గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

కడప,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రెండురోజుల క్రితం పెన్నా నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు... ఖాజీపేట మండలం పత్తూరుకు చెందిన ఆంజనేయులు (24) అనే యువకుడు గత ఆదివారం వల్లూరు మండల పరిధిలోని కోట్లూరు వద్ద ప్రవహిస్తున్న పెన్నా నదిలో చేపలు పడుతూ.. ప్రమాదవశాత్తూ నదిలోపడి గల్లంతయ్యాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు యువకుడి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం పెన్నా నదిలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.