అర్హులైన దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి.




- డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో దళారులను అరికట్టాలి.

 

-కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు 

అతిమేల మాణిక్ 

 

సంగారెడ్డి బ్యూరో డిసెంబర్ 19:(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దళితులందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు డిమాండ్. కెవిపిఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా అర్హులైన దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేయాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో దళారుల అరికట్టాలని 

ఈరోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. 

ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన దళితులకు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఎంపిక ప్రక్రియ సిస్టం లాటరీ సిస్టం పెట్టడంతో అనర్హులకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నారని కానీ చాలా తక్కువ మందికి ఇళ్ల నిర్మాణం జరిగిందని అన్నారు. పెట్టినట్టుగా ప్రజలకు ప్రభుత్వం శక్తి పెరుగుతుందని అన్నారు అర్హులైన దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రాధాన్యత ఇవ్వాలని ఎటువంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని దళారీల పాత్ర అరికట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డప్పు విద్యాసాగర్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరు శివ కుమార్  జిల్లా సహాయ కార్యదర్శి కే సుభాష్ కెవిపిఎస్ నాయకులు చంద్రశేఖర్ ప్రవీణ్ కుమార్ శ్రీకాంత్ అశోక్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.