ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశాంతంగా పోలింగ్‌








ఓటేసిన మంత్రి కెటిఆర్‌, పలువురు ఎమ్మెల్యేలు

ఓటరు జాబితలో ఈటెల ఓటు గల్లంతు

హైదరాబాద్‌,డిసెంబర్‌ 10(జనంసాక్షి): తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కొనసాగుతోంది.. ఉదయమే పోలింగ్‌ ప్రారంభమయ్యింది. తెలంగాణలో సందడిగా పోలింగ్‌ ప్రారంభమయ్యింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం జరుగుతున్నాయి. లోకల్‌బాడీ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగు తుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో మంత్రి కేటీఆర్‌  తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో దండే విఠల్‌ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ లో ఎమ్మెల్యే జోగు రామన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలావుంటే మంచిర్యాల జెడ్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే దివాకర్‌ రావు ఓటు వేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్‌, పటాన్‌చెరూలో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1324 మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.ఎమ్మెల్సీ ఓటర్‌ లిస్టులో ఈటల రాజేందర్‌ పేరు గల్లంతయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. కాగా.. కరీంనగర్‌ జిల్లాలో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్సీ ఎలక్షన్‌ ఓటర్‌ లిస్ట్‌లో ఆయన పేరు నమోదు కాలేదు.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్‌ ఓటర్‌ లిస్ట్‌ సవరణ చేసే సమయానికి ఈటల ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఆయన పేరు జాబితాలో నమోదు కాలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఐదు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆదిలాబాద్‌లో అత్యధికంగా పోలింగ్‌ నమోదవగా, కరీంనగర్‌లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆదిలాబాద్‌లో 77.05 శాతం, నల్లగొండలో 42.8 శాతం, కరీంనగర్‌లో 17.82 శాతం, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 42.1 శాతం, ఖమ్మం జిల్లాలో 21.22 శాతం పోలింగ్‌ నమోదయింది. ఉమ్మడి ఐదు జిల్లాల్లో 6 స్థానాకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలోని 5 జిల్లాల్లోని 6 స్థానాలకు జరిగే పోలింగ్‌ కోసం 37 కేంద్రాలు సిద్ధం చేశారు. మొత్తం ఓటర్లు 5, 326 మంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌. లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు చోట్ల పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానిదే మెజార్టీ. ప్రస్తుత బలాబలాల ప్రకారం సువులుగా విజయం సాధిస్తుంది. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ పోటీలో ఉంది. కరీంనగర్‌లో టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ పోటీలో ఉండడంతో గట్టి పోటీ ఏర్పడిరది.  విజయం ఖాయమైనప్పటికీ టిఆర్‌ఎస్‌  జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఓటర్లు చేజారకుండా జిల్లాల వారీగా అందరినీ క్యాంపులకు తరలించింది. ఇవాళ పోలింగ్‌ కావడంతో రెండురోజుల ముందే అందరూ జిల్లాలకు చేరుకున్నారు. ఇక 14న ఫలితాలు ప్రకటిస్తారు. నల్లగొండ జిల్లాలోని 8 కేంద్రాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 1271 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. వీరిలో 19 మంది ఎక్స్‌ అఫిషియో ఓటర్లు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగియనుంది. పోలింగ్‌ అనంతరం అన్ని బ్యాలెట్‌ బాక్స్‌లను నల్లగొండలోని మహిళ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టాంª`రగ్‌ రూమ్‌కు తరలించనున్నారు.`