తిరుమల పరిస్థితులపై చిరంజీవి ఆవేదన

హైదరాబాద్‌,నవంబర్‌19 జనం సాక్షి :  తిరుమల, తిరుపతిలో ఇప్పుడున్న పరిస్థితిపై నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తనకు ఎంతగానో బాధగా ఉందని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు పడుతున్న ఇబందులు తన మనస్సును కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వం, టిటిడి కలిసి పనిచేసి వీలయినంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకురావాలని ఆయన కోరుకున్నారు. అన్ని రాజకీయపక్షాలు, అభిమాన సంఘాలు చేయూతనివ్వాలని కూడా ఆయన కోరారు.