బెంగాల్‌ ప్రభుత్వం కీల‌క నిర్ణయం


ఆన్‌లైన్‌లో ఇక మద్యం అమ్మకాలు
అమెజాన్‌,బిగ్‌ బాస్కెట్‌కు అనుమతి
కోల్‌కతా,జూన్‌20(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ లో మమతా బెనర్జీ సర్కార్‌ కీక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ మద్యం ఉత్పత్తును సరఫరా చేసేందుకు ప్రముఖ ఈ`కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌ కు ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయంతో భారత్‌ లో మద్యం హోమ్‌ డెలివరీకి అనుమతిచ్చిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్‌ నిలిచింది. ఈ మేరకు వెస్ట్‌ బెంగాల్‌ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి అనుమతు వచ్చాయని అమెజాన్‌ స్పష్టం చేసింది.దేశంలోనే మొట్టమొదటిసారి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు అమెజాన్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో మద్యం డెలివరీకి అమెరికా ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కు పశ్చిమబెంగాల్‌ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అనుమతించింది. పశ్చిమబెంగాల్‌లో అమెజాన్‌ తోపాటు అలీబాబా వెంచర్‌ అయిన బిగ్‌ బాస్కెట్‌ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి పొందింది. 90 మిలియన్లకు పైగా జనాభా ఉన్న పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న 4వ రాష్ట్రంగా నిలిచింది.కిరాణా సరకు నుంచి ఎక్టాన్రిక్స్‌ వస్తువు దాకా ఆన్‌ లైన్‌ షాపింగ్‌ కోసం అమెజాన్‌ 6.5 బిలియన్‌ డార్ల పెట్టుబడు పెట్టింది. మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం పై రాష్ట్రంలో విమర్శు ఎదురవుతున్నాయి. మహిళా ముఖ్యమంత్రి మద్య నిషేదానికి బదు ఇలా మందుబాబును ప్రోత్సహించడమేంటని ప్రజు ప్రశ్నిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి మందుబాఋ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో దొరకకుండా కూచ్చున్నచోటే ఫ్లుగా తాగొచ్చని ఆనందపడుతున్నారు.