రోడ్లను బుగ్గలతో పోల్చడం సరైనదేనా

 వ్యాఖ్యలుచేసిన మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నా
మహామంత్రి తీరుపై ఎంపి హేమమాలిని అసహనం
నిరసనలు రావడంతో క్షమాపణలు చెప్పిన మంత్రి గులాబ్‌
న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) : మహారాష్ట్రలోని తన నియోజకవర్గం ధరంగావ్‌లో రోడ్లు అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయంటూ ఆదివారం శివసేన సీనియర్‌ నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై హేమమాలిని తీవ్రంగా స్పందించారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సాంప్రదాయాన్ని గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ మొదలుపెట్టారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి కామెంట్‌లు మంచివి కావని హేమమాలిని వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్‌లు చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కానీ గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని అన్నారు. విూ బుగ్గలపై కామెంట్‌ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ కోరుతారా..? అని విూడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను ఆ వ్యాఖ్యలను పట్టించుకోనని హేమమాలిని స్పష్టంచేశారు.
తన నియోజవర్గంలో అభివృద్ధి ఉరకలెత్తిందని, రోడ్లు సీనియర్‌ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉంటాయని వ్యాఖ్యానించిన మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత గులాబ్‌రావు పాటిల్‌ క్షమాపణలు చెప్పారు. విపక్ష భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్లు సోమవారం పేర్కొన్నారు. ఎన్సీపీ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే నియోజవకర్గమైన ముఖ్తాయినగర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాటిల్‌ పాల్గొన్నారు. అనంతరం ఖడ్సేని టాª`గ్గంªట్‌ చేస్తూ ఈ నియోజకవర్గంలో ఒకాయన 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి ఏవిూ కనిపించడం లేదు. నా నియోజకవర్గం ధరంగాన్‌కి వచ్చి చూడండి. ఫస్ట్‌ క్లాస్‌ అభివృద్ధి కనిపిస్తుంది. ధరంగాన్‌లో రోడ్లు హేమామాలిని బుగ్గల్లా కనిపించకపోతే రాజీనామా చేస్తా‘ అని పాటిల్‌ ఛాలెంజ్‌ విసిరారు. కాగా, పాటిల్‌ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడిరది. ‘పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు మహిళా సమూహాన్ని కించపరిచాయి. మంత్రి పాటిల్‌పై మహా వికాస్‌ అగాడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. పాటిల్‌పై పోలీసు కేసు కూడా ఫైల్‌ చేస్తాం‘ మహారాష్ట్ర మండలి ప్రతిపక్ష నేత ప్రవీణ్‌ దరేకర్‌ అన్నారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. రాజకీయంగా తీవ్రంగా ఒత్తిడి పెరుగుతుండడంతో పాటిల్‌ క్షమాపణలు చెప్పక తప్పలేదు.