దళిత బంధు అందరికి ఇస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా


మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌21 (జనంసాక్షి)

చౌటుప్పల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ. వరదల సమయంలో కరోనా రావడం తో చౌటుప్పల్‌ కి రాలేక పోయా అన్నారు. గత ఏడాది కూడా వర్షాలకు చెరువులు నిండి అలుగు వరద తో జాతీయ రహదారిపై వరద రావడం జరిగింది,దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని తెలిపాను. ప్రజా సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ల లంటే ముఖ్యమంత్రి సమయం కూడా ఇవ్వడు. మునుగోడు నియోజక వర్గం సమస్య ల పై అసెంబ్లీ లో కూడా గళం ఎత్తాను,కానీ లాభం లేదు ,నిధులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ పెద్దలలో వున్న సంబంధాలతో దివిస్‌ కంపెనీ లో స్థానికుల కు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. సిరిసిల్ల,గజ్వేల్‌,సిద్ది పేట నియోజక వర్గాలలో తప్ప రాష్ట్రం లో ఎక్కడ అభివృధి జరగడం లేదు అని తెలిపారు. ఇక దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులు పై నిర్లక్షం,అభివృధి పై ప్రభుత్వం నిర్లక్షం చేస్తుంది. చౌటుప్పల్‌ మున్సి పాలిటి కి మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వెంటనే 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలి. చౌటుప్పల్‌ టూ తంగడిపల్లి వెళ్ళే రహదారి నీ వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వున్న చోట నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఎలాగు ఇవ్వరు కాబట్టి ఇల్లు లేని ప్రతి పేద వాడికి ఇంటి స్థలం వుంటే రెండున్నర లక్షల రూపాయల ఇవ్వాలని కోరుతున్నాను. %Rడదీ% విద్యుత్‌ అధికారులకు పనుల కోసం అడిగితే నిధులు లేవని అంటున్నారు. ఉమ్మడి నల్గొండ మంత్రి జగదీష్‌ రెడ్డి కి మళ్ళీ అడుగుతున్న ప్రభుత్వ పథకాలకు కాకుండా మునుగోడు నియోజక వర్గం కి అభివృద్ధి కి నిధులు తేవాలని అడిగారు అలాగే విలువలు కోల్పోయి మా కాంగ్రెస్‌ పార్టీ పై గెలిచిన నాయకులను తెరాస పార్టీ లో చేర్చుకుంటూ ఉన్నారు. దళిత బందు పథకం అనేది కేవలం హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో ఈటెల రాజేందర్‌ ను ఓడగొట్టడనికి అని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి,దళిత ముఖ్యమంత్రి ఏమైంది అని కేవలం దళిత పథకం రాజకీయ లబ్ధి కోసమే తీసుకొచ్చారని. దళిత బందు పథకం మునుగోడు నియోజక వర్గం మొత్తం దళితులకు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా,మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పారు. ఇక నైనా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పైన వివక్ష తీసేసి అభివృధి చేయాలని లేకపోతే వచ్చే ఎన్నికలలో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని తెలిపారు............