హెలికాప్టర్‌ ఘటనపై ఊహాగానాలు వద్దు: వాయుసేన

  


న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్‌ ఎంఐ`17 వీ5 కూలిన ఘటనలో సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మొత్తం 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై అసంబద్ధ ప్రచారాలు జరుగుతున్నట్లు వాయుసేన తన ట్విట్టర్‌లో తెలిపారు. నిరాధార ఆరోపణలను ఆపేయాలని ఆ ట్వీట్‌లో ఐఏఎఫ్‌ కోరింది. త్వరలోనే ప్రమాద ఘటనకు చెందిన వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పింది. రావత్‌ దంపతులతో పాటు రక్షణదళ సిబ్బంది మృతి పట్ల త్రివిధదళ దర్యాప్తు చేపట్టనున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. త్వరితగతిన ఈ ఘటన పట్ల విచారణను పూర్తి చేయనున్నట్లు ఐఏఎఫ్‌ తెలిపింది.