న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం చనిపోయారు. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. వైద్యుల ప్రయత్నాలు, ప్రజల ప్రార్థనలు ఫలించలేదని, తన తండ్రి కొద్దిసేపటి కిందటే చనిపోయిన సంగతి పేర్కొనడం చాలా బాధగా ఉందన్నారు. 84 ఏండ్ల ప్రణబ్ ముఖర్జీకి ఇటీవల కరోనా సోకడంతో ఆర్మీ దవాఖానలో చేరారు. ఈ సందర్భంగా మెదడులో రక్తం గడ్డకట్టంపై వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన కోమాలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సపోర్టుతో ఉన్న ప్రణబ్ ఆరోగ్యం మరింత విషమించినట్లు సోమవారం ఉదయం ఆందోళన వ్యక్తం చేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత