హైదరాబాద్,నవంబర్29((జనం సాక్షి ): రాష్ట్రంలో బీజేపీకి ఉనికి అసలు లేనే లేదని, కేవలం ఉనికి కోసమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కొట్లాట రాజకీయం కోసమే తప్ప రైతుల కోసం కాదన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలు ఇక వరి డ్రామాలు ఆపాలన్నారు. ఆకస్మిక పర్యటనలతో రైతుల సమస్యలను తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. వరి ధాన్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రగడ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రెండు నెలలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతులంతా రాత్రిళ్లు వరి కుప్పలదగ్గరే పడుకుంటున్నారని పేర్కొన్నారు. 60 శాతం ధాన్యం ఇంకా రోడ్లవిూదనే ఉందన్నారు. కొనుగోలు ఆలస్యం కావడం వల్ల కల్లాల్లోనే ధాన్యం మొలకెత్తి రైతులు నష్టపోతున్నారన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఉన్న చోట టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా వుండే రైతులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ నేతలు టీవీల్లో మాట్లాడడం కాదు, వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
రాష్ట్రంలో బిజెపి ఉనికి లేనేలేదుఉనికి కోసమే బండి సంజయ్ ఆరాటం: జగ్గారెడ్డి