పాలనా వైఫత్యానికి పరాకాష్ట..విద్యుత్‌ సంక్షోభం !

దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం నెలకొనడానికి పాలకుల తీరు, దూరదృష్టి లోపమే కారణమని చెప్పాలి. తెలంగాణ మినహా కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్టాల్రు విద్యుత్‌ ఉత్పత్తిలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయనే చెప్పాలి. ఇక ఎపిని తీసుకుంటే కోతలకు సిద్దంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టి ఇష్టం వచ్చినట్లుగా డబ్బులను పంపిణీ చేస్తూ పోతున్న ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిపై ఒక్క క్షణం కూడా ఆలోచన పెట్టలేకపోయింది. సిఎం జగన్‌ చుట్టూ ఉన్న సలహాదారులు కూడా ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వలేక పోయారు. పక్కనే ఉన్న తెలంగాణ నిరంతర విద్యుత్‌ ఇస్తుంటే తాము ఎందుకు ఇవ్వలేకపోతున్నామో అధ్యయనం చేయలేకపోయారు. రైతుబంధును,మిషన్‌ భగీరథను, హెల్త్‌ ప్రొఫైల్‌ను కాపీ కొట్టిన కేంద్రం ఎందుకనో నిరంతర విద్యుత్‌ జోలికి పోలేదు. సరికదా విద్యుత్‌ రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోంది. నిజానికి విద్యుత్‌ రంగంలో సిఎం కెసిఆర్‌ తెలంగాణలో ఓ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. నిరంతరాయంగా విద్యుత్‌ను ఇచ్చేలా విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టారు. ఇది ఓ సక్సెస్‌ స్టోరీ. దీనిని పక్కనే ఉన్న ఎపి సిఎం జగన్‌ కనీసం అధ్యయనం కూడా చేయలేదు. ఓ మంచి పని ఎవరు చేసినా అధ్యయనం చేస్తే బాగుండేది. అలా చేయకుండా ఇప్పుడు ముప్పు ముంచు కు రావడంతో సర్దిచెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారికంగా కరెంటు కోతలపై ప్రభుత్వం సంకేతాలు పంపింది. విద్యుత్‌ కొరత ఏర్పడినందున వినియోగాన్ని తగ్గించు కోవాలని ప్రజలకు సూచించింది. లేదంటే కోతలు విధించాల్సి రావచ్చని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ కరెంటు వాడకం తగ్గించాలని గృహ వినియోగ దారులకు సూచించారు. దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్నందునే ఈ సమస్య వచ్చిందని, డబ్బు ఖర్చు పెట్టినా పరిష్కారమయ్యే పరిస్థితి లేదని చెప్పారు. బొగ్గు నిల్వలు తరిగిపోతుండటంతో 4 జెన్‌కో యూనిట్‌ లలో విద్యుదుత్పత్తి నిలిపి వేశారు. కృష్ణపట్నంలో ఒక యూనిట్‌లో ఉత్పత్తి ఆపేశారు. నిజానికి ప్రభుత్వం నిర్లక్ష్యానికి ప్రజలు ఎంతవరకు బాధ్యులు. ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నాలు ఎందుకు చేయలేదో సజ్జల చెప్పగలరా ? ప్రభుత్వ ఖజానాను దుబారాకు ఖర్చు చేస్తున్న పాలకులు విª`యదుత్‌ ఉత్పత్తి విషయంలో ఎందుకు ముందుచూసు చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడిరదని, బొగ్గు ధర పెరిగిపోయిందని చెప్పుకోవడంలో అర్థం లేదు. అధికధరకు బొగ్గు కొను గోలు చేయాల్సి వస్తోందని ,బొగ్గు కొరతతో విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని చెప్పడంలో కూడా అర్థం లేదు. పీక్‌ అవర్స్‌లో గృహ వినియోగదారులు విద్యుత్‌ వాడకాన్ని నియంత్రించుకుంటే బాగుంటుం దని కోరుతున్న వారు సౌర విద్యుత్‌ వినయోగం పెద్ద ఎత్తున చేపట్టి ఉంటే బాగుండేది. బొగ్గు కొరత లేదని కేంద్రమంత్రి చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు. అన్ని రాష్టాల్ల్రోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కా రానికి కొంత ఆలస్యమవుతోంది. ఇకపోతే ముద్దనూరు విద్యుత్కేంద్రంలో ఒక యూనిట్‌ ఓవర్‌ హాలింగ్‌లో ఉండగా.. మరో రెండు యూనిట్లలో బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. విజయవాడ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ మాత్రం పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. రాష్ట్ర జెన్కో విద్యుత్కేంద్రాల తీరుతెన్నులు, బొగ్గు సరఫరాపై కేంద్ర ఇంధన శాఖ నిరంతరం సవిూక్షిస్తోంది. ప్రస్తుతం వర్షాలు లేనందున ఒడిసాలోని మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి ర్యాకుల ద్వారా.. కృష్ణపట్నానికి ఓడల్లోనూ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ర్యాకులు పెరిగితే సంక్షోభం తలెత్తదని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ జెన్కో విద్యుత్‌ సంస్థల్లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయని.. ఇందులో తన వైఫల్యం ఏవిూలేదని ఇంధనశాఖ వివరించింది. జెన్కోకు బకాయిలు చెల్లించడం లేదనడం సరికాదని, రెండున్నరేళ్లుగా ఎప్పటికప్పుడు చెల్లించామని వివరించింది. బొగ్గు అంశం కేంద్రం పరిధిలోనిదని, రైల్వే ర్యాక్‌ల కొరత, వర్షాల వల్ల బొగ్గు గనుల్లో తగ్గిన తవ్వకాల కారణంగా దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడిరదని, అంతే తప్ప జెన్కోకు నిధుల కొరత కారణం కాదని ఎపి ప్రభుత్వం వెల్లడిరచింది. జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రాల మూతపై మాత్రం వివరణ ఇవ్వలేదు. అయితే వాస్తవాలు ఏదన్నది పక్కన పెడితే విద్యుత్‌ సంక్షోభం తరుముకొస్తోంది. తీవ్రమైన బొగ్గు కొరతతో థర్మల్‌ ప్లాంట్లు ’మూసివేత’ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అత్యవసరంగా బొగ్గు అందుబాటులోకి రాకపోతే... ఉత్పత్తి ఆగిపోయి తీవ్ర సంక్షోభం నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. దేశంలో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 70 శాతం బొగ్గుతో నడిచే థర్మల్‌ ప్లాంట్ల నుంచే! వీటికి అవసరమైన మూడొంతుల బొగ్గును దేశీయంగా ఉన్న గనుల నుంచే తవ్వి తీస్తారు. మిగిలిన బొగ్గును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే! భారీ వర్షాలతో దేశంలోని బొగ్గు గనుల్లో ఉత్పత్తి పడిపోయింది. రవాణా కూడా తగ్గిపోయింది. ఇక... అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. మన దేశానికి దిగుమతులూ తగ్గిపోయాయి. కేంద్రం విద్యుత్‌ సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఒక్కశాతం కూడా ఉత్పత్తి పెంచడంలో చూపడం లేదు. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపైనా దృష్టి పెట్టలేదు. ’కరోనా’ తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత జాతీయంగా, అంతర్జాతీయంగా మళ్లీ ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నాయి. విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది. 2019తో పోలిస్తే గత రెండు నెలల్లో విద్యుత్‌ వినియోగం ఏకంగా 17శాతం వరకూ పెరిగింది. అదే సమయంలో బొగ్గుకు కొరత ఏర్పడిరది. ఈ నేపథ్యంలోనే... విద్యుత్తుపై స్వయంగా కేంద్రమే ’ప్రమాద ఘంటికలు’ మోగించింది. బొగ్గు సంక్షోభం నెలల తరబడి కొనసాగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ’అసాధారణం’గానే ఉందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కేసింగ్‌ పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మరో ఐదారు నెలలు కొనసాగే అవకాశం ఉందన్నారు. దేశంలో బొగ్గు కొరత సాధారణం కంటే అధికంగా ఉందని, అయితే ఇది విద్యుత్తు సంక్షోభానికి దారితీయదని తెలిపారు. కొద్దిరోజుల్లోనే డిమాండ్‌కు తగినట్లు బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇదంతా పాలనా వైఫల్యం తప్ప మరోటి కాదన్నది గుర్తించాలి.