వ్యవసాయచట్టాలపై సభలో నిలదీయాలి


` టీఆర్‌ఎస్‌ ఎంపీలకు నేడు సీఎం భేటి
` పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎంపిలకు సిఎం కెసిఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 29నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కానున్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ చర్చించి, ఎంపీలకు దిశానిర్దేశర చేయనున్నారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరిపై ప్రధానంగా చర్చించనున్నారు.