జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో బీజేపీ మెరుపు ధర్నా

హైదరాబాద్‌,నవంబర్‌ 23 (జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో బీజేపీ మెరుపు ధర్నాకు దిగింది. మేయర్‌ కార్యాలయంలోకి బీజేపీ కార్పొరేటర్లు దూసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ ఆఫీసుకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. బల్దియాకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. మేయర్‌ హఠావో అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. అటు మేయర్‌ చాంబర్‌లో ఫర్నీచర్‌ను బీజేపీ నేతలు  ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.