తుమ్మల,వేణుగోపాలచారి, సీతారాం నాయక్‌లకు దక్కని ఊరట
సిట్టింగ్‌లకు కూడా మరోమారు ఎమ్మెల్సీ హుళక్కినేటితో ముగియనున్న నామినేషన్ల దాఖలు
హైదరాబాద్,నవంబర్22(జనం సాక్షి): టీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారయ్యింది. 12 మందితో కూడిన జాబితాకు సిఎం కెసిఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ జాబితా ప్రకారం ఏడుగురి సిట్టింగ్ స్థానాలు గల్లంతయ్యాయి. అభ్యర్థుల ఎంపిక కోసం పెద్ద కసరత్తే జరిగింది. సామాజిక, ప్రాంతీయ సవిూకరణాలను లెక్కలోకి తీసుకున్నారు. ఇక కవితకు ªూజ్యసభ దాదారు ఖరారైనట్లే తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎంపికైన బండ ప్రకాష్ స్థానంలో కవిత రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ జాబితాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుంటే ఎమ్మెల్సీ సీట్లు ఆశించిన సీనియర్లకు భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే కోటాలోనూ, స్థానిక సంస్థల కోటాలోనూ వీరికి స్తానం దక్కలేదు. ఇలా దక్కని వారిలో సిట్టింగులతో పాటు పలువురు సీనియర్లు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, వేణుగోపాలాచారి, ప్రొఫెసర్ సీతారాం నాయక్, బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. ఇక స్థానిక కోటాలో జిల్లాల వారీగా ఖరారైన అభ్యర్థుల పేర్లు పరిశలిస్తే వరంగల్`పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్`ఎల్.రమణ, భానుప్రసాద్, నిజామాబాద్`ఆకుల లలిత, ఆదిలాబాద్`దండె విఠల్,మెదక్`భూపాల్ రెడ్డి లేదా యాదవ్‌రెడ్డి,ఖమ్మం`తాత మధు, మహబూబ్‌నగర్`గాయకుడు సాయిచంద్,కసిరెడ్డి నారాయణరెడ్డి,నల్గొండ`సి.కోటిరెడ్డి,గంగారెడ్డి` శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డిల పేర్లు ఖరారయ్యాయి.ఇందులో కొందరు నామినేషన్లు వేస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 23 కావడంతో కొందరు నామినేషన్లు వేశారు. నవంబర్ 24న పరిశీలన, నవంబర్ 26 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది., డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో కుల సవిూకరణాలే కీలకం అయ్యాయని తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశావహులు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ మరోమారు సీటు ఆశించి భంగపడ్డారు. తనకు మరోసారి అవకాశం ఇస్తారనే లెక్కల్లో ఉన్న పురాణం సతీష్‌కు నిరాశ తప్పలేదు. టికెట్ ఆశిస్తున్నవారంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వీడి హైదరాబాద్‌లో వాలిపోయారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ మొదలుపెట్టారు. నిర్మల్ జిల్లా నుంచే ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ సీటుకోసం ప్రయత్నించారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, సీనియర్ నేతలు, శ్రీహరిరావు, సత్యనారాయణ గౌడ్‌లు అధిష్ఠానం దగ్గర అర్జీ పెట్టుకున్నట్టు సమాచారం. కొమురం భీం జిల్లా నుంచి అరిగెల నాగేశ్వరరావు పేరు కూడా రేస్‌లో వినిపించింది. యాదవ సామాజిక వర్గం కోటాలో తప్పకుండా పట్టం కడతారని ఆయన భావించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన అరవిందరెడ్డి సైతం నేనున్నాను అని ముందుకొచ్చారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా పోటీ పడ్డారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రొఫెసర్ సీతారం నాయకు కడా టిక్కటెª` ఆశించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు.. స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో కుల సవిూకరణాలు కీలకం అయ్యాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.