నాడునేడు కింది స్కూళ్ల అభివృద్ధితో పాఠశాల స్థాయిలో మెరుగైన వసతులు

 


ఆంగ్ల మాధ్యమంతో పెరుగుతున్న ఆడ్మిషన్లు
డిగ్రీ కాలేజీల్లోనూ ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యం
అమరావతి,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)    ఎపిలో కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉండేందుకు గాను అవసరమైన నిధులను కేటాయించి నాడు`నేడు కింద బలోపేతం చేసే కార్యక్రమం చురుకుగా సాగుతోంది. ఆంగ్ల మాధ్యమంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కార్పోరేట్‌ స్కూల్ళ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారుస్తున్నారు. భారతదేశంలోనే ఏపీని ఓ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్‌ శ్రమిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పునఃప్రారంభించినందున పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి అన్నారు. ప్రభుత్వవిద్యను చేరువ చేసే లక్ష్యంతో సిఎం కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. పాఠశాలలకు కార్పోరేట్‌ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో పురపాలక సంఘాల నిధులతో వాటి పరిధిలోని కేంద్రాలకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. కేంద్రాల్లో చిన్నారులకు కూర్చునేందుకు కుర్చీలు, టేబుళ్లు, ఎల్‌ఈడీ టీవీలు, యూనిఫామ్‌, ఆట పరికరాలు సమకూరు స్తున్నారు. భవనాలకు రంగులు వేసి వాటిపై ఆకర్షణీయమైన బొమ్మలు వేస్తున్నారు. దీనికితోడు దాతలు ముందుకొచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. శిథిలావస్థ భవనాలు.. ఇరుకు గదులు.. చాలీచాలని వరండాలతో ఇంతకాలం స్కూళ్లు నిర్వహిస్తున్నారు. వీటిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి ఉద్యోగావ కాశాలను మరింత చేరువ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా
ఆంగ్ల మాధ్యమంలోనే అందించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటికే తెలుగు మాధ్యమంలో చేరిన విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని యధాతథంగా కొనసాగించుకోవచ్చు. వారి మాధ్య మంలో ఎలాంటి మార్పూ ఉండదు. ఈ విద్యాసంవత్సరంలో చేరిన వారు మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో కొనసాగుతారు. అలాగే రాష్ట్రంలోని డిగ్రీ తదితర కోర్సులు అభ్యసిస్తున్న యువతకు ఉద్యోగావకాశాలను మరింత చేరువ చేసేందుకు వీలుగా విద్యాశాఖ విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ªూష్ట్రంలో అత్యుత్తమ విద్యా బోధనను అందించేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి పలు చర్యలు చేపడుతోంది. కనీస ప్రమాణాలు లేకపోవడంతో పాటు గత కొన్నేళ్లుగా చేరికల్లేకుండా కొనసాగు తున్న డిగ్రీ కాలేజీలకు ఈ విద్యా సంవత్స రంలో సీట్ల కేటాయింపును నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇలాంటి కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం పూర్తిచేసిన వారికే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఆంగ్ల మాధ్య మంలోనే అందించాలని నిర్ణయించింది. నిజానికి.. ఆంగ్లంలో నైపుణ్యాలున్న వారిని, ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్య సించిన వారినే పలు సంస్థలు ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తున్న విషయాన్ని వివిధ జాతీయ, అంత ర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఆంగ్ల నైపుణ్యాలున్న వారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తు న్నాయి. దేశంలోని వివిధ సంస్థల యాజమాన్యాల్లో 90 శాతానికి పైగా మేనేజ్‌మెంట్లు తమ సంస్థల్లో పనిచేయడానికి ఇంగ్లీషు నైపుణ్యాలున్న వారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వేలో తేలింది. తెలుగు మాధ్యమంలో డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఆంగ్ల నైపుణ్యాలు కొరవడి అవకాశాలు దక్కడంలేదు. వీరికి ఉపాధి అవకాశాలు పెద్దగా రాకపోవడంతో గత కొన్నేళ్లుగా తెలుగు మాధ్యమం కోర్సుల్లోని సీట్లు 10శాతం కూడా భర్తీ కావడంలేదు. దీంతో పలు కాలేజీలు ఆయా కోర్సుల నిర్వహణపై విముఖత చూపుతున్నాయి. ఫలితంగా 558 కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమాలుగా మార్చుకున్నాయి.