గుజరాత్‌లో ఓ వ్యక్తిపై కేసు నమోదు
అహ్మాదాబాద్,డిసెంబర్ 10 జనంసాక్షి: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన 44 ఏళ్ల ఓ గుజరాతీ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడని 153`ఏ సెక్షన్ కింద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మతాన్ని అవమానిస్తున్న కారణంతోనూ 295`ఏ సెక్షన్ కింద అతన్ని బుక్ చేశారు. అహ్మాదాబాద్‌కు చెందిన సైబర్ కైర్ర సెల్ పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అమ్రేలీ జిల్లాలోని రాజులా తాలూకాకు చెందిన శివాభాయ్ రామ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ శివాభాయ్ రామ్ పలుమార్లు అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే బిపిన్ రావత్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేశారన్న అంశాన్ని వెల్లడిరచలేదు.