భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు


హైదరాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో వర్షాలు కురుస్తుండటంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను దారిమళ్లించినట్లు, ఇంకొన్ని ఆలస్యంగా నడవనున్నట్లు తెలిపింది. విశాఖపట్నం`కడప (17488) రైలు, తిరుపతి`భువనేశ్వర్‌, బిట్రగుండ`చెన్నై సెంట్రల్‌, చెన్నై సెంట్రల్‌`బిట్రగుంట, చెన్నై సెంట్రల్‌`బిలాస్‌పూర్‌, హౌరా`యశ్వంత్‌పూర్‌, హౌరా`చెన్నై సెంట్రల్‌, హౌరా`కన్యాకుమారి, ధన్‌బాద్‌`అలప్పుజ, ముజఫర్‌పూర్‌`యశ్వంత్‌పూర్‌ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి రైళ్లు యధావిధిగా నడుస్తాయని తెలిపారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించామని చెప్పారు.