నేడో రేపో ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచేందుకు ప్రణాళికలు
హైదరాబాద్,డిసెంబర్3 జనంసాక్షి : ఇప్పటికే పెట్రోల్, డీజిల్,నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటగా.. నేడో రేపో ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచేందుకు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలపై భారీగానే ధరలభారం మోపేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడిప్పుడే.. కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతలో కొంత బయటపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు సైతం తన ఆర్థిక పరిస్థితులను గట్టెక్కించుకునేందుకు ప్రజలపై భారం మోపేందుకు సిద్ధం అవుతోంది. ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపితే.. బస్సు ప్రయాణం పేదల ప్రజలకు భారంగా మారనుంది. ఇదే క్రమంలో విద్యుత్ బిల్లులు కూడా పెంచాలని సర్కారు ఆలోచన చేస్తోంది. విద్యుత్ ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని.. గత ఐదేళ్లుగా విద్యుత్ చార్జీలు ఒక్కపైసా కూడా పెంచకపోవడంతో నష్టాలతో పాటు.. ఆర్థిక లోటు పెరిగిపోయిందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ సర్కారుకు నివేదిక అందించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూనిట్ కు కొంతలోకొంత రూపాయి అయినా పెంచితే తప్పా ఆర్థిక కష్టాలు తీరవని డిస్కంలు భావిస్తున్నాయి. దీంతో ఈ సారి కరెంటు చార్జీల పెంపు భారీగానే ఉండనుంది. గతంలో మారిదిగా ప్రజలపై పడే భారం ఏర్పడకుండా.. యూనిట్ కు 5నుంచి 10 పైసల చొప్పున పెంచితే.. సంస్థకు ఎలాంటి ప్రయోజనం ఉండదని.. పైగా చార్జీలు పెంచిన పేరే తప్పా.. ఆర్థికంగా జరిగే నష్టాలను ఏ మాత్రం పూడ్చే అవకాశం ఉండదని విద్యుత్ సంస్థ భావించింది. ప్రస్తుత ఏడాదితో పాటు వచ్చే ఏడాది కలిపి రూ.21,552 వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని.. వీటితో పాటు ఏడాదికి రూ.6వేల కోట్ల నష్టం చవిచూడాల్సి వస్తోందని వివరించింది. రాష్ట్రంలో ఏటా నాలుగువేల కోట్ల యూనిట్ల విద్యుత్ ను ప్రజలకు విక్రయిస్తుండగా.. యూనిట్ కు సగటున రూపాయి చొప్పున పెంచితే రూ.4వేల కోట్ల ఆదాయం ఏటా పెరుగుతుంది. ప్రస్తుత చార్జీలు కొనసాగిస్తే.. 10వేల కోట్ల లోటు ఉంటంది.యూనిట్ కు రూపాయి చొప్పున పెంచినా. మరో రూ.6వేల కోట్ల లోటు ఉంటుంది. ఈ క్రమంలో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని సంస్థ చెబుతోంది. యూనిట్ కు రూ.1 చొప్పున పెంచితేనే.. మరో రూ.6కోట్ల భారం పడుతోందని.. ఈ క్రమంలో పెంపు అనివార్యంగా మారిందని సంస్థ చెప్పుకొస్తోంది. ఇందుకు సంబంధించిన నివేదిక అందించాలని ఈఆర్సీ కోరింది. వారం రోజుల్లో విద్యుత్ బిల్లుల ప్రతిపాదన నివేదిక తయారు కానుంది. 120 రోజుల తరువాత బిల్లుల పెంపు ప్రతిపాదన అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే పెరిగిన నిత్యవసరాలు.. ఇతర ఖర్చులు.. ఇంధన ధరలతో పాటు .. మరోసారి కరోనా భయం పొంచి ఉన్న క్రమంలో సర్కారు చార్జీల పెంపు నిర్ణయంపై పునర్ ఆలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్థికంగా చితికిపోయి ఉన్న తమ జీవితాలపై చార్జీల గుదిబండ ను మోపడం సరికాదని చెబుతున్నారు. ఈ విషయమై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.......
దేశంలోనే తొలిసారిగా బస్తి దవాఖానాల ఏర్పాటుత్వరలో 144 బస్తి దవాఖానాలు ఏర్పాతుచేస్తామన్న హరీష్ రావుహైదరాబాద్,డిసెంబర్3(ఆర్‌ఎన్‌ఎ): దేశంలోనే మొదటి సారిగా బస్తి దవాఖాన్ ప్రారంభించిన ఘనత మనదేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 15వ ఆర్ధిక సంఘం హైద్రాబాద్‌లో ప్రారంభమైన బస్తి దవాఖానలను మోడల్‌గా తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించిందన్నారు. హైద్రాబాద్‌లో బస్తి దవాఖానా ప్రారంభమైన తరవాత ఇతర జిల్లాలు నుంచి డిమాండ్ వస్తోందని హరీష్‌రావు పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘’144 బస్తి దవాఖానాలను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పరీక్షలు చేస్తున్నాం.11 లక్షల మందికి ఉచిత పరీక్షలు చేశాం. రిపోర్ట్స్ నేరుగా మొబైల్‌కి వస్తున్నాయి. 4 సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను నిర్మించబోతున్నాం. ఓమిక్రాన్ అని కొత్త వైరస్ వచ్చింది అని ప్రజలు భయపడుతున్నారు.ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదర్కొవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కొక్క ఇంటికి వెళ్లి మరీ వాక్సిన్ వేయించాలి. ఓమైక్రాన్ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదు. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆమె శాంపిల్‌ను జీనామ్ సీక్వెన్స్‌కి పంపించాం. రిపోర్ట్ రావడానికి 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు.