విజయనగరం, నవంబర్30(జనం సాక్షి) : గురజాడ అప్పారావు 106 వ వర్థంతి సందర్భంగా... మంగళవారం విజయనగరంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. స్థానిక గురజాడ అప్పారావు స్వగ్రామంలో ఆయన చిత్రపటం ముందు అధికారులు జ్యోతి ప్రదీపన చేశారు. జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జె.సి.వెంకటరావు, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి కలిసి గురజాడ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గురజాడ వారి గేయాలు పాడుతూ, ఆయన రచించిన కన్యాశుల్కం నాటక పుస్తకం, కళ్ళ అద్దాలు, స్టాప్ ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఎం.ఆర్.కళాశాల సెంటర్లలో ఉన్న గురజాడ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... భౌతికంగా గురజాడ లేకపోయినప్పటికీ ఆయన నాటకాలు, పద్యాలు, రచనలు బతికే ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను గురజాడ సంపాదించారన్నారు. కుల, మతాలకు అతీతంగా సమాజ అభ్యున్నతికి నిరంతరం రచనలు ద్వారా కఅషి చేశారన్నారు. ఈమధ్య కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గురజాడ గేయాల పై మాట్లాడారంటే ఆయన ప్రతిష్ట ఎంత గొప్పదో తెలుస్తుందని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు వెంకట ప్రసాద్, ఇందిరా, వివిధ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా గురజాడ అప్పారావు వర్థంతి