార్టియం నుంచి 2010 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు రూ.42,871 కోట్ల రుణాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.లెక్కలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖాతా పుస్తకాల్లో తప్పుగా చూపించి.. వాస్తవాలను దాచిపెట్టి కపిల్‌, ధీరజ్‌ వాధావన్‌ ఇతరులతో కుట్రపూరితంగా తిరిగి చెల్లించలేమంటూ చేతులు ఎత్తేశారని సీబీఐ పేర్కొంది. 2019 మే నెల నుంచి రుణాలను తిరిగి చెల్లించడాన్ని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిలిపివేసిందని, ఫలితంగా బ్యాంకులు ఆయా లోన్లను మొండి బకాయిలుగా ప్రకటించాయని పేర్కొంది. ఆ కంపెనీ డైరెక్టర్లు కపిల్‌ వాధ్వాన్‌, ధీరజ్‌ వాధ్వాన్‌ కుట్రపూరిత చర్యలతో బ్యాంకులకు దాదాపు రూ.34,615 కోట్లు నష్టం జరిగిందని వివరించింది. వీరిద్దరూ గతంలో మోసం చేసిన కేసుల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.డీహెచ్‌ఎల్‌ఎఫ్‌ రుణ ఖాతాలను రుణదాత బ్యాంకులు వేర్వేరు సమయాల్లో నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయని అధికారులు తెలిపారు. నిధుల కుంభకోణంలో కపిల్‌ వాధ్వాన్‌, ధీరజ్‌ వాధ్వాన్‌లతో పాటు స్కైలార్క్‌ బిల్డ్‌ కాన్‌ కంపెనీ, దర్శన్‌ డెవలపర్స్‌, సిగ్తియా కన్‌ స్ట్రక్షన్స్‌ బిల్డర్స్‌, టౌన్‌ షిప్‌ డెవలపర్స్‌, శిషిర్‌ రియల్టీ, సన్‌ బ్లింక్‌ రియల్‌ ఎస్టేట్‌, సుధాకర్‌ శెట్టి తదితరులను నిందితులుగా చేర్చింది. వీరందరిపై ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌లోని పలు సెక్షన్లతో పాటు చీటింగ్‌ అభియోగాలతో కేసులు నమోదు చేశారు.