1.కేంద్రం తెలంగాణకేమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయండి
` రాష్ట్ర మిచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తే రాజీనామా చేస్తా
` కేంద్రానికి మంత్రి కేటీఆర్ సవాల్
` మోడీపై తెలంగాణ గడ్డ నుంచే తిరుగుబాటు
` దేశంలో నడుస్తోంది మోడీ రాజ్యాంగమే
` రాష్టాల్ర హక్కులను హరిస్తున్న ప్రధాని
` ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతున్నారు.
` ఢల్లీిలో విూడియాసమావేశంలో మంత్రి ఘాటు విమర్శలు
న్యూఢల్లీి,జూన్ 27(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు వస్తుందేమోనని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలు తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయన్నారు. దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు.. మోదీ రాజ్యాంగం అమలవుతుందని నిప్పులు చెరిగారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ విూడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తారనే సంపూర్ణ విశ్వాసంతో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపామని కేటీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ తరపున సంపూర్ణగా మద్దతు ప్రకటించామని అన్నారు. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ రావాలని ఆహ్వానించాం. హైదరాబాద్‌లో తమ ఎంపీలు, శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు మద్దతు తెలుపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరిస్తోందని, నిరంకుశ విధానాలతో, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ.. గత 8 ఏండ్ల నుంచి ఆయా రాష్టాల్రకు అన్యాయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 8 రాష్టాల్ల్రో వారికి మెజార్టీ లేకపోయినా ఆయా ప్రభుత్వాలను తలకిందులు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ªూజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో ఉంచుకొని విపక్షాల విూద వేటకుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారని ప్రధాని మోదీపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాన్ని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న అన్ని పార్టీలకు ఉంటుందన్నారు. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పారు. బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వైఖరికి వ్యతిరేకంగా, అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాకు మద్దతివ్వాలని ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. యశ్వంత్ సిన్హా గెలువాలని, రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా మాకు ఇబ్బంది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆవిడ మంచి వ్యక్తే కావొచ్చు. గిరిజన, మహిళా అభ్యర్థిని చెప్పడం సరికాదు. జనవరి 2, 2006లో ఒడిశాలో కళింగనగర్‌లో స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను కాల్చి చంపారు. అప్పటి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. ద్రౌపది నాడు మంత్రి కూడా. నాడు ఆమె ఎలాంటి సానుభూతి తెలుపలేదు. గిరిజనులకు అన్యాయం జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను పెంచాలని కోరుతున్నాం. ఒక వేళ నిజంగానే గిరిజనులపై ప్రేమ ఉంటే ఇప్పటి వరకు చేసి ఉండాలి. కానీ ఉలుకు పలుకు లేదు. ట్రైబల్ యూనివర్సిటీ పెడుతామని పునర్విభజన చట్టంలో చెప్పారు. ఈ రోజు వరకు అతీగతీ లేదు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. బీజేపీ వ్యవహారం దేశంలోని గిరిజనులకు, తెలంగాణలోని గిరిజనులకు బాగా తెలుసు. చిత్తశుద్ధి ఉంటే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్లను పెంచాలి. ఏడు మండలాలను తిరిగి వెనక్కి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీకి గిరిజనుల విూద ప్రేమ లేదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి పేరుతో బీజేపీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. తాము ప్రతిపక్షాల కూటమిలో ఉన్నామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల అభ్యర్థికి తాము మద్దతిచ్చామన్నారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని చాలా సార్లు కేంద్రాన్ని కోరామని చెప్పారు. గిరిజన రిజర్వేషన్ల విూద తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలన్నారు. గిరిజన వర్శిటీ ఇప్పటి వరకు లేదన్నారు. బీజేపీకి కేసీఆర్ బొమ్మ తప్ప వేరే దిక్కులేదన్నారు. మోడీ ఫోటోకు చెప్పులేసి గాడిద విూద ఊరేగించగలం కానీ అలా చేయబోమన్నారు. మోడీ మూడు సార్లు సీఎం అయినా గుజరాత్‌లో ఇంతవరకు కరెంట్ లేదన్నారు. ద్రౌపది ముర్ము సొంత గ్రామానికే ఇప్పుడు కరెంట్ ఇస్తున్నారన్నారు. అందరికి విద్యుత్ సౌకర్యం ఇచ్చామన్న మోడీ మాటలు అబద్ధమన్నారు. రాజ్యాంగాన్ని కాలరాసి మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే జుమ్లా..లేకుంటే హమ్లా మోడీ ఫార్ములా అని అన్నారు. తెలంగాణ నుంచే ధిక్కార స్వరం వినిపించి దేశాన్ని చైతన్యం చేయొచ్చాన్నారు. మోడీ 8 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ఏం లేదన్నారు. బీజేపీ కంటే గట్టిగా సమాధానం చెప్పే సత్తా టీఆర్‌ఎస్ కు ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన దాని కంటే కేంద్ర ఒక్క పైసా ఎక్కువ ఇచ్చినా రాజీనామా చేస్తానన్నారు. రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యాక దళితుల బతుకులు ఏమైనా మారిపోయాయా అని ప్రశ్నించారు. విషం చిమ్ముడు తప్ప బీజేపీ నాయకుల దగ్గర విషయం లేదన్నారు. విూడియా సమావేశంలో ఎంపిలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి,రంజిత్ రెడ్డి, బిబి పాటిల్,రాములు తదితరులు పాల్గొన్నారు.
2.నేడు టీ`హబ్ ప్రారంభం
హైదరాబాద్,జూన్ 27(జనంసాక్షి):దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్`2 ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. దీన్ని నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాయిదుర్గం నాలెడ్జ్ సిటీ ఎస్‌ఈజెడ్‌లో నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సంలో దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. టీ హబ్ ప్రారంభించాక ఇన్నోవేషన్ సదస్సును నిర్వహించనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.కాగా విద్యుద్ధీప కాంతుల్లో ‘టీ హబ్’ జిగేల్ మంటోంది. రాత్రిపూట రంగురంగు లైట్ల వెలుగుల్లో మెరిసిపోతున్నది. ఈ టీ హబ్ 2 భవన సముదాయాల నైట్ వ్యూ ఫొటోలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్‌విూడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను చాలామంది రీట్వీట్ చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
3.విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ నామినేషన్
` రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందచేత
` హాజరైన రాహుల్, కెటిఆర్, పవార్,సీతారమ్ ఏచూరి తదితరులు
న్యూఢల్లీి,జూన్ 27(జనంసాక్షి): విపక్షపార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు. ఆయన వెంట కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు వెంటరాగా ఆయనతన నామినేష్ వేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. నామినేషన్‌కు ముందు.. సిన్హాను బలపరుస్తున్న పార్టీల నేతలంతా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక.. ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్దాంతాల మధ్య జరిగే పోరు అని పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు. ఓవైపు ఆర్‌ఎస్‌ఎస్‌పై ద్వేషం, మరోవైపు అన్ని విపక్షాల కరుణ అనే రెండు సిద్దాంతాల మధ్యే అసలైన పోరాటం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యశ్వంత్ సిన్హాను ఉత్తమ అభ్యర్థిగా తాము భావిస్తున్నామని, అందుకే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ తెలిపారు. అత్యున్నత విలువలతో ఉన్న కూటమి తమదని ఆయన చెప్పారు. తాము ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు గౌరవిస్తా మని, కానీ ఎన్నికల్లో మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తామని సీపీఏం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన యశ్వంత్ సిన్హాకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, తెరాస, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, ఆర్?ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు సిన్హాకు అండగా నిలిచాయి. యశ్వంత్ సిన్హా బిహార్ పట్నాలో 1937 నవంబర్ 6న జన్మించారు. 1958లో యూనివర్సిటీ ఆఫ్ పట్నాలో పొలిటికల్ సైన్స్?లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే 1962 వరకు ప్రొఫెసర్?గా పనిచేశారు. 1960లోనే సిన్హా ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు సేవలందించారు. పలు కీలక పదవులు చేపట్టారు. అనంతరం 1984లో జనత పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 1986లో పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. 1988లోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ ఏర్పాటయ్యాక ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్?లో 1990 నవంబర్ 1 నుంచి 1991 జూన్ వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.భాజపా ఏర్పాటయ్యాక 1996లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా యశ్వంత్ సిన్హా నియమితు లయ్యారు. 1998, 1999, 2009లో హజారీబాగ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1998`2022 మధ్య కాలలో అటల్‌బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఆర్థిక మంత్రిగా సేవలందించారు. 2002`2004 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.అభ్యర్థిగా భాజపాలో ఉంటూనే సొంతపార్టీపై గళమెత్తిన అతికొద్దిమంది నేతల్లో యశ్వంత్ సిన్హా ఒకరు. పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో 2018లో పార్టీ ఉపాధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.ఆ తర్వాత బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2021 మార్చి 13న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో యశ్వంత్ సిన్హా చేరారు. మార్చి 15న పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పుడు రాష్ట్రపతి రేసులో ఉంటున్నందున పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాకు అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలందించిన అనుభవం ఉంది. అందుకే ఆయనే రాష్ట్రపతి అభ్యర్థికి సరైన వ్యక్తి అని భావించి విపక్షాలు ఏకాభిప్రాయంతో ఆయన పేరును ఖరారు చేశాయి.
4.కొనసాగుతున్న ‘మహా’సంక్షోభం
` సుప్రీంలో షిండే వర్గానికి ఊరట
` వేటు వేయకుండా ఆదేశాలు
` జూలై11కు విచారణ వాయిదా
న్యూఢల్లీి,జూన్ 27(జనంసాక్షి):శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. శిందే వర్గంలోని ఎమ్మెల్యేలపై జులై 11 వరకు అనర్హత వేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోద్దని డిప్యూటీ స్పీకర్‌కు అత్యున్నత ధర్మాసనం సూచించింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు నోటీస్ పంపడాన్ని సవాల్ చేస్తూ ఏక్‌నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై స్పందన తెలపాలని శివసేన నాయకులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, కార్యదర్శి, కేంద్రానికి నోటీసులు పంపింది. అలాగే స్పీకర్ నోటీసులకు సమాధానం చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలకు సూచించింది. జులై 11 సాయంత్రం ఐదున్నర వరకు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెబల్ ఎమ్మెల్యేల వర్గంలోని మొత్తం 39 మందితో పాటు వారి కుటుంబసభ్యులు, ఇళ్లు, ఆస్తులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే డిప్యూటీ స్పీకర్ పంపిన నోటీసులకు జులై 11 సాయంత్రం ఐదున్నరలోగా సమాధానం చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలకు సూచించింది. తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేసింది. విశ్వాస పరీక్షపై.. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి విశ్వాస పరీక్షలకు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. అయితే చట్టవిరుద్ధంగా ఏం జరిగినా న్యాయస్థానాన్ని వెంటనే ఆశ్రయించవచ్చని చెప్పింది. మొదట హైకోర్టును ఆశ్రయించకుండా.. నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని షిండే తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ప్రస్తుత శివసేన ప్రభుత్వం మైనారిటీలో ఉందని, తమ ఎమ్మెల్యేలకు బెదిరింపులు వస్తున్న కారణంగానే ముంబయిలో కాకుండా గువాహటిలో ఉన్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్‌ను తొలగించాలనే పిటిషన్‌పై విచారణ జరగుతుండగానే.. ఆయన ఎమ్మెల్యేకు అనర్హత వేటు నోటీసులు పంపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. గతంలో అరుణాచల్ ప్రదేశ్ నాబం రేబియా కేసు విషయాన్ని ప్రస్తావించారు. వాదోపవాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం.. దీనిపై స్పందన తెలియజేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, కార్యదర్శి, కేంద్రంతో పాటు శివసేన నాయకులు అజయ్ చౌదరి, సనీల్ ప్రభుకు నోటీసులు పంపింది. ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అదేశించింది. షిండేతో పాటు మరో 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత వేటు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లోగా స్పందన తెలపాలని కోరారు. దీన్ని సవాల్ చేస్తూ షిండేవర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు 38మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ప్రస్తుతం మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని వాదించారు. మరోవైపు షిండేతో పాటు ఆయన వర్గంలోని 9 మంది మంత్రి పదవులను సీఎం ఠాక్రే తొలగించారు.
5.మా భూములు మాకే..
` ఆదివాసీల పోరుబాట
` ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన గిరిజనులు
` జిల్లాలోనే అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం,జూన్ 27(జనంసాక్షి):పోడు భూముల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్రగా బయలుదేరిన గిరిజనులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం రామన్నగూడెం పరిధిలో సోమవారం జరిగింది. గతంలో సర్వే నెంబర్ 30, 36, 39లలో ఉన్న 570 ఎకరాల భూమికి సంబంధించి గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా భూమికి సంబంధించి పొజిషన్ చూపించలేదు. రామన్నగూడెం పంచాయతీ పరిధిలో గిరిజనులు 40 ఏళ్లుగా అటవీ ప్రాంతంలో పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. 2012లో పోడు భూములపై ఫారెస్టు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు సర్వే నిర్వహిచారు. అయితే, అధికారులు ఈ సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు సమర్పించలేదు. దీంతో భూమిపై వివాదం నెలకొంది. దీంతో ఇంతకాలంగా భూమి కోసం గిరిజనులు పోరాటం చేస్తున్నారు. ఎంతోకాలంగా భూమి హక్కుల కోసం పోరాడుతన్నప్పటికీ, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, సీఎం కేసీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకో వాలని గిరిజనులు నిర్ణయించుకున్నారు. దీనికోసం గిరిజనులు ఛలో ప్రగతి భవన్‌కు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు, అశ్వారావు పేట ఎంపీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఛలో ప్రగతి భవన్‌లో భాగంగా రామన్న గూడెం నుంచి గంగారాం వరకు గిరిజనులు పాదయాత్ర చేపట్టారు. గంగారాం వద్ద పోలీసులు వీరిని బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం దమ్మపేట, ముల్కలపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. అక్కడి నుంచి పాల్వంచ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. కాగా, పాదయాత్ర చేస్తున్న గిరిజనుల అరెస్టుకు నిరసనగా, స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. పోడు భూముల హక్కుల కోసం పోరాడుతున్న గిరిజనుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తాటి వెంకటేశ్వర్లు అన్నారు.
6.అగ్నిపథ్ దేశరక్షణకు ప్రమాదం
` దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
` మోడీనికి నిరసనలు తెలుపుదాం
` మల్కాజిగిరిలో సత్యాగ్రహ దీక్షలో రేవంత్
హైదరాబాద్,జూన్ 27(జనంసాక్షి):బిజెపి జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రినరేంద్ర మోదీహైదరాబాద్ వచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే మోదీ పర్యటనలో నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా యువతన నిరసన తెలపాలని అన్నారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. రైల్వే ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని కోరారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవానులను అవమనించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్గాజ్‌గిరి కూడలి వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులను, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా వారిని కాంగ్రెస్ గుర్తించిందన్నారు. అంబాని, ఆదాని కంపెనీల రక్షణకు అగ్నిపథ్ పథకాన్ని తెచ్చారని ఆరోపించారు. నాలుగేళ్లు సైన్యంలో ఆ తరువాత జీవిత కాలం బడా పారిశ్రామిక వేత్తలకు కాపలా కాయలా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదని, మాజీ సైనికుల హోదా లేదని, ఫించన్ కూడా లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అగ్నిపథ్ పథకంతో యువత భవిష్యత్తును చీకటి మయం చేస్తున్నారని మండిపడ్డారు. యువకులు నాలుగేండ్లు ఆర్మీలో పనిచేసి నిరుద్యోగిగా బయటకు వస్తే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చట్టాలు తీసుకొచ్చి యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చాయని ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన యువకులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.
7.జీ7 సదస్సులో పాల్గొన్న మోదీ
` జర్మనీలో ప్రధానికి అపూర్వ స్వాగతం
బెర్లిన్,జూన్ 27(జనంసాక్షి): జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీకి వెళ్లిన ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది.మ్యూనిక్ విమానాశ్రయంలో బవేరియా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఘనంగా ఆహ్వానించింది. ప్రత్యేక బవేరియన్ బ్యాండ్‌తో సాదర ఆహ్వానం పలికింది. ఆ రాష్ట్రం, ప్రవాస భారతీయులు చూపిన అభిమానానికి ముగ్ధుడైన ప్రధాని.. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.’ఈ రోజు నేను జీ7 సదస్సుకు హాజరు కానున్నాను. ఈ సమావేశంలో పలు అంతర్జాతీయ అంశాలను చర్చించనున్నాం. దానిలో భాగంగా నిన్న జర్మనీ చేరుకున్న తర్వాత జరిగిన విశేషాలు, లభించిన ప్రత్యేక స్వాగతం గురించి విూతో పంచుకుంటున్నాను’ అంటూ మోదీ తాజాగా ఒక వీడియోను పోస్టు చేశారు.మొదట మ్యూనిక్ చేరుకున్న ఆయనకు బవేరియన్ బ్యాండ్ ఘన స్వాగతం పలికింది. ఆ తర్వాత ఆయన ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఆడి డోమ్ స్టేడియంలో జరిగిన ఆ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో భారత ప్రవాసులు హాజరయ్యారు. మహమ్మారి తర్వాత మోదీ రాకతో ఒక్క దగ్గర చేరిన వారంతా.. తమ ప్రదర్శనలతో భారత సంస్కృతిని చాటి చెప్పారు. జాతీయ గేయం వందేమాతరం ఆలాపనతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. విదేశాల్లో భారతీయులకు లభిస్తోన్న గౌరవానికి కారణం మోదీనే అంటూ అక్కడివారు కొందరు ప్రధానిపై తమ అభిమానాన్ని వెలిబుచ్చారు.ఇదిలా ఉంటే.. జీ7 కూటమిలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే భారత్‌తోపాటు అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికా నేతలను ప్రత్యేకంగా షోల్జ్ ఆహ్వానించారు. జీ7 దేశాలతోపాటు ఆహ్వానిత దేశాల నేతలతోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
8.నేటి నుంచి రైతుబంధు
` 68.10లక్షల మంది రైతులు అర్హులుగా గుర్తింపు
` సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్,జూన్ 27(జనంసాక్షి): తెలంగాణలో రైతుబంధు నిధులునేటినుంచి జమకానున్నాయి. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతుబందు కింద 68.10 లక్షల మంది అర్హులుగా తేలినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 28వ తేదీ నుండి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమకానున్న నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడిరచారు. ఈ దఫా కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు రైతుబంధు సాయం అందనున్నదని తెలిపారు. పంపిణీకి రూ.7521.80 కోట్లు సిద్ధంగా వున్నాయని తెలిపారు.రోజుకు ఒక ఎకరా నుండి ఆరోహణా క్రమంలో రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. సీసీఎల్‌ఎ వ్యవసాయ శాఖకు వివరాలు అందించినట్టు తెలపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థికశాఖకు అందించారని అన్నారు. వానాకాలం రైతుబంధు నిధుల పంపిణీకి అంతా సిద్దం చేశామనని తెలిపారు. మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఎన్ని ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించినా రైతుల విూద అభిమానంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు నిధుల విడుదలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ªూర్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని మంత్రి సూచించారు.జులై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.వర్షాలు కొంత ఆలస్యమయినందున తేలిక నేలలలో 5 నుండి 6.5 సెంటివిూటర్లు, బరువు నేలలలో 6 నుండి 7.5 సెంటివిూటర్ల వర్షాపాతం నమోదు అయిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలను విత్తుకోవాలన్నారు.
9.భారత సరిహద్దుల్లో చైనా భారీగా చొరబాట్లు
` అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, భారీ రన్‌వేలు సిద్ధం
న్యూఢల్లీి,జూన్ 27(జనంసాక్షి):వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్ సెక్టార్‌లో ఎల్‌ఏసీ నుంచి 100 కిలోవిూటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్‌వేల అభివృద్ధి చేపట్టింది. వీటితోపాటు ఫైటర్ జెట్‌లను భద్రపర్చేందుకు బ్లాస్ట్‌ప్రూఫ్ బంకర్ల నిర్మాణం కూడా చేపట్టింది. భారత్‌తో వివాదం మొదలైన రెండేళ్లలోనే వీటిని సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనావేశాయి. ఈ విషయాన్ని కేంద్రంలోని కీలక అధికారులు ఓ ఆంగ్లపత్రికకు వివరించారు. ఇటీవల అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండ్ జనరల్ చార్లెస్ ఫ్లయాన్ కూడా భారత్ పర్యటన సమయంలో చైనా మోహరింపులపై ఆందోళన వ్యక్తం చేశారు.2020లో భారత్`చైనా ఘర్షణకు ముందు వాస్తవాధీన రేఖ వెంట పశ్చిమ సెక్టార్‌లో కేవలం 20,000 పీఎల్‌ఏ దళాలు మాత్రమే ఉండేలా నిర్మాణాలు ఉన్నాయి. కానీ, ఈ రెండేళ్లలో 1.2లక్షల మంది ఉండేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. దీంతోపాటు సౌరశక్తి, హైడల్ పవర్ ప్రాజెక్టులను పీఎల్‌ఏ దళాలు నిర్మించాయి. ముఖ్యంగా శీతాకాలంలో కూడా దళాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిర్మాణాలను ఏర్పాటు చేశారు.వాస్తవాధీన రేఖ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షింజియాంగ్ డివిజన్ కిందకు వస్తుంది. ఇక్కడ మోహరించిన డివిజన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడంతోపాటు రొటేట్ చేస్తున్నారు. 2020లో వివాదం మొదలైన సమయంలో ఇక్కడ 4వ, 6వ డివిజన్లను మోహరించారు. 2021లో వాటిని మార్చేసి 8వ, 11వ డివిజన్లను ఇక్కడికి తరలించారు. ఈ ఏడాది 4వ, 8వ డివిజన్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మొత్తం డివిజన్లను కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్‌లుగా మార్చే పని కూడా వేగంగా జరుగుతోంది. వీటి పరికరాలను ఈ రెండేళ్లలో పూర్తిగా మార్చేశారు.ఇక్కడ దళాలు వాడే ఆయుధాలను చైనా పూర్తిగా మార్చేసి.. కొత్తవి ఇచ్చింది. గతంలో ఇక్కడ 4వ డివిజన్ జెడ్‌టీజెడ్`88 తొలి తరం ట్యాంకును వినియోగించేది. కానీ, ఇప్పుడు జెడ్‌టీక్యూ(టైప్`15) మూడో తరం ఆధునిక ట్యాంకులను తరలించారు. ఇక 6వ డివిజన్ గతంలో టైప్ 96ఏ రెండోతరం ట్యాంకులను వినియోగించేది. తాజాగా ఆ ట్యాంకుల ఫైర్ కంట్రోల్ వ్యవస్థలను చైనా పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది.ఇక్కడి మెకనైజ్డ్ బ్రిగేడ్‌లో దళాలను తరలించేందుకు గతంలో జెబీఎల్`08 వాహనాలను వాడేవారు. ఇప్పుడు వాటిని మార్చి జెడ్‌టీఎల్`11 వాహనాలను వినియోగిస్తున్నారు. ఇక 11వ డివిజన్‌లో సీఎస్‌కే సిరీస్ సాయుధ వాహనాలు వినియోగిస్తున్నారు. ఇవి అమెరికన్ల హమ్‌వీలను పోలి ఉంటాయి.అదే విధంగా వాస్తవాధీన రేఖ సవిూపంలోని వైమానిక స్థావరాల్లో పేలుళ్లను తట్టుకొనేలా బ్లాస్ట్‌పెన్‌లను నిర్మించారు. షిగాడ్స్,రూడక్ స్థావరాల్లో హెలిపోర్టులు, గర్గున్స్, లాసా,గ్వాంగ్‌రaూ స్థావరాల్లో రన్‌వేలను కూడా అభివృద్ధి చేశారు.చైనా సుదీర్ఘ శ్రేణి శతఘ్నులను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. గతంలో ఉన్న టోడ్ శతఘ్నులను తొలగించింది. ట్రక్కులపై అమర్చిన శతఘ్నులను అక్కడికి చేర్చింది. ఇవి 50 కిలోవిూటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. దాడి చేసిన వెంటనే శత్రువు గుర్తించే లోపు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాయి. అరుణాచల్ ప్రదేశ్‌వేపు కూడా వాస్తవాధీన రేఖకు 50 కిలోవిూటర్ల లోపు భారీగా శతఘ్నులను మోహరించారు.100 కిలోవిూటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే పీహెచ్‌ఎల్`3 మల్టీ రాకెట్ లాంఛ్ వ్యవస్థలను వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చింది. వీటిని రష్యాకు చెందిన స్మెర్చి ఎంఆర్‌ఎల్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇటువంటివి భారత్ వద్ద మూడు రెజిమెంట్లు ఉన్నాయి.సరిహద్దుల సవిూపంలో హెచ్‌క్యూ`17 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అమర్చింది. దీంతోపాటు చిప్‌చాప్ రిడ్జ్ వద్ద అత్యాధునిక హెచ్‌క్యూ`9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను మోహరించింది. రష్యాకు చెందిన ఎస్`300 వలే ఇది పనిచేస్తుంది.హోటన్‌లో చైనా ప్రస్తుతం 25 ఫైటర్ జెట్లను మోహరించింది. సాధారణ స్థితి కంటే ఇది చాలా ఎక్కువ.
10.గజ్వేల్‌లో రైలు కూత
` పట్టణానికి చేరుకున్న తొలి గూడ్స్‌రైలు
` స్వాగతం పలికిన మంత్రులుహరీష్,నిరంజన్ రెడ్డి
` గజ్వెల్ రైల్వేస్టేషన్‌లో రేక్ పాయింట్ ప్రారంభం
సిద్దిపేట బ్యూరో,జూన్ 27(జనంసాక్షి): గజ్వేల్ కు తొలి గూడ్స్ రైలు చేరుకుంది. తొలి విడుతగా కాకినాడ నుంచి 13 బోగీలలో 1300 మెట్రిక్ టన్నుల ఎరువుల లోడ్‌ను తీసుకుని వచ్చింది. తొలి విడతలో భాగంగా ఆంధప్రదేశ్ లోని కాకినాడలోని ఎన్‌ఎఫ్ సీఎల్ నుంచి గజ్వేల్‌కు 13 బోగీల గూడ్సు రైలు 1300 మెట్రిక్ టన్నుల ఎరువుల లోడు తీసుకుని వచ్చింది. ఈ ఎరువుల రేక్ పాయింట్ కు అనుసంధానంగా సరకు రవాణా జరగనుంది. రువుల కోసం 4 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గిడ్డంగులను నిర్మించారు. దీంతో ఇవాళ్టి నుంచి గజ్వేల్ కు గూడ్స్ రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఎరువుల రేక్ పాయింట్ ప్రారంభ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ లు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వెల్ రైల్వే స్టేషన్‌లో రేక్ పాయింట్‌ను ప్రారంభించిన మంత్రులు
గజ్వేల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన రేక్ పాయింట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా దశాబ్దాల పోరాటం ఫలితంగా రేక్ పాయింట్ ఏర్పాటైందని పేర్కొన్నారు. ఈ రేక్ పాయింట్ జిల్లా ప్రజలకు వరం అని చెప్పారు. కేంద్రానిదే రైల్వే లైన్ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ రైల్వే లైన్ కోసం నాటి సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య నిధులు ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు నిధులను ఎప్పటికప్పుడు ఇచ్చిందని తెలిపారు. కొత్తపల్లి` మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ లైన్ కోసం 2,200 ఎకరాల భూసేకరణ చేశామని హరీశ్‌రావు తెలిపారు. ప్రజల ఊహలకు అందనిది, కలలో కూడా ఉహించని అభివృద్ధి టీఆర్‌ఎస్ హయాంలో జరుగుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రేక్ పాయింట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. అనేక రకాల ఎగుమతుల సౌలభ్యం ఈ రేక్ పాయింట్ ద్వారా అందనుందన్నారు. రాబోయే వందల సంవత్సరాల వరకూ ప్రజల అవసరాలు తీర్చే పనులు జరుగుతున్నాయన్నారు. సీడ్ పాయింట్‌గా గజ్వెల్ అభివృద్ధి చెందుతున్నదని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఎన్ని ఏళ్ళు ఏలినా తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. ఈ రోజు కేంద్రాన్ని ఏలుతున్న పార్టీ వరి సాగులో, వడ్ల కొనుగోలులో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిందని విమర్శించారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపాలన్నారు. ల్గªతులకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
11.మాజీ ప్రధాని పీవీకి కేసీఆర్ నివాళి
హైదరాబాద్,జూన్ 27(జనంసాక్షి):భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు అని సిఎం కెసిఆర్ కొనియాడారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు.దేశ ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి, తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడివున్నదని సిఎం అన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పివీ నిరూపించారని సిఎం తెలిపారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్పూర్తితో ముందుకు సాగుతామని సిఎం కెసిఆర్ తెలిపారు.
12.నేడు ఇంటర్ ఫలితాలు విడుదల
ఫలితాలుప్రకటించనున్న మంత్రి సబిత
హైదరాబాద్,జూన్ 27(జనంసాక్షి):ఇంటర్మీడియట్ ఫలితాలను 28వ తేదీ మంగళవారం విడుదల చేయాలని ఇంటర్ బోర్టు నిర్ణయించింది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9.07 లక్షల మంది ఉన్నారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధికారులు ప్రకటించారు. కాగా పదో తరగతి పరీక్ష ఫలితాలను 30న లేదంటే జూలై 1వ తేదీన విడుదల చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. ఇంటర్ ఫలితాలపై అధికారికంగా ఇంటర్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు గత కొన్నిరోజులుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పలు కారణాల వల్ల ఫలితాల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేఫథ్యంలో 28న ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
13.సిద్ధిపేటలో కలకలం
` కలుషిత ఆహారం తిని 128మంది బాలికలకు అస్వస్థత
సిద్ధిపేట,జూన్ 27(జనంసాక్షి):కలుషిత ఆహారం తిని 128 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిద్ధిపేటలోని ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.పాఠశాలలో మొత్తం 326మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్‌తో భోజనం వడ్డించారు. మిగిలిన గ్రేవీని రాత్రిపూట వండిన వంకాయలో కలిపి వడ్డించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.సోమవారం ఉదయాన్నే నిర్వాహకులు స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన చేరుకొని అక్కడే చికిత్స ప్రారంభించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని తెలంగాణ మైనారిటీ గురుకులాల సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూసఫ్ అలీ, జిల్లా విజిలెన్స్ అధికారి గౌస్ పాషా, మైనారిటీ గురుకులాల జిల్లా ఇన్‌ఛార్జి గోపాల్‌రావు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సంబంధిత నివేదికను మైనారిటీ గురుకులాల రాష్ట్ర అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
14.అగ్నివీరుల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంచండి
` సీఎం మమతా బెనర్జీ
బుర్ద్వాన్,జూన్ 27(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకం కింద నియామకమయ్యే సైనికుల సర్వీసు నాలుగేళ్లయితే ఆ తర్వాత వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తంచేశారు.ఆ సైనికుల రిటైర్మెంట్ వయస్సును 65ఏళ్లకు పెంచాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చిందని దీదీ ఆరోపించారు. భాజపాలా కాకుండా మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే తన నినాదమని తెలిపారు. సోమవారం బుర్ద్వాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన దీదీ..కేంద్రం నాలుగు మాసాలు శిక్షణ ఇచ్చి.. నాలుగేళ్ల పాటు ఉద్యోగానికి తీసుకుంటే మరి ఆ తర్వాత సైనికులంతా ఏం చేయాలని ప్రశ్నించారు. వారి భవిష్యత్తు మాటేంటని ప్రశ్నించారు. నాలుగేళ్లకే సర్వీసు పూర్తయి బయటకు వచ్చాక వారి భవిష్యత్తులో అనిశ్చితి నెలకొంటుందన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో భాగంగా నియమించుకొనే అగ్నివీరుల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
15.కనువిందు చేస్తున్న మూసీ
` ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత
నల్లగొండ,జూన్ 27(జనంసాక్షి):నల్లగొండ జిల్లాలోని అతి పెద్ద మధ్యతరహా ప్రాజెక్టు మూసీ నిండుకుండలా మారి కనువిందు చేస్తుంది. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో గత కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికు చేరువైంది. దీంతో గత రెండు రోజులుగా దిగువ ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తూ వచ్చారు. సోమవారం ఉదయం 6 గంటలకు అధికారులు ప్రాజెక్టు 3, 7, 10వ నంబర్ గేట్లను ఎత్తివేశారు.ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1242.79 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1999.74క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.61 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. ఇప్పుడు 4.36 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. మూసీ ప్రాజెక్టు గేట్లు ఎతడంతో ప్రజలు చూడడానికి తరలివస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
16.శ్రీలంకలో ఇంధనానికి టోకెన్లు..
` స్కూళ్లు, ఆఫీసులు మూసివేత!
కొలంబో,జూన్ 27(జనంసాక్షి):ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో శ్రీలంక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. 2.20 కోట్ల జనాభా ఉన్న ద్వీపదేశం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అక్కడ ముఖ్యమైన కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. బంకుల వద్ద ప్రజలు రోజులకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. దీంతో లైనల్లోనే పౌరుల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్రంగా కలచివేస్తున్నాయి.అయితే, ఇంధనం ఆదా చేయడానికి శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. పౌరుల నుంచి వస్తోన్న ఒత్తిడిని తట్టుకోలేక పాఠశాలలకు సెలవులు ప్రకటించగా.. ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసుకోవాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు దేశ రాజధాని కొలంబోతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో స్కూళ్లు మూసివేయాలని, ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకోవాలని చెప్పింది.మరోవైపు ఇవాళ్టి నుంచి ఇంధన అమ్మకాల్లో పరిమితులు విధించి వినియోగదారులకు టోకెన్లు జారీ చేస్తున్నట్లు శ్రీలంక విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కంచన విజేసెకెరా వెల్లడిరచారు. దీంతో తాజాగా బంకుల ముందు ఎదురుచూస్తున్న ప్రజలకు సైనిక బలగాలు టోకెన్లు జారీ చేస్తున్నాయి. టోకెన్ నంబర్ ఆధారంగా వినియోగదారుల వాహనాల్లో ఇంధనం నింపుతున్నారు. కాగా, అక్కడ ఇంధన ధరలు నిన్న మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై రూ.50, డీజిల్‌పై రూ.60(శ్రీలంకన్ రూపాయిలో) పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.470, లీటరు డీజిల్ ధర రూ.460కు పెరిగింది.
తెలంగాణలో తగ్గని కొవిడ్ ఉధృతి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 25,989 మందికి టెస్టులు చేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా 477 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.తాజాగా మరో 279 మంది కోలుకోవడం.. సున్నా మరణాలు నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. తాజా కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,960కి చేరినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడిరచింది. ఈరోజు నమోదైన కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా కేసులు వెలుగుచూశాయి.మరోవైపు, తెలంగాణలో ఇప్పటివరకు 3,55,32,200 శాంపిల్స్ పరీక్షించగా.. 7,99,532మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 7,91,461 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కాగా.. 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,960 యాక్టివ్‌కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రివకరీ రేటు 98.99శాతం కాగా.. మరణాల రేటు 0.51శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.
జిల్లాల వారీగా కేసులు ఇలా..
హైదరాబాద్‌లో అత్యధికంగా 258 కేసులు రాగా.. రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్ `మల్కాజ్ గరిఇ జిల్లాలో 56, సూర్యాపేటలో 8, సంగారెడ్డి 7, వికారాబాద్ 6, జనగామ 4, మహబూబాబాద్, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల్లో మూడేసి కేసులు రాగా.. ఆదిలాబాద్, భద్రాద్రి, జోగులాంబ, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల్, మెదక్, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు వెలుగుచూసినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
ALL NEWS