పచ్చదనం తోనే శుద్ధమైన  జీవితం సాధ్యం
- సర్పంచ్ టీ. లక్ష్మి శ్రీనివాస్

తెలకపల్లి    పచ్చదనం తోనే కాలుష్య నివారణ జరిగి గ్రామంలో శుద్ధమైన జీవితం పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గట్టురాయిపాకుల గ్రామంలో  హరితహారం లో భాగంగా గ్రామంలో రోడ్డుకిరువైపులా కాళీ ప్రదేశంలో మొక్కలు నాటి వాటికి రక్షణ లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు