అచ్చేదిన్‌ రాలేదు


` మోదీ పాలనపై జనం అసంతృప్తి
` బీజేపీ పాలనకన్నా కాంగ్రెసే నయం అన్న భావనలో ప్రజలు
` ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతం
` నోట్ల రద్దు, జీఎస్టీల వల్ల ప్రజలపై కోలుకోలేని ఆర్థిక భారం
` ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వంగా మారిన వైనం
` కాంగ్రెస్‌ను విమర్శించడమే పనిగాపెట్టుకుంటూ కుటిల రాజకీయాలు
` దేశంలో నానాటికి దిగజారుతున్న పరిస్థితులు
` మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న అన్ని పార్టీలు
న్యూఢల్లీి,అక్టోబరు 14(జనంసాక్షి):గత పదేళ్ల కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపిఎ పాలనతో విసిగెత్తిన ప్రజలు ఇప్పుడు కేవలం ఏడేళ్ల మోడీ పాలనతోనే విసుగెత్తుతున్నారు. మోడీ పాలనకన్నా కాంగ్రెసే నయం అన్న భావనలో ప్రజలు ఉన్నారు. గతమే బెటర్‌ అన్న ధోరణి ప్రజల్లో బలంగా నాటుకుంది. అలాగని గతంలో కాంగ్రెస్‌ మంచి చేసిందన్న భావన కాదు. రైతుల ఆందోళనలు, లిఖింపూర్‌ ఘటనలు, పెట్రో, గ్యాస్‌ ధరలు, నిత్యావసర ధరల పెరుగుదల గమనిస్తే ఈ భావన కలుగుతోంది. అంతేగాకుండా ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వంగా మోడీ పేరు తెచ్చుకున్నారు. ఆయన సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. మంత్రులకు అధికారం లేదు. బిజెపి తను చేసిన ఘనకార్యాలను చాటే బదులు ఇంకా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ కుటిల రాజకీయాలను వంటిబట్టించుకుంది. దీంతో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దాదాపుగా అన్ని పార్టీలూ ఏకం అవుతున్నాయి. అధికారంతో కూడిన అహంకారం తలకెక్కినవారికి వాస్తవాలు కనిపించవనడానికి దేశ సమస్యల పరిష్కారంలో వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడమే నిదర్శనం. ఎపికి  ప్రత్యేక హోదా హావిూని అమలుచేయలేక పోవడంతో ఎపిలో ప్రజలు బిజెపి అంటేనే మండిపడుతున్నారు.  ప్యాకేజీ అమలు కాకపోవడంతో పరిస్థితులు తిరగబడ్డాయి. ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెర విూదకు వచ్చింది.  ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోని పార్టీలకు మనుగడ ఉండదని బిజెపి నేతలు భావించడం లేదు. తమకు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తున్నదని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. దీనికంతటికీ కారణం నరేంద్ర మోదీ పాలనాతీరే నిదర్శనంగా చూడాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దేశంలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అందుకే కాంగ్రెస్‌లో ఉత్సాహం రెట్టింపయ్యింది. సమస్యలపై పోరాటంలో ప్రాంతీయ పార్టీల నాయకులే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ కూడా చేయి కలిపింది. చెల్లాచెదురుగా ఉన్న ప్రతిపక్షాలను ఏకం కావడం అన్నది మోడీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రచారం చేయడానికి పనికివస్తోంది. మోడీ ప్రభుత్వం పట్ల ప్రస్తుతం దేశమంతా అసంతప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే నని, దానితో పాటు విభజన సమయం లో ఇచ్చిన హావిూలు అన్నీ అమలు చేయాలని ఇప్టపికీ అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.  ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ బిజెపి దేశాన్ని అడ్డగోలుగా చీల్చేస్తోందని రాహుల్‌ ధ్వజమె త్తారు. లిఖింపూర్‌ ఘటనలో కేంద్రమంత్రి తనయుడి ప్రమేయం ఉన్నా మంత్రిని తప్పించడం లేదు. ప్రస్తుతం దేశమంతా అసంతప్తి, ఆగ్రహంతో ఉంది. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని రాహుల్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివద్ధి, ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పనిచేస్తోందని హావిూ ఇచ్చారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో ఆర్థికవృద్ధి తిరోగమనంలో పడిరదని ఎన్నికలకు ముందు మోడీ విపరీతంగా ప్రచారం చేశారు. అయితే ఆయన పాలన అంతా ప్రచార ఆర్భాటం గా ఉందని తాజా పరిస్థితులు అద్దం పడుతున్నాయి. అందుకే వ్యవసాయం, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగం, పేదరిక నిర్మూలన, దేశ భద్రత, ఆర్థిక, పారిశ్రామిక విధానం, విదేశీ వ్యవహారాలు, కుంభ కోణాలు, అవినీతిపై ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగు తోంది. గత పదేళ్ల కాంగ్రెస్‌ పాపాలను ప్రజలు మరచిపోయారు. ఎందుకంటే బిజెపి పాలన ప్రజలకు భారంగా మారింది. నోట్ల రద్దు, జిఎస్టీ తదితర అంశాల కారణంగా ప్రజలపై కోలుకోలేని ఆర్థిక భారం పడుతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు గుదిబడగా మారాయి. దొడ్డు ధాన్యం కొనబోమని బిజెపి తెలంగాణకు తేల్చి చెప్పింది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. దీంతో పాటు అనేక సమస్యలు ప్రజలను వెన్నాడుతున్నాయి. ఈ దశలో ప్రజలకు మళ్లీ తృతీయప్రత్యామ్నాయం ఆశగా కనిపిస్తోంది. సిఎం కెసిఆర్‌ కూడా అసెంబ్లీ వేదికగా కేందరం తీరును ఇటీవల గట్టిగానే తూర్పారా బట్టారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా పరిస్థితులు బిజెపికి వ్యతిరేకంగా మారుతున్నాయి. వీటిని తెలుసుకుని ముందుకు సాగితేనే మోడీకి మళ్లీ అవకాశం ఉంటుంది.