కార్తీక సోమవారంతో ఆలయాల్లో సందడి

  


కార్తీక దీపాలు వెలిగించిన మహిళలుశైవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు

పుణ్యతీర్థాల్లో స్నానాలు ఆచరించిన భక్తులు

హైదరాబాద్‌/విజయవాడ,నవంబర్‌22 (జనం సాక్షి) :తెలుగు రాష్టాల్ల్రో కార్తీక సందడి నెలకొంది. కార్తీక సోమవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి దీపారాధన చేశారు. వేములవాడ, శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం, ఆలయ ఉత్త మాడ వీధిలో కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారి అలంకార దర్శనానికి అధికారులు అనుమతించారు. దీంతో భక్తులు మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. భక్తుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌ లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు దీపారాధన చేపట్టారు. అనేక ఆలయాలు కార్తీక సందడి కనిపించింది. దీపారాధనతో మహిళలుసందడిగా కనిపించారు. దీంతో తెలుగు రాష్టాల్ల్రో కార్తీకశోభతో ఆలయాలు కిటకిటలాడాయి. సముద్రస్నానాలు, నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాలు భక్తులతో అలరారాయి. న పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసం సోమవారం ఎన్నో విశిష్టతల వేదిక. ఈ రోజున ఉపవాసం చేసిన వారికి సదాశివుడు మోక్షధామం ప్రసాదిస్తాడని, పునర్జన్మ లేకుండా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందన్న వేదోక్తంకారణంగా పలువురు ఉదయాన్నే పుణ్యస్నానాలు చేసి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ శైవక్షేత్రాలతో పాటు నదీ తీర ప్రాంతాల్లో ఉన్న శివాలయాల్లో రద్దీ నెలకొంది. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తిలతో పాటు పంచారామ క్షేత్రాలైన అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాల్లో భక్తుల రద్దీ కొనసాగింది.  తెల్లవారుజాము నుంచే నదీజలాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. రాజమండ్రి వద్ద గోదావరి స్నానాలతో గోదావరి పులకరించింది. తెలంగాణ ªూష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ, కీసర, కాళేశ్వర, జోగులాంబ,  వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు చేరుకుని శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రామాల యంలో దర్శనం చేసుకున్నారు. బాసర,ధర్మపురి ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. ఆలయాల్లో కార్తీక పూజలు చేశారు. యాదగిరిగుట్ట లో సత్యనారాయణ స్వామి వ్రతాలు విరివిగా చేపట్టారు. భక్తులు శివాలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు చేశారు.  సముద్ర, నదీతీరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం,మహానంది, భపంచారామాలు, కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గ, శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు  పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. విజయవాడలో కృష్ణాతీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా ప్రాచీన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణాతీరం, గోదావరి తీరాల్లో తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బాసరలో ప్రత్యేక పూజలకు తరలివచ్చారు. ఉదయాన్ని పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి అభిషేకాలు నిర్వహించారు. భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసంలో జరిగే పుణ్యస్నానాలను పురస్కరించుకొని ఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. పలువురు భక్తులు అయ్యప్ప మాలలు ధరించారు. ఇలా భక్తులతో దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి.