అసోం14 మార్చి (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (భాజపా) ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలకు
అసోం వీరులను గుర్తించిన పార్టీ భాజపానే: రాజ్నాథ్
అసోం హీరోలను గుర్తించిన పార్టీ భాజపానేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోహ్పూర్లో ఆయన మాట్లాడారు. గతంలో అసోం మంత్రులు నుంచి ఎవరైనా దిల్లీకి వచ్చి మాట్లాడితే వారిని పట్టించుకునేవారు కాదని, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి నెలా పర్యటించి అక్కడి వారి సమస్యలను పరిష్కరించాలని పార్టీలోని అగ్రనేతలకు మోదీ సూచించారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో నడవాలంటే భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.