రోడ్డు మరమత్తు పనులను పరిశీలించిన టీటీడీ చైర్మన్‌

తిరుమల, డిసెంబర్‌11 (జనంసాక్షి) :

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్‌ ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను టీటీడీ చైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా సుబ్బారెడ్డి మరమత్తు పనులు చేస్తున్నకార్మికులతో మాట్లాడారు. బండరాళ్లను ఎలా తొలగిస్తున్నారు.? రాళ్లు కింద పడకుండా వాల్‌ కాంక్రీటు ఎలా చేస్తున్నారో..? మరమ్మతు జరుగుతున్న పనులను టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి పరిశీలించారు. రోడ్డు పనులు ఎప్పటివరకూ పూర్తవుతాయనే వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు.