క‌ర్న‌ల్‌‌ సంతోష్‌బాబుకు కన్నీటి విడ్కోలు

సొంత వ్యవసాయ క్షేత్రంలో పూర్తయిన అంత్యక్రియు
సైనిక, అధికార లాంఛనాతో అంత్యక్రియ నిర్వహణ
నివాళి అర్పించిన ప్రజాప్రతినిధు, సైనికలు, అధికాయిలు
చితికి నిప్పంటించిన తండ్రి ఉపేందర్‌
భారీగా తరలివచ్చిన ప్రజలు
అంతిమయాత్ర పొడవునా ప్రజ నినాదాలు
సూర్యాపేట,జూన్‌18(జ‌నంసాక్షి): సరిహద్దులో శత్రు సైన్యానికి ఎదురొడ్డి జాతి కోసం వీర మరణం పొందిన క్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహాన్ని అశ్రునయనాతో.. సైనిక, అధికార లాంఛనాతో ఘనంగా వీడ్కోు పలికారు. సంతోష్‌ తండ్రి ఉపేందర్‌ తనయుడి చితకి నిప్పంటించారు. మనవడు అనిరుధ్‌తో తకొరివి పెట్టించారు. కేసారం వ్యవసాయ క్షేత్రంలో సైనికు గౌరవార్థం గాల్లోకి మూడు రౌండ్ల క్పాుు జరిపి నివాళు అర్పించారు. జనం భారీగా తరలి వచ్చి వీరుడికి నివాళుర్పించారు. పువురు రాజకీయ ప్రముఖు క్నల్‌ భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్దాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశా మేరకు మంత్రి జగదీష్‌ రెడ్డి దగ్గరుండి అంత్యక్రియకు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్‌`19 నిబంధనకు అనుగుణంగా అంత్యక్రియు పూర్తయ్యాయి. అంత్యక్రియకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు. కుటుంబ సభ్యు, ఆర్మీ అధికారుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే అంతిమయాత్రకు వందలాదిగా ప్రజు తరలివచ్చి వ్యవసాయ క్షేత్రం బయట ఉండి కార్యక్రమాను వీక్షించారు. సైనిక వాహనంపై బౌతిక కాయాన్ని ఊరేగింపుగా సంతోష్‌ వ్యవసాయక్షేత్రానికి తీసుకుని వచ్చిన తరవాత ఆర్మీబ్యాండ్‌ నివాళి అర్పించింది. సైనికు క్పాుతో గైరవ వందనం అందించారు.
సోమవారం రాత్రి గల్వాన్‌ లోయలో భారత్‌`చైనా సైనికు మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాు అర్పించిన అమరవీరుడు సంతోష్‌బాబుకు యావత్‌ ప్రజానీకం అశ్రునివాళి అర్పించింది. క్నల్‌ సంతోష్‌బాబు అంతిమయాత్రలో భారీగా ప్రజు పాల్గొన్నారు. సూర్యాపేట సవిూపంలోని స్వగ్రామం కేసారంలో సైనిక లాంఛనాతో క్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియు నిర్వహించారు. సంతోష్‌ పార్థివదేహాన్ని ఆర్మీ అధికాయి చితివద్దకు తీసుకువచ్చారు. పార్థివదేహం చితి చుట్టూ కుటుంబసభ్యు మూడు సార్లు తిరిగి నివాళి అర్పించారు. వీరజవాన్‌కు నివాళిగా జవాన్లు గాల్లోకి మూడుసార్లు తూటాు పేల్చి.. గౌరవ వందనం సమర్పించారు. ఆపై సంతోష్‌బాబు సతీమణి, కుమారుడు, బంధువు, ప్రజు స్యోట్‌ చేశారు. కుమారుడు సంతోష్‌బాబు చితికి తండ్రి ఉపేందర్‌ నిప్పుపెట్టడంతో అంత్యక్రియు పూర్తి అయ్యాయి. శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎంపీు లింగయ్య యాదవ్‌, ఉత్తమ్‌ కుమార్‌ దంపతు, బండి సంజయ్‌, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యేు కిషోర్‌ కుమార్‌, సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, తదితయి సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సందర్శించి నివాళుర్పించారు. సంతోష్‌ అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రజు భారీగా తరలిరావడంతో సూర్యాపేట జన సంద్రంగా మారింది. యుద్ధవీరుడా జోహార్లు అంటూతెంగాణ ప్రజానీకం కన్నీటి నివాళి అర్పించింది. ఒక్కొగానొక్క కొడుకును సైన్యంలోకి పంపిన వీరుడి కుటుంబానికి జేజేు పలికింది. మౌనంగా రోదిస్తున్న అమరుడి భార్యను.. తామంతా అండగా ఉన్నామంటూ యావత్‌ దేశం ఓదార్చింది. సంతోష్‌ బాబు అమర్‌ రహే అంటూ బంధువు, స్థానికు పెద్ద ఎత్తున నినాదాు చేశారు. అమర జవాన్‌ బలిదానానికి మద్దతుగా సూర్యాపేటలో వ్యాపాయి స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. సరిహద్దు నుంచి క్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం బుధవారం పొద్దుపోయాక హైదరాబాద్‌ చేరుకుంది. ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ బేస్‌కు చేరుకున్న సంతోష్‌ పార్థివదేహానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రు కేటీఆర్‌, మల్లారెడ్డి, జగదీష్‌ రెడ్డిు నివాళి అర్పించారు. సంతోష్‌బాబు మృతదేహం రాగానే ఆయన భార్య కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఆమెను గవర్నర్‌తోపాటు మంత్రు ఓదార్చారు. అనంతరం హకీంపేట ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి క్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం రోడ్డు మార్గం ద్వారా సూర్యాపేటకు తరలించారు. భౌతికకాయాన్ని పట్టణంలోని విద్యానగర్‌ నుంచి సుమారు 5 కిలోవిూటర్ల దూరంలో ఉన్న కాసరబాద వరకు ర్యాలీగా తీసుకువెళ్లారు. ఇందులో ఆర్మీ, సంతోష్‌బాబు బంధువు మినహా ఎవరినీ అనుమతించలేదు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీు. ప్రభుత్వ లాంఛనాతో ఆర్మీ అధికాయి అంత్యక్రియు పూర్తి చేస్తున్నారు. దేశ రక్షణలో ప్రాణాు విడిచిన సంతోష్‌బాబు ఆత్మకు శాంతిచేకూరాని అంతా ఆకాంక్షించారు.