తగ్గుతున్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : సురక్షిత వాహన ప్రయాణానికే ట్రాఫిక్‌ నిబంధనలు అనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించకుండా వాహనాలు నడిపితే అందరూ సురక్షితంగా ప్రయాణిస్తారని ట్రాఫిక్‌ పోలీసులు అన్నారు. ఇటీవల తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని అన్నారు. ఎంవీ యాక్టులో నియమాలను అమలు పరిచే దిశగా ట్రాఫిక్‌ విభాగం అడుగులు వేస్తుందన్నారు. ట్రాఫిక్‌ అధికారుల ట్యాబ్‌లో సంబంధిత సాఫ్ట్‌వేర్‌ అపడేట్‌ చేశారన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్‌ల వాడకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నామని కమిషనర్‌ తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో అమలు చేస్తున్న విధానం వాహనదారులకు ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు. ఇప్పటివరకూ

చలాన్లు రాసి జరిమానాలు వసూలు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఇకపై అదనంగా ఆయా వాహనదారులకు పాయింట్లను నమోదు చేస్తున్నారని తెలిపారు. పాయింట్ల నమోదు వివరాలు ఎప్పటి కప్పుడు ఆర్టీఏ రూపొందించిన ఎం`వ్యాలెట్‌ మొబైల్‌ యాప్‌లో అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని, దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి అందుబాటులోకి తెచ్చామన్నారు. వాహనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ జీరో పాయింట్లతో హీరోగా ఉండాలని పౌరులకు సూచించారు.