వాగులో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌26(జనం సాక్షి);  మొయినాబాద్‌ మండల్‌ వెంకటాపూర్‌ కత్వ వద్ద ఈసీ వాగులో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ ముగ్గురు స్నేహితులు కలిసి ఈసీ వాగులో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు వాగులో గల్లంతు కాగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. మృతులను మొయినాబాద్‌ మండలం సజ్జన్‌పల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.