కంటివెలుగులో మూడోస్థానంలో కామారెడ్డి


కామారెడ్డి,జనవరి2  జనంసాక్షి :  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరంలో కామారెడ్డి జిల్లా మూడో స్థానంలో ఉందని జిల్లా వైద్యాధికారులు  తెలిపారు. జిల్లాలో రామారెడ్డి, అన్నారం, రాజంపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వంద శాతం కంటి వెలుగు కార్యక్రమం పూర్తి అయిందన్నారు. జిల్లాలో ప్రతీ ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు.కలెక్టర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్తుల సహకారంతో కంటి వెలుగులో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానం పొందినట్లు వివరించారు. అందరి సహకారంతో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధిస్తామన్నారు. కంటి లోపాలు ఉండి ఆపరేషన్‌ అవసరం ఉన్న వారికి రిఫర్‌ చేశామన్నారు. త్వరలోనే వారికి ఆపరేషన్లు చేస్తామన్నారు.