ఆసిఫాబాద్‌ ఎస్‌బిఐలో భారీచోరీ

కుమ్రంభీం అసిఫాబాద్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి )  : అసిఫాబాద్‌ మండలంలోని అడా ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బ్యాంక్‌ కిటికీలు పగులగొట్టి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటన స్థలాన్ని అడ్మిన్‌ ఎస్పీ సుధీంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంకులో దొంగలు కట్టర్ల సహాయంతో లాకర్లను తొలగించినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు.ఈ చోరీలో బ్యాంకు లాకర్లో ఉన్న 5 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బ్యాంకులో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం దొంగలు పగలగొట్టినట్లు ఎస్పీ వివరించారు. దుండగులను తొందరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.