మాణికేశ్వర్‌ నగర్‌లో భారీ చోరీ

హైదరాబాద్‌,డిసెంబర్‌2( జనం సాక్షి ) :

ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. 90 తులాల వడ్డానం, 20 తులాల లాంగ్‌ చైన్‌ నాలుగు లక్షలు నగదు చోరీకి గురయ్యాయి. ఓయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనం ఇంటి దొంగల పనేనని యజమానురాలు రంగమ్మ అనుమానిస్తున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో ఉన్న అల్లుడే దొంగతనం చేసినట్టు విచారణలో తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేజర్‌ పార్టు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగితా బంగారం కోసం విచారిస్తున్నారు.