అంబేడ్కర్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

  




పార్లమెంట్‌ ఆవరణలో విగ్రహానికి పుష్పాంజలి

న్యూఢల్లీి,డిసెంబర్‌6 జనంసాక్షి : రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.`డా.బీఆర్‌ అంబేద్కర్‌ 1891, ఏప్రిల్‌ 4న జన్మించారు. సామన్య దళిత కుటుంబంలో పుట్టిన ఆయన ఆర్టికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారు. ఆయన 1956, డిసెంబర్‌ 6న కన్నుమూశారు. ఆయనకు 1990లో దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.