స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌23 వరకు నామినేషన్ల స్వీకరణ..

  

24న పరిశీలన 26న నామినేషన్ల ఉపసంహరణడిసెంబర్‌ 10 పోలింగ్‌..14న కౌంటింగ్‌

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడిరది. కేంద్రెన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 26. డిసెంబర్‌ 10న పోలింగ్‌, డిసెంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 1, వరంగల్‌ 1, నల్లగొండ 1, మెదక్‌ 1, నిజామాబాద్‌ 1, ఖమ్మం 1, కరీంనగర్‌ 2, మహబూబ్‌నగర్‌ 2, రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ 12 స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి 4తో ముగియనున్నది. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు.న తిరిగి ఆమెకు మరోమారు అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.