ALL NEWS

 1.ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌
` రాజ్యసభ సెక్రటరీ వద్ద నామినేషన్‌ పత్రాలు దాఖలు
` బిజెపి,ఎన్డీఎ నేతలు వెంటరాగా అట్టహాసంగా నామినేషన్‌
` మోడీ తదితరులు ప్రతిపాదన.. బలపర్చిన రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు
` నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న యోగి తదితర సిఎంలు
` నామినేషన్‌కు ముందు పార్లమెంట్‌ వద్ద గాంధీ, అంబేడ్కర్‌లరు ముర్మునివాళి
న్యూఢల్లీి,జూన్‌ 24(జనంసాక్షి): ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్‌ వేశారు. రాజ్యసభ సెక్రటేరియట్‌లో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. బిజెపి అతిరథ మహారథులు వెంటరాగా ఆమె అట్టహాసంగా నామినేషన్‌ దాకలు చేశారు. ఈ నామినేషన్‌ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా,యూపి సిఎం యోగి ఆదిత్యానాథ్‌ సహా బీజేపీ పాలిత సీఎంలు హాజరయ్యారు. ఇక బీజేడికి చెందిన ఇద్దరు మంత్రులు ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతుగా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. మరోవైపు ఏపీ సీఎం, వైసీపీ చీఫ్‌ జగన్‌ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించారు. నామినేషన్‌ పత్రాలపై వైసీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి సంతకాలు చేశారు. తొలిసారిగా ఓ గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం రావడం మంచి పరిణామమని జగన్‌ అన్నారు. అంతకుముందు పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాల దగ్గర పూలు వేసి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. నామినేషన్‌ కార్యక్రమం వివిధ తర్వాత రాష్టాల్ల్రో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. జులై 1 నుంచి రాష్టాల్ర టూర్‌కు వెళ్లనున్నారు. రోజుకు రెండు రాష్టాల్ల్రో పర్యటించేలా షెడ్యూల్‌ రెడీ చేస్తున్నారు బీజేపీ ముఖ్య నేతలు. జూలై 18 న రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. మొదటగా ప్రధాని ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత నామినేషన్‌ పత్రాలను 50 మంది ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరిచారు. నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము.. పార్లమెంట్‌ ఆవరణలో స్వాతంత్య సమరయోధుల విగ్రహాలకు నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ, డా.బీ.ఆర్‌. అంబేడ్కర్‌, బిర్సా ముండా విగ్రహాల వద్ద ముర్ము.. అంజలి ఘటించారు. నామపత్రాల దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే దిల్లీకి చేరుకున్న ముర్ము.. ఒడిశా భవన్‌లో బస చేశారు. భువనేశ్వర్‌ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది. దిల్లీకి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో ముర్ము భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె ఎంపికను సమాజంలోని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నా యని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామమైన బైదపోసిలో సంతాల్‌ గిరిజన తెగలో 1958 జూన్‌ 20న ద్రౌపదీ ముర్ము జన్మించారు. 2015 మార్చి 6 నుంచి 2021 జూలై 12 వరకు రaార్ఖండ్‌ గవర్నర్‌గా ఆమె పనిచేశారు. రaార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌గా ఆమె నియమితులయ్యారు. పైగా దేశ చరిత్రలో ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి ఓ రాష్టాన్రికి గవర్నర్‌గా నియమితులైన నేత ఆమె కావడం విశేషం. ఒడిశాలోని రాయరంగాపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భాజపా, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య, రవాణాశాఖ, మత్స్యసంపద, పశుసంవర్ధక శాఖ మంత్రిగా సేవలందించారు. ముర్ము రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. అధికార ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారైన ద్రౌపదీ ముర్ముకు కేంద్రం ఇప్పటికే జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. అదే నెల 21న ఫలితం వెలువడనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జులై 24న ముగియ నుంది.

 

 

 

2.నాలుగేళ్లకే ఇంటికి పొమ్మంటే ఎలా!
` సైన్యంలో ఆత్మస్థయిర్యం దెబ్బతినదా!
` అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి
` ఆర్మీ నియామకాలు వెంటనే చేపట్టాలి
` చంచల్‌గూడ్‌ జైలులో అరెస్టయిన వారితో రేవంత్‌ ములాఖత్‌
` వారికి న్యాయపరమైన సాయం అందిస్తామని హావిూ
` 27 రాష్ట్రవ్యాప్త ఆందోళనలో పాల్గొంటామని వెల్లడి
హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి):అగ్నిపథ్‌ పథకంతో సైన్యంలో నాలుగేళ్ల కాలానికే నియామకాలు చేయాలన్న మోడీ నిర్ణయం దేశభద్రతకే ముప్పు అని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. చంచల్‌ గూడ జైల్లో సికింద్రాబాద్‌ నిందితులను ఆయన పరామర్శించారు. జైల్లో నిరసనకారులతో ములాకత్‌ అయిన రేవంత్‌.. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్‌ రెడ్డితో పాటు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, అనిల్‌ యాదవ్‌, మల్‌ రెడ్డి రంగారెడ్డి నిందితులను కలిశారు. సికింద్రాబాద్‌ ఘటన, కేసులకు సంబంధించి న్యాయ సలహాలు ఇస్తామని నిందితులకు హావిూ ఇచ్చారు రేవంత్‌. న్యాయ సలహా కోసం ఇప్పటికే గాంధీభవన్‌ లో టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ఇక చంచల్‌ గూడ జైలు బయట నిందితుల కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఎదురు చూస్తున్నారని చెప్పారు. అగ్నిపథ్‌ పై ప్రధాని హడావిడి నిర్ణయం తీసుకున్నారని.. ఏకపక్ష నిర్ణయంతో యువకుల్లో అయోమయం నెలకొందని విమర్శించారు. కేవలం 4ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్మెంట్‌ అంటే ఎట్లా అన్న ఆయన..అగ్నిపథ్‌ 6 నెలల ట్రైనింగ్‌లో ఏం నేర్పిస్తారని ప్రశ్నించారు. రిటైర్మెంట్‌ తర్వాత ఎలాంటి భద్రత లేకుండా కుట్ర చేశారని ఆరోపించారు. మూడేళ్ల నుండి ఆర్మీలో నియామకాలు చేపట్టలేదని.. దీంతో సైనికుల కొరత ఏర్పడిరదన్నారు. 2020లో ఫిజికల్‌ ఎగ్జామ్స్‌ పాసైన వారికి రాత పరీక్షలు నిర్వహించాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. 22 ఏళ్లకే ఇంటికి పంపిస్తే ఆ జవాన్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అయితే జైల్లో ఉన్న యువకులతో మాట్లాడ్డానికి కేవలం ఇద్దరికే అనుమతి ఇవ్వడంతో రేవంత్‌, మల్లురవి యువకులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా మని హావిూ ఇచ్చారు. యువకులవి న్యాయమైన డిమాండ్లేనని.. వారి పోరాటానికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలుస్తుందని రేవంత్‌ భరోసానిచ్చారు. వారికి న్యాయపరంగా అండగా ఉంటామని అన్నారు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులను గత ప్రభుత్వాలు కీలకంగా భావించాయని రేవంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు. దేశభక్తి కలిగిన వేల మంది యువకులను సైన్యంలోకి తీసుకున్నారని గుర్తుచేశారు. యువత గురించి కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. సమాజంలో ఏ వర్గంతోనూ చర్చించకుండా కీలకమైన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.’సైనికులకు ప్రత్యేకమైన గౌరవం దక్కేలా ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. కేవలం నాలుగేళ్ల కోసం యువకులను సైన్యంలోకి తీసుకోవటం సరికాదన్నారు. నాలుగేళ్లు పనిచేయించుకుని ఇంటికి పంపిస్తే తర్వాత వారి సంగతేంటి? మోదీ సర్కారు జవాన్లలో గందరగోళం సృష్టించింది. 22 ఏళ్లకే ఇంటికి పంపిస్తే ఆ జవాన్‌ పరిస్థితి ఏంటని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల17న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఈ కేసులో పోలీసులు.. ఇప్పటి వరకు 2 విడతల్లో 55 మంది యువకులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వారిలో ఇప్పటి వరకు 46 మందికి ములాఖత్‌ ఇచ్చారు. ఇంకా మరో 9 మందికి మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులకు ఈ 9 మందిలోనే ములాఖత్‌ కల్పించారు. సికింద్రాబాద్‌ ఘటనకు సంబంధించిన కేసులో బాధితుల పక్షాన పోరాడాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారుల తరఫున న్యాయపోరాటం చేయడానికి రెడీ అయింది. కేసులో ఉన్నవారంతా విద్యార్థులు అయినందున వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అవసరమైన వారికి న్యాయ సాయం అందించటం కోసం గాంధీభవన్‌లో 9919931993 టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ఇకపోతే అగ్నిపథ్‌కు నిరసనగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్షలు చేయనుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేయనున్నారు నేతలు. కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్‌ కుటుంబాన్ని రేవంత్రెడ్డి పరామర్శించి నర్సంపేట నియోజకవర్గంలో జరిగే ఆందోళనలో పాల్గొననున్నారు.

 

3.ఇది నిజమా..!
` ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలట!
` మోదీ ఆలోచనట!
` కర్ణాటక మంత్రి సంచలన వెల్లడి
బెంగళూరు,జూన్‌ 24(జనంసాక్షి): దేశంలో ప్రత్యేక రాష్ట్రాల అంశం మరోసారి తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ ఓ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ముఖ్యంగా కర్ణాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుందన్న ఆయన.. ఈ విషయంపై ప్రధానమంత్రి ఆలోచిస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించిన కొన్ని రోజులకే అధికారపార్టీ సీనియర్‌ నేత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యింది.’2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇదే విషయంపై ఆయన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు నాకు తెలిసింది. అందులో భాగంగా కర్ణాటక కూడా రెండు కాబోతోంది. ఈ క్రమంలో కొత్తగా ఉత్తర కర్ణాటక ఏర్పడేందుకు మనం పోరాడాలి’ అంటూ మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్‌ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో రెండు, ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు.. కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయంటూ చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది మంచి అంశమేనన్న ఆయన.. ఉత్తర కర్ణాటక కూడా రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం విడిపోయినా ఎటువంటి హాని లేదని.. తామంతా కన్నడిగులుగానే ఉంటామని వ్యాఖ్యానించారు. 50 రాష్ట్రాల ప్రతిపాదన మంచిదేనని.. కర్ణాటకలో 60ఏళ్ల క్రితం రెండుకోట్ల జనాభా ఉంటే ఇప్పుడు ఆరున్నర కోట్లకు చేరిందని ఉమేష్‌ కత్తి పేర్కొన్నారు.
స్పందించిన సీఎం..
కర్ణాటకను విడగొట్టేందుకు ప్రధానమంత్రి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయనే విషయం రాష్ట్రమంత్రి ద్వారా బయటపడిరదని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం అంటూ ట్వీట్‌చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఓ మంత్రే ఈ విషయాన్ని వెల్లడిరచడంపై ముఖ్యమంత్రి, పీఎంఓ కార్యాలయం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఇలా మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చేసే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మాట్లాడడం ఆ మంత్రికి కొత్త కాదని.. ఎన్నో ఏళ్లుగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఆయన ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పుకోవాలంటూ కర్ణాటక సీఎం బదులిచ్చారు. ఇక ఇదే అంశంపై కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోకా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం అంటూ ఉమేష్‌ ఇప్పటివరకు వందసార్లు మాట్లాడారని.. ఈసారి కొత్తేం కాదన్నారు. కర్ణాటక మొత్తం ఒక్కటేనన్న ఆయన.. ఉమ్మడి కర్ణాటక కోసం ఎంతోమంది కన్నడిగులు పోరాటం చేశారని అన్నారు. ఈ విషయంపై ఉమేష్‌తో ముఖ్యమంత్రి మాట్లాడుతారని వివరించారు.

 

4.త్వరలో సిరిసిల్లకు మెడికల్‌ కాలేజీ
` శంకుస్థాపన చేయనున్న సిఎం కెసిఆర్‌
` తెలంగాణ ఏర్పడ్డ తరవాతే కష్టాలు తొలిగాయి
` అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి
` రైతుబంధు ద్వారా 40 లక్షల మంది రైతులకు లబ్ధి
` సిరిసిల్ల పర్యటనలో మంత్రి కెటిఆర్‌ వెల్లడి
సిరిసిల్ల,జూన్‌ 24(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 8 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కెటిఆర్‌ వెల్లడిరచారు. ఆసరా పెన్షన్‌, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీ.. ఇలా ప్రతి సంక్షేమ పథం పేదవాడికి అందచేస్తున్నట్లు తెలిపారు. ’40 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వారా రూ. 5 లక్షలు అందిస్తున్నామని అన్నారు. దేశంలో రైతులకు న్యాయం జరుగుతోంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమేనని
అన్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ లో కరెంట్‌ కోసం నానా తిప్పలు పడ్డాం...ఆనాడు కరెంట్‌ ఉంటే వార్త...కానీ నేడు కరెంట్‌ పోతే వార్త’ అంటూ మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. తాను 2009 ఎన్నికల్లో గెలిచి మంత్రి అవుతానని అనుకోలేదని తెలంగాణ కేటీఆర్‌ అన్నారు. తాను ఇలా ఉన్నానని అంటే సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదమేనని, తనకు శక్తి ఉన్నంతకాలం ప్రతి కులానికి అండగా ఉంటానని హావిూనిచ్చారు.శుక్రవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. విద్య విషయంలో సిరిసిల్లలోని జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల త్వరలోనే ప్రారంభం కాబోతోందని, సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా మెడికల్‌ కాలేజికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సర్దాపూర్‌లో పాల్‌ టెక్నిక్‌ కళాశాల ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ.. అగ్రహారంలో ఇంజనీరింగ్‌ కాలేజీ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ లలో డిగ్రీ కాలేజిలను ఏర్పాటు చేస్తామని హావిూనిచ్చారు. అలాగే అన్ని కుల సంఘాల భవనాలకు భూమి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టుల ద్వారా సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు 6 విూటర్ల విూదకి వచ్చాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో హావిూ ఇచ్చిన రెడ్డి కార్పొరేషన్‌, వైశ్య కార్పొరేషన్‌ లను సాధ్యమైనంత తొందరగా ఏర్పాటు చేస్తామని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తాను తీసుకెళుతానన్నారు. రాష్ట్రంలో ఉన్న రెడ్డీలు పేరుకే అగ్రవర్ణాలు.. వీరిలో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రెడ్డి సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో సాధ్యమైనంత త్వరలోనే చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవ సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రతి కులంలో పేదవారు ఉన్నారు.. అలానే రెడ్డిల్లో కూడా పేదలు ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో కులమతాలు ఏవైనప్పటికీ.. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. 75 ఏండ్ల స్వాతంత్య భారతదేశంలో జరగని అభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధ్యమైందన్నారు. కేసీఆర్‌ రైతుబిడ్డ కాబట్టే రైతుల సంక్షేమం కోసం పాటుపడు తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. సిరిసిల్లలో మెడికల్‌ కాలేజీ నిర్మించుకోబోతున్నామని తెలిపారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో తనకు మంత్రి పదవి వచ్చింది. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రతి కుల సంక్షేమానికి కృషి చేస్తానని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

 

 

5.42లక్షల మందిని టీకా రక్షించింది
` ది లాన్సెట్‌ నివేదిక వెల్లడి
దిల్లీ,జూన్‌ 24(జనంసాక్షి):యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.అంతేకాకుండా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వాస్తవ ఫలితాల్లోనూ తేలడం ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో ఒక్క ఏడాదిలోనే (2021 వరకు) 42 లక్షల మరణాలను వ్యాక్సిన్లు నివారించినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. వ్యాక్సిన్‌ పంపిణీతో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగిన మరణాలకు సంబంధించిన ఈ అధ్యయనం ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.వ్యాక్సిన్ల పంపిణీ మొదలుపెట్టిన తొలి సంవత్సరంలో కొవిడ్‌ మరణాల నివారణ ఏవిధంగా ఉందనే విషయంపై బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ నిపుణులు అధ్యయనం చేపట్టారు. డిసెంబర్‌ 8, 2020 నుంచి డిసెంబర్‌ 8, 2021 మధ్యకాలంలో నివారించగలిగిన కొవిడ్‌ మరణాలను తాజా అధ్యయనం ద్వారా అంచనా వేశారు. ‘వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వల్ల 2021లో భారత్‌లో 42,10,000 కొవిడ్‌ మరణాలను నివారించగలిగారు. ఇది మొత్తంగా అంచనా వేసినవి మాత్రమే. కచ్చితంగా చూస్తే 36,65,000 నుంచి 43,70,000 మధ్యలో ఉండవచ్చు’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఒలివెర్‌ వాట్సన్‌ పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌తో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న భారత్‌లో విస్తృతంగా వ్యాక్సినేషన్‌ పంపిణీ ఎంతో ప్రభావాన్ని చూపించిందన్నారు.అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 5,24,941 మరణాలు చోటుచేసుకోగా వాస్తవానికి ఈ సంఖ్య 10రెట్లు అధికంగా ఉండవచ్చని నివేదికలు చెబుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో 47లక్షల కొవిడ్‌ మరణాలు సంభవించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) కూడా ఇటీవల నివేదించింది. అయితే, దేశంలో కొవిడ్‌ మహమ్మారి సమయంలో 51,60,000 (48,24,000`56,29,000) మరణాలు సంభవించి ఉండవచ్చనే అంచనాల ఆధారంగా వీటిని రూపొందించామని లండన్‌ పరిశోధకులు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది..
కొవిడ్‌ మరణాల వాస్తవ ఫలితాలను పరిగణనలోనికి తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 3.14కోట్ల కొవిడ్‌ మరణాలు సంభవిస్తాయనుకుంటే.. అందులో దాదాపు 2కోట్ల (1.98కోట్ల) మరణాలను వ్యాక్సిన్‌లు నివారించగలిగినట్లు తాజా నివేదిక అంచనా వేసింది. 2021 చివరినాటికి ప్రతి దేశంలో కనీసం 40శాతం జనాభాకు వ్యాక్సిన్‌ అందించడం వల్ల మరో 5,99,300 మంది ప్రాణాలను కాపాడుకునే వాళ్లమని పేర్కొంది. దాదాపు 185 దేశాల్లో అధికారిక లెక్కల కంటే వాస్తవ మరణాల సంఖ్యతో ఈ అంచనాలు వేసినట్లు తెలిపింది. అయితే, ఈ విశ్లేషణలో చైనాను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని.. ఒకవేళ తీసుకుంటే తాజా గణాంకాల్లో చాలా మార్పు ఉంటుందని పేర్కొంది. మొత్తంగా ఇప్పటివరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం చూసినా.. వ్యాక్సిన్‌లు పంపిణీ చేయకుంటే దాదాపు 1.81కోట్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని తాజా అధ్యయనం వెల్లడిరచింది.ఇదిలా ఉంటే, తాజా అధ్యయనానికి పలు పరిమితులు ఉన్నట్లు అధ్యయనకర్తలు వెల్లడిరచారు. ముఖ్యంగా ఏ రకమైన వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.. ఎలా పంపిణీ చేశారు.. ప్రతి దేశంలో కొత్త వేరియంట్‌లు వెలుగు చూసిన కచ్చితమైన సమయం.. వంటి అంశాల ఆధారంగా తాజా అంచనాలను రూపొందించినట్లు వెల్లడిరచారు. అంతేకాకుండా వైరస్‌ సోకిన వ్యక్తుల వయసు, కొవిడ్‌ మరణాల నిష్పత్తి మధ్య ఉన్న సంబంధం ప్రతి దేశంలో ఒకేలా ఉంటుందని భావించామని చెప్పారు.

 

6.ఈ యేడాదినుంచి పూర్తిస్థాయి సిలబస్‌
` తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం
హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి): తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి సిలబస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వల్ల గత రెండేండ్లుగా 30 శాతం సిలబస్‌ను ఇంటర్‌ బోర్డు తొలగించిన విషయం విదితమే. ఫైనల్‌ ఎగ్జామ్స్‌ను కూడా 70 శాతం సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్వహించారు. అయితే ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ వారికి వంద శాతం సిలబస్‌ను అమలు చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ ప్రకటించారు. ఇంటర్మీడియట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో త్వరలోనే సిలబస్‌ను అప్‌లోడ్‌ చేస్తామని జలీల్‌ స్పష్టం చేశారు. విద్యార్థులు, ఆయా కాలేజీల సిబ్బంది ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

 

7.అమెరికాలో గన్‌ కంట్రోల్‌ బిల్లు
` ఆమోదించిన సెనేట్‌
వాషింగ్టన్‌,జూన్‌ 24(జనంసాక్షి): తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో అమెరికా సేనేట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం దక్కింది. గన్‌ కంట్రోల్‌ బిల్లును ఎగుమ సభ పెద్దలు ఆమోదించారు. గడిచిన 30 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇది చాలా కీలకమైన బిల్లు అని నిపుణులు భావిస్తున్నారు. డెమోక్రాట్లకు తోడుగా 15 మంది రిపబ్లికన్లు జతకట్టడంతో? ఆ బిల్లుకు అనుకూలంగా 65 ఓట్లు పోలవ్వగా.. 33 మంది వ్యతిరేకించారు. ఇటీవల అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. న్యూయార్క్‌లోని సూపర్‌మార్కెట్‌లో, టెక్సాస్‌లోని ప్రైమరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 31 మంది మరణించారు. ఈ నేపథ్యంలో గన్‌ సంస్కృతికి వ్యతిరేకంగా అమెరికాలో భారీ స్పందన వచ్చింది. దానిలో భాగంగానే గన్‌ కంట్రోల్‌ బిల్లును సేనేట్‌లో చర్చించారు. సేనేట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెడుతారు. ఆ తర్వాత అధ్యక్షుడు బైడెన్‌ సంతకంతో అది చట్టంగా మారుతుంది.

 

8.కోనసీమ ఇక అంబేడ్కర్‌ జిల్లానే..
` పేరు మార్పునకు ఎపి కేబినేట్‌ ఆమోదం
అమరావతి,జూన్‌ 24(జనంసాక్షి): కోనసీమ జిల్లాను ’అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ ఎపి కేబినేట్‌ తీర్మానించింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదలతో పాటు అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్‌`1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే నెలలో అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు విద్యాకానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం నిధులు విడుదల చేసేందుకు కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీలో కేబినెట్‌ అజెండాలోని దాదాపు 42 కీలక విషయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 43 లక్షల 96వేల 402 మంది తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నిధులు జమచేస్తారు. మరో 4 సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం లభించింది. రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం దక్కింది. జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు ఆమోదించింది. వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 3,530 ఉద్యోగాలు మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల లో భర్తీ కి ఆమోదం తెలిపింది. 15 వేల కోట్ల పెట్టుబడి పెట్టే ఆదాని గ్రీన్‌ ఎనర్జి ప్రాజెక్ట్‌ కు ఆమోదం ఇచ్చింది. దేవాలయాల కౌలు భూములు పరిరక్షణ చర్యలపై కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వంశధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు రూ.216 కోట్లు మంజూరుకు ఆమోదం ఇచ్చింది. అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్‌`1 డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జగనన్న ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. సంక్షేమ కేలండర్‌కు మంత్రి మండలి ఆమోదం లభించింది. ఆక్వాసాగు సబ్సిడీ 10 ఎకరాలు ఉన్నవారికి సైతం వర్తింపు ఇస్తారు. పాత జిల్లాల జడ్పీ ఛైర్మన్ల కొనసాగింపునకు ఆమోదం ఇచ్చారు. సత్యసాయి జిల్లాలో 2వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు కూడా కేబినేట్‌ ఆమోదముద్ర వేసింది.

 

9.మళ్లీ కబలిస్తున్న కరోనా
` భారీగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులు
` ఒక్కరోజులోనే 30 శాతం పెరుగుదల నమోదు
` కొత్త 17,336 కేసులు నమోదు
న్యూఢల్లీి,జూన్‌ 24(జనంసాక్షి): కొత్తవేవ్‌ సంకేతాలకు ఊతమిచ్చేలా.. భారత్‌లో కరోనా కేసులు పెరిగి పోతున్నాయి. మాస్క్‌ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం తదితర కారణాలతో కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 30 శాతం కేసులు పెరిగిపోగా.. నాలుగు నెలల తర్వాత దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొద్దిరోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత వారం నుంచి రోజూ 10 వేలకుపైనే కొత్త కేసులు వస్తు న్నాయి. గురువారం 13,313 కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం శుక్రవారం 17,336 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అంటే.. గత ఇరవై నాలుగు గంటల్లో ఇది 30 శాతం అంటే 4,294 కేసుల మేర పెరిగింది. గత ఇరవై నాలుగు గంటల్లో.. కరోనాతో 13 మంది చనిపోయారు. అలాగే పాజిటివిటీ రేటు కూడా దాదాపు 4 శాతంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 88,284కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 5,218 కేసులు వచ్చాయి. కేరళలో 3,890, ఢల్లీి 1,934 కేసులు, తమిళనాడు 1,063 కేసులు, హర్యానా(872) కేసులు వచ్చాయి. ఢల్లీిలో అంతకు ముందు రోజు 926 కేసులు రాగా, తాజాగా 1,934 కేసులతో రెట్టింపు కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవియా గురువారం ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించి.. వైరస్‌ మ్యూటేషన్‌ గురించి ఆరా తీశారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని పలు రాష్టాల్రకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కరోనాతో ఇప్పటిదాకా దేశంలో 5,24,954 మరణాలు నమోదు అయ్యాయి. 4,27,49,056 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 1,96,77,33,217 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది.
(తెలంగాణలోనూ కరోనా ఉద్ధృతి...
` ఒక్కరోజే 493 కేసులు
హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి): తెలంగాణలో కరోనా మహమ్మారి గత కొన్ని రోజులుగా విజృంభిస్తోంది. ఇవాళ 29,084 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...కొత్తగా 493 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి శుక్రవారం 219 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,332 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ కొత్తగా 336 కేసులు నమోదయ్యాయి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(ఃజీశ్రీజీ సతీతిబష్ట్రనిజీ) కరోనా బారినపడ్డారు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో హోం ఐసోలేషన్‌కు వెళ్లారు.)

 

10.డబుల్‌ ఇంజిన్‌ అంటేనే వైషమ్యాలు
` అభివృద్ధి భాజపాకు తెలియదు
` అభివృద్దిలో తెలంగాణతో పోటీ పడాలి
` బిజెపి , మోడీ తీరుపై మండిపడ్డ మంత్రులు
` రాష్ట్ర రెడ్కో చైర్మన్‌గా సతీష్‌ రెడ్డి బాధ్యతలు
హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి): డబుల్‌ ఇంజన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమేందుకు మోడీ సర్కార్‌ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ జగదీష్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, తదితరులు ఆరోపించారు. దమ్ముంటే తెలంగాణ మోడల్‌ అభివృద్ధి దేశంలో ఎక్కడైనా ఉందా చూపాలని బిజెపి, ప్రధాన మంత్రి మోడీకిసవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే, బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని వారు విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్‌ గా నియమితులైన వై.సతీష్‌ రెడ్డి శుక్రవారం ఉదయం ఖైరతాబాద్‌ లోని విశ్వేశ్వరయ్య భవన్‌ లోని రెడ్కో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు మాట్లాడుతూ, వాట్సాప్‌ యూనివర్సిటీల కేంద్రంగా బిజెపి అసత్య ప్రచారాలకు దిగుతోందని పేర్కొన్నారు. అటువంటి అసత్యాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి విూద ఉందని చెప్పారు. గుజరాత్‌ నమూనాను చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి అదే గుజరాత్‌ ను ఇప్పుడు చీకట్లోకి నెట్టేసిందన్నారు. వ్యవసాయానికి ఆరు గంటలు కూడ కరెంట్‌ ఇవ్వకపోగా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్‌ హాలిడే ప్రకటించిన అంశాన్ని మంత్రులు గుర్తుచేశారు. యావత్‌ భారతదేశంలో చీకట్లు అలుముకున్న రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా లో వెలుగులు నింపిందన్నారు.అటువంటి నాయకుడి నేతృత్వంలో జరిగిన తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. శత్రు దుర్బేద్యమైన కోటగా టిఆర్‌ఎస్‌ రూపుదిద్దుకుందని వారు తెలిపారు. నిర్మాణాత్మక మైనపార్టీగా ప్రజల నుండి అనూహ్య మైన ఆదరణ టిఆర్‌ఎస్‌కు లభిస్తుందన్నారు. సభ్యత్వ నమోదు కోసం ప్రజలు బారులు తీరడమే ఇందుకు అద్దం పడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శనమే ఇందుకు కారణంగా నిలుస్తుందన్నారు. టీఆరెస్‌ లా పని చేస్తున్న పార్టీలు దేశంలో లేవు. ఉద్యమ నేత పర్భుత్వ అధినేత కావడం మన అదృష్టం. కరెంటు, సాగు, తాగు నీరు, అనేక పథకాలు సీఎం చేపట్టారని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను, రోడ్లు, మురుగునీటి కాలువలు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ సందర్భంగా సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ, నాకు నా జీవితంలో ఇంత పెద్ద రోజు లేదు. నాకు దైవ సమానులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ లు ఇచ్చిన ఈ అవకాశం ఇది. వారి నమ్మకాన్ని వమ్ము చేయను. కార్యకర్త లాగే పని చేస్తాను. ఉద్యమం, సోషల్‌ విూడియా కారణంగానే సీఎం నన్ను గుర్తించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ సోషల్‌ విూడియా యువకులు, పార్టీ నేతలు, అభిమానులు, సతీశ్‌ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

11.ఏ జాతీయ పార్టీ మేం టచ్‌లోలేం..
` నా వెనుక 40 మంది ఎమ్మెల్యేల బలముంది
` రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే వెల్లడి
` దమ్ముంటే అసెంబ్లీ బలనిరూపణకు రావాలి
` మహావికాస్‌ అఘాడి పూర్తి కాలం కొనసాగుతుందన్న రౌత్‌
` నేనెప్పుడు సీఎం అవుతానని అనుకోలేదు:ఉద్ధవ్‌ ఠాక్రే
ముంబయి,జూన్‌ 24(జనంసాక్షి): మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. శివసేన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఉద్ధవ్‌ఠాక్రే నుంచి చేజారి ఏక్‌నాథ్‌ శిందే శిబిరంలోకి చేరుతున్న వేళ అక్కడి పొలిటికల్‌ డ్రామా ఉత్కంఠ రేపుతోంది.తమ గ్రూపునకు ఓ జాతీయ పార్టీ ఎలాంటి సహాయమైనా చేస్తానని హావిూ ఇచ్చిందంటూ నిన్న వ్యాఖ్యానించిన రెబల్‌ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్‌ శిందే ఈరోజు యూ టర్న్‌ తీసుకున్నారు. ఏ జాతీయ పార్టీ తమకు కాంటాక్టులో లేదన్నారు. శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. నిన్నటి వ్యాఖ్యలతో రెబల్‌ ఎమ్మెల్యేలకు భాజపా మద్దతిస్తోందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో ‘ఓ మహాశక్తి మా వెనుక ఉంది అని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం శివసేన దివంగత నేత బాలా సాహెబ్‌ ఠాక్రే, ఆనంద్‌ డిఘేలా గురించే..’’ అని శిందే సమాధానమిచ్చారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు శుభం కార్డు పడుతుందని ప్రశ్నించగా.. కొంత సమయం తర్వాత అన్నీ తేలిపోతాయన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనేలా డిప్యూటీ స్పీకర్‌ వద్దకు వెళ్లాలని శివసేన ప్రయత్నిస్తున్న తరుణంలో ఏక్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘’మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలకు గానూ 40మంది గువాహటిలో నాతోనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ, సంఖ్యా బలమే లెక్క. అందువల్ల మాపై చర్యలు తీసుకొనే హక్కు ఎవరికీలేదు’’ అన్నారు.
దమ్ముంటే రెబల్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బలనిరూపణకు రావాలి:ఎంపీ సంజయ్‌ రౌత్‌
మహా రాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు గంటకో ట్విస్టులతో ఆసక్తికరంగా మారాయి. మహారాష్ట్రలో రెబల్‌ ఎమ్మెల్యేలకు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యేలంతా తిరిగి ముంబాయి వచ్చి అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధం కావాలని సవాల్‌ చేశారు. రెబల్‌ ఎమ్మెల్యేలు, ఏక్‌ నాథ్‌ షిండే వర్గానికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే తామే గెలుస్తామని జోస్యం చెప్పారు. మహా వికాస్‌అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం మిగతా రెండున్నరేళ్లు కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జరుగుతున్న సంఘటనలకు తాము పశ్చాతాపడడం లేదని స్పష్టం చేశారు. ఈ యుద్ధం రోడ్లపై జరిగితే అందులో కూడా తాము విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు చాలాసార్లు అవకాశం ఇచ్చామన్ని పేర్కొన్న సంజయ్‌ రౌత్‌.. ఇప్పుడు ఆలస్యం అయ్యిందని చెప్పారు. ఒక విధంగా వారు రాంగ్‌ స్టెప్‌ తీసుకున్నా రన్నారు. సీఎం ఉద్ధవ్‌ థాక్రే, శరద్‌ పవార్‌లతో తాము నిరంతరం టచ్‌లో ఉంటున్నట్లు, ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన నేతలంతా ఒక్కటిగా ఉన్నామన్నారు. మరోవైపు... శివసేన తిరుగుబాటు నేత ఏక్‌ నాథ్‌ షిండే శిబిరంలో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. షిండేను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని రక్షించేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కేంద్రమంత్రి షరద్‌ పవార్‌ ను బెదిరించారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పోరాడతాం.. మేమే గెలుస్తాం..: ప్రియాంకా చతుర్వేది
మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయం సంక్షోభంపై శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది స్పందించారు. తామంతా శివసైనికులమని.. పోరాడి విజయం సాధిస్తామని వ్యాఖ్యానించారు. రెబల్‌ ఎమ్మెల్యేలు చేస్తున్నది చట్టబద్ధమైనది కాదని.. రాజకీయంగానూ తగిన పనికాదన్నారు. శివసేనలో ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి కాదన్నారు. గతంలోనూ ఇలాంటివి జరిగినా ఫలించలేదని తెలిపారు. ఈసారి కూడా వారి ప్రయత్నాలు ఫలించవని విశ్వాసం వ్యక్తంచేశారు.
సీఎం అవుతానని నేనెప్పుడు అనుకోలేదు:ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది.అసమ్మతి నేత ఏక్‌నాథ్‌ శిందేవర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య 50కి పెరిగిందన్న వార్తల మధ్య క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రయత్నాలు ప్రారంభించారు. దానిలో భాగంగా ఈ రోజు జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యారు. వారు పార్టీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అసమ్మతి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే వెళ్లిపోయిన వారి గురించి తానెందుకు బాధపడతానన్నారు. శివసేన(బష్ట్రతిల బవనిజీ), ఠాక్రే పేర్లు వాడకుండా వారెలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. అలాగే తానెప్పుడూ ముఖ్యమంత్రి పదవి గురించి కలగనలేదన్నారు.’శివసేనను విడిచిపెట్టడం కంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు పారిపోయారు. వారు పార్టీని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి గురించి నేనెందుకు బాధపడతా. శివసేన, ఠాక్రే పేరు వాడకుండా వారు ఎంతదూరం వెళ్లగలరు. శిందే తన కుమారుడిని ఎంపీని చేస్తారు. కానీ, నా బిడ్డతో ఆయనకు ఎందుకు సమస్య. నా తల, మెడ, పాదాల వరకు మొత్తం నొప్పిగా ఉంది. కొంతమంది నేనిక కోలుకోలేనుకుంటున్నారు. కానీ నేను నా గురించి ఆలోచించుకోవడం లేదు’ అంటూ ఠాక్రే ఉద్వేగంగా మాట్లాడారు.
మనసు విప్పి మాట్లాడుతున్నా..
’మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టింది. దానిని ఎలాగో తట్టుకొని ముందుకు వెళ్తుంటే.. నాకు మెడనొప్పి ప్రారంభమైంది. ఈ రోజు నేను నా మనసు విప్పి మాట్లాడుతున్నాను. నేను వర్ష(అధికారిక నివాసం) వదిలి వచ్చాను. అంటే నేను పోరాటాన్ని వదిలేసినట్లు కాదు. పదవుల పట్ల వ్యామోహం కలిగిన వ్యక్తిని కాదు. నేను ముఖ్యమంత్రిని అవుతానని ఏనాడు ఊహించలేదు’ అని అన్నారు.
మా అమ్మ ఎంతగానో బాధపడిరది: ఆదిత్య ఠాక్రే
’మిత్రపక్షాలు వెన్నుపోటు పొడిచినా ఇంత బాధగా ఉండేది కాదని మా అమ్మ వాపోయింది. మన వల్ల ఎదిగిన మనవాళ్లు మనకు వెన్నుపోటు పొడిచారు. దానికి ఎంతగానో బాధగా ఉంది. నాన్న అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకొని వారు లాభం పొందారు’ అంటూ అసమ్మతి నేతలపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.
అస్సాంలోని గువాహటి హోటల్‌ నుంచే ఏక్‌నాథ్‌ శిందే తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఆయన వద్ద దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రులతో కలిసి ఆ సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. అంతేగాకుండా 400 మంది మాజీ కార్పొరేటర్లతో కూడా శిందే వర్గం భేటీ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఠాక్రే కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఉద్ధవ్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మున్ముందు ఎంపీలు, కార్పొరేటర్లు కూడా అసమ్మతి వర్గంతో వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ ఏడాది చివర్లో జరగనున్న బీఎంసీ ఎన్నికలపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

12.ఎట్టకేలకు ఆవుల సుబ్బారావు అరెస్ట్‌
` విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్‌ అకాడవిూకి నోటీసులు
హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి): అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్‌ అకాడవిూ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం సుబ్బారావును గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత ఆయనను బోయిగూడ రైల్వే కోర్టులో హాజరు పరచనున్నారు. మేడిపల్లిలోని సాయి డిఫెన్స్‌ అకాడవిూకి కూడా రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైల్వే యాక్ట్‌ 1989 కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడిరచారు. విచారణకు హాజరు కావాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. సాయి డిఫెన్స్‌ అకాడవిూ రికార్డులతో పాటు అన్ని పత్రాలను ఆర్పీఎఫ్‌ కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించారు. ఆర్మీ ఉద్యోగార్థులను సాయి డిఫెన్స్‌ అకాడవిూ నిర్వాహకులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. సికింద్రాబాద్‌ విధ్వంసం కేసు విషయంలో రైల్వే పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు.తాజాగా సాయి డిఫెన్స్‌ అకాడవిూకి రైల్వే పోలీసుల నోటీసులు జారీ చేశారు.రైల్వే యాక్ట్‌ 1989 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆర్పీఎఫ్‌ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.సాయి డిఫెన్స్‌ అకాడవిూకి చెందిన రికార్డులు,ఆధారాల పత్రాలతో కార్యాలయానికి హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.

 

13.వాయుసేన అగ్నిపథ్‌ రిజిస్ట్రేషన్లు మొదలు..!
న్యూఢల్లీి,జూన్‌ 24(జనంసాక్షి): వాయుసేనలో అగ్నిపథ్‌ కింద నియామకాల కోసం రిజిస్ట్రేషన్లు నేటి నుంచి మొదలయ్యాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుంది. అగ్నిపథ్‌కు అవసరమైన నిబంధనలు అభ్యర్థులు పాటించాలి. అభ్యర్థులు దరఖాస్తు, జతచేసిన స్కాన్‌ కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని అధికారులు సూచించారు. అగ్నివీర్‌ తొలి బ్యాచును 2022 డిసెంబర్‌ 11 నాటికి ప్రకటించనున్నారు.సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. కానీ, దీనిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే ఆర్మీలో అగ్నివీరుల నియామకాల కోసం భారత సైన్యం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జులై నుంచి దీని రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే, నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచిన సంగతి తెలిసిందే.

 

14.అగ్నివీరులకు లేని పెన్షన్‌ నాకెందుకు..?:
` కేంద్రాన్ని ప్రశ్నించిన వరుణ్‌ గాంధీ
దిల్లీ,జూన్‌ 24(జనంసాక్షి):సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంపై విమర్శలు కొనసాగుతున్నాయి. సొంత ప్రభుత్వాన్ని భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ మరోసారి తనదైన శైలిలో ప్రశ్నించారు.ఈ పథకంలో అగ్నివీరుల పెన్షన్‌కు సంబంధించి ఎలాంటి నిబంధన లేకపోవడమేంటన్నారు.’అగ్నివీరులు స్వల్పకాలం దేశానికి సేవ చేస్తారు. వారికి పెన్షన్‌ పొందే హక్కు లేదు. ప్రజా ప్రతినిధులకు మాత్రం ఈ సదుపాయం ఎందుకు కల్పిస్తున్నారు..? దేశాన్ని రక్షించే వారు పెన్షన్‌ పొందడానికి అర్హులు కాకపోతే.. నేను కూడా దానిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. విూరు ఏమంటారు?’ అంటూ వరుణ్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా అగ్నివీర్‌ నిబంధనలను వ్యతి