ఎసిబి వలలో పంచాయితీ అధికారి
పెద్దపల్లి,నవంబర్30(జనం సాక్షి): లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ వ్యవహరిస్తున్నారు. కాగా, కాంట్రాక్టర్ రజనీకాంత్ చేసిన పనులకు బిల్లులు చెలించేందుకు కొన్నిరోజులుగా రజనీకాంత్‌ను ఆర్డీఓ ఇబ్బందులు పెడుతున్నాడు. పర్సంటేజ్ ఇస్తేనే సంతకం పెడుతానని ఆర్డీఓ స్పష్టం చేశాడు. దీంతో రజనీకాంత్ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు కాంట్రాక్టర్ రజనీకాంత్ ఇచ్చిన లక్ష రూపాయలను తన బంధువు ద్వారా తీసుకుంటుండగా ఆర్డీవోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇకపోతే రూ. 5,500 లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. నాగర్ కర్నూల్ జిల్లా మండల పరిధిలోని రంగాపూర్ గ్రామానికి చెందిన సంకెళ్ల రాము తన తల్లి పేరు విూద ఉన్న ఇల్లును తన పేరుపై మార్చేందుకు రంగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి పంచాయతీ కార్యదర్శి రామస్వామి రూ.5,500 డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రాము ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ంఞశి అధికారుల పథకంలో భాగంగా బాధితుడు రాము డబ్బులను కార్యదర్శి రామస్వామికి ఇస్తుండగా ఎసిబి అధికారులు రామస్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.