తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా


హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. సెప్టెంబర్‌ 24న ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏడు రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాలు 37 గంటల 5 నిమిషాల పాటు జరిగాయి. శాసనసభలో 7 రోజుల్లో మొత్తం 41 మంది సభ్యులు ప్రసంగించారు. ఏడు బిల్లులు, ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఆరు అంశాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది.