కత్తివిూద సాముగా కొత్త త్రివిధ దళాధిపతి ఎంపిక


మరో 7 రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

రావత్‌ అంతటి సమర్థ నేత కోసం కసరత్తు

న్యూఢల్లీి,డిసెంబర్‌9 (జనంసాక్షి  ): ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మిలిటరీ జెనెరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి చెందడంతో.. దేశ అత్యుత్తమ రక్షణ పదవి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ సిడియస్‌ త్రివిధ దళాధిపతి ఎవరన్న ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. ఈ పదవిని నిర్వహించడం ఆషామాషీ కాదని రావత్‌ నిరూపించారు. ఆయన మరణంతో ఇప్పుడా పదవిని భర్తీ చేయడం ప్రభుత్వానికి కత్తివిూద సాము కానుంది. రావత్‌  లోటును భర్తీ చేయడం అంత సులువు కాదు. దానికి కారణం ఈ పదవిని సృష్టించడానికి ఎన్నో దశాబ్దాల కృషి పట్టింది.భూతల, వైమానకి, జల రక్షణ దళాలను సమన్వంతో ముందుకు నడపడానకి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ పదవిని సృష్టించారు.  చైనాతో సరిహద్దులో ఘర్షణ వాతావరణం ఉండడంతో ఇప్పుడు అత్యవసరంగా కొత్త సిడియస్‌ని నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖ మరో వారం రోజుల్లో ప్రకటన చేయనుందని సమాచారం. బిపిన్‌ రావత్‌ పదవి కాలం మరో ఏడాది ఉండగానే ఆయన చనిపోవడంతో సిడియస్‌ పదవిని ఎవరు చేపడతారని.. అందరూ ఆలోచిస్తున్నారు. బిపిన్‌ రావత్‌ అకాల మరణంతో ప్రస్తుతం అపద్ధర్మ సిడియస్‌గా చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జెనెరల్‌ ముకుంద్‌ నరవాణె ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముకుంద్‌ నరవాణె ప్రస్తుతం దేశంలో సీనియర్‌ మోస్ట మిలిటర్‌ ఆఫీసర్‌. ఆయన తరువాత స్థానంలో ఆర్మీ వైస్‌ చీఫ్‌ లెప్టినెంట్‌ జెనెరల్‌ సిపి మొహంతి, నార్తన్‌ ఆర్మీ ప్టినెంట్‌ జెనెరల్‌ వైకె జోషి ఉన్నారు. సిడియస్‌ పదవి పొందడానికి గరిష్ఠ వయస్సు పరిమితి 65 సంవత్సరాలు. షెకాట్కర్‌ కమిటీ సూచనల ప్రకారం ప్రభుత్వం మూడు రక్షణ దళాల అధిపతులలో ఒకరిని సిడియస్‌గా నియమిస్తుంది. అదే సమయంలో మొదటి రెండు లేదా మూడు పర్యాయాలు సిడియస్‌గా ఆర్మీ చీఫ్‌ ని నియమించాలని రక్షణ మంత్రిత్వశాఖ యోచిస్తోంది. దీనికి కారణం భారతదేశానికి ఎక్కువగా సరిహద్దు దేశాలైన పాకిస్థాన్‌, చైనాతోనే ఎక్కువగా యుద్దాలు జరగడం కారణంగా చూడాలి.