వ్యాక్సిన్ తీసుకోవాలని సూచనరాజన్న
సిరిసిల్ల,డిసెంబర్10 జనంసాక్షి: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలతో కేటీఆర్ ముచ్చటించారు. ఆసరా పెన్షన్లు వస్తున్నాయంటూ ఆప్యాయంగా పలుకరించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించిన కేటీఆర్.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇక సారంపల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడి వివాహ రిసెప్షన్‌కు కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీకాంత్ టీఆర్‌ఎస్ యూత్ నాయకుడిగా కొనసాగుతున్నారు. శ్రీకాంత్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కేటీఆర్ స్వాగతం పలికారు.