పాలన చేతకాదని అవమానించారు


పంజాబ్‌ను తలదన్నేలా వరి ధాన్యం ఉత్పత్తి

24గంటల కరెంట్‌తో అద్బుత ప్రగతి
స్లీనరీలో సిఎం కెసిఆర్‌ వెల్లడి
హైదరాబాద్‌,అక్టోబర్‌25 (జనంసాక్షి): తెలంగాణ వారికి పాలన చేతకాదని అవమానించారని, అనేక రకాలుగా దుష్పచ్రారం చేశారని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్‌ అన్నారు. నేడు అనేక రంగాల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని తెలిపారు. పంజాబ్‌ను తలదన్ని వరి ఉత్పత్తిలో అగ్రభాగాన నిలిచిందని సీఎం పేర్కొన్నారు. విద్యుత్‌ సగటు వినియోగంలో నంబర్‌ వన్‌లో ఉందన్నారు. తెలంగాణ పథకాలు దేశ
వ్యాప్తంగా కాపీ కొట్టబడుతున్నాయని అన్నారు. రాయచూరు ఎమ్మెల్యే, నాందేడ్‌ జిల్లా ప్రజలు తెలంగాణ పథకాలు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారని... లేదంటే తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని తెలిపారు. ఇంత గొప్ప అభివృద్ధిని తెలంగాణ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ దామాలు నిర్మించామన్నారు. లక్షా 50వేల కోట్ల ఐటి ఎగుమతులు చేస్తున్నామని తెలిపారు.
సచివాలయం, యాదాద్రి, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ కడతామంటే కేసులు వేశారని... అన్నింటినీ ఛేదించి గొప్ప తెలంగాణను ఆవిష్కరించుకున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. భారతదేశాన్ని తట్టిలేపే దళిత బంధు ఉద్యమాన్ని మొదలు పెట్టామన్నారు. కలలు కనే సాహసం కూడా వుండాలి..స్వాప్నించాలి, సాకారం చేసుకోవాలి.. కొందరు అదెలా సాధ్యం‘ అని ప్రశ్నిస్తున్నారన్నారు. ఏపీ పర్‌ క్యాపిట ఆదాయం లక్షా70వేల కోట్లు, తెలంగాణ పర్‌ క్యాపిట ఆదాయం 2లక్షల ముప్పై వేల కోట్లు అని తెలిపారు. నేడు తెలంగాణలో 24గంటల కరెంట్‌, ఏపీలో కరెంట్‌ కోతలు ఉన్నాయన్నారు. ఎక్కడి తెలంగాణ, ఎక్కడి ఏపీ నేడు పొంతన లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు