హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతుల గుర్తింపు

మరో ఆరుగురి మృతదేహాల గుర్తించి అప్పగింత

న్యూఢల్లీి,డిసెంబర్‌11(జనంసాక్షి) :

హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించినవారిలో మరో ఆరుగురి మృత దేహాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయితేజతోపాటు వివేక్‌ కుమార్‌, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. వారి పార్థివదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిం చామని ఆర్మీ అధికారులు వెల్లడిరచారు. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించ నున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాల ను గుర్తించే పక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. గత బుధవారం తమిళనాడులోని ఊటీ కొండల్లో వాయుసేన విమానం కుప్పకూలింది. దీంతో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులు సహా 13 మంది మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతదేహాలు పూర్తి కాలిపోవడంతో గుర్తింపు పక్రియ ఆలస్యమయింది. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు బ్రిగేడియర్‌ లిద్దరు మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు. మరో 10 మందిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, వారిని గుర్తిస్తున్నారు.