బలవర్ధక ఆహారంతోనే రక్తహీనతకు దూరం

జనగామ,డిసెంబర్‌31 (జనం సాక్షి) : పోషణ అభియాన్‌పై ప్రజలు అవగాహన కలిగి బలవర్థక ఆహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మఅన్నారు. పోషణ లోపం..రక్తహీనత..తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు గర్భిణులు బలవర్థకమైన ఆహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళలు, బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. గర్భిణులు ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు చేయించుకోవాలని, పోషకాలున్న ఆహారాలు ఎక్కువగా తీసుకునేలా వైద్యులు అవగాహనలు కల్పించాలని సూచించారు. పుట్టిన శిశువుకు పుట్టిన గంటలోపేలోనే ముర్రుపాలను తాగించాలని తెలిపారు.