మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు జిల్లాలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు


*జిల్లా లో 144 సెక్షన్ అమలు**

 వనపర్తి బ్యూరో( జనం సాక్షి) జిల్లాలో శనివారం మున్సిపల్  ఎన్నికల కౌంటింగ్ ను   శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ కే అపూర్వ రావు  తెలిపారు. శుక్రవారం  జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత కౌంటింగ్ సెంటర్లలో ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు గాను 700 మంది అధికారులు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.జిల్లా లో 25-1-2020 శనివారం ఉదయం 6:00 నుండి26-1-2020 ఆదివారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కౌంటింగ్ సెంటర్ల వద్ద ఐదుగురు కానీ అంతకంటే ఎక్కువమంది కానీ గుంపులు గుంపులుగా తిరగవద్దు అని, కౌంటింగ్ కేంద్రాల వద్ద చుట్టుపక్కల 500 మీటర్ల దూరంలో మరియు పట్టణాలలో 144 సెక్షన్ అమలులో ఉంది, కౌంటింగ్ ఏజెంట్ల ఎన్నికల ఏజెంట్లు  పోటీచేసిన కౌన్సిలర్లు పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకుని వెళ్లకూడదని, పార్టీ జెండాలు పార్టీ గుర్తులు ప్లే కార్డ్స్ ధరించకూడదని ప్రదర్శించవద్దని కోరారు, మైకులు లౌడ్ స్పీకర్లు వాడరాదు పాటలు ఉపన్యాసాలు ఇవ్వకూడదు, ధర్నాలు రాస్తారోకోలు ఊరేగింపులు టపాకాయలు కాల్చడం లాంటివి నిర్వహించడం నేరంగా పరిగణించడం తో పాటు సదరు వ్యక్తుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలీసుల సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించడానికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.