కైస్త్రవ భవన నిర్మాణానికి మంత్రుల శంకుస్థాపన


హైదరాబాద్‌,డిసెంబర్‌19  (జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో 2 ఎకరాల స్థలంలో 10 కోట్ల అంచనా వ్యయంతో నూతన కైస్త్రవ భవన నిర్మాణానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సబిత ఇంద్ర రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టాన్న్రి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే ముందున్న లక్ష్యమని అన్నారు. కైస్త్రవ భవనం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించామని, అందులో భవన నిర్మాణం చేపడతామన్నారు. మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు కోసం బరేల్‌ గ్రౌండ్‌ కోసం 62 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వాటికి సంబంధించిన పత్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనారిటీల సంక్షేమ సలహాదారు ఎ.కె.ఖాన్‌, ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీఫెన్‌ సన్‌, తదితరులు పాల్గొన్నారు.