యువతి ప్రాణం తీసిన అజాగ్రత్త

శ్రీశైలండిసెంబర్‌3 జనంసాక్షి : బస్సు ప్రయాణంలో అజాగ్రత్తే యువతి ప్రాణం తీసిన ఘటన గురువారం కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్‌ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన యువతి (20) కార్తీక మాసం సందర్భంగా... శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం నిన్న ఆర్‌టిసి బస్సులో బయలు దేరింది. శ్రీశైలానికి పది కిలోమీటర్ల దూరంలోని నల్లమల ఘాట్‌ రోడ్డు మలుపు వద్దకు రాగానే ఆమె తన తలను కిటికీలోంచి బయటకు పెట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ యువతి తలను బలంగా ఢకొరెది. ఈ దుర్ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆర్‌టిసి అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. యువతి గుంటూరు జిల్లా నర్సరావుపేటలో డిగ్రీ చదువుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.